Breaking News
Home / Tag Archives: jagan government

Tag Archives: jagan government

జగన్ ప్రభుత్వంపై సీపీఐ నేత వ్యాఖ్యలు…

అమరావతి: కోర్టులతో ఏపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని సీపీఐ నేత రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ రంగులపై హైకోర్టు చెప్పినా వినకుండా సుప్రీంకోర్టుకు వెళ్లారని మండిపడ్డారు. అధికారం ఉందని అడ్డగోలుగా వ్యవహరిస్తామంటే కుదరదని ఆయన అన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు అందరితో చర్చించాలన్నారు. గతంలో ఏ ప్రభుత్వాన్ని ఇన్ని సార్లు కోర్టు చీవాట్లు పెట్టిన సందర్భం లేదని తెలిపారు. జగన్‌ ప్రభుత్వం ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలని రామకృష్ణ సూచించారు.

Read More »

21న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు చంద్రబాబు పిలుపు….

అమరావతి: విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఈ నెల21న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అన్ని మండలాలు, నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టాలని తెలిపారు. ఇళ్లలోనే ఉంటూ దీక్షలు చేయాలని టీడీపీ శ్రేణులను ఆదేశించారు. 3, 4 రెట్లు విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తున్నామని చంద్రబాబు అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజానీకం ఉంటే కరెంటు బిల్లులు పెంచడం హేయమని మండిపడ్డారు. దేశంలోని డిస్కంలకు …

Read More »

జగన్ సర్కారుకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు…

విశాఖపట్నం : ఎల్జీ పాలిమర్స్ ఘన నేపధ్యంలో రాష్ట్రానికి జాతీయ మానవహక్కుల కమిషన్ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. రాష్ట్రంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ నోటీసులు జారీ అయ్యాయి. గ్యాస్ లీకేజీ ఘటన విషయమై సమాధానాలనివ్వాలని కమిషన్ తన నోటీసుల్లో ఆదేశించింది. కాగా ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీలం సాహ్ని పేరుతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. గ్యాస్ లీకేజీ సంఘటనను, తర్వాతి పరిణామాలను మీడియా ద్వారా …

Read More »

నంద్యాలలో మరో 43 కరోనా కేసులు….

కర్నూలు: రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇవాళ కూడా జిల్లాలో 43 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 386కు చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1403కు చేరుకుంది. మరోవైపు కర్నూలు జిల్లా నంద్యాలలో సైతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 74కు చేరుకుంది. వీరిలో ఓ విలేకరి, కూరగాయల వ్యాపారి కూడా ఉండటం విశేషం. …

Read More »

ఐఆర్ఎస్ కృష్ణ కిశోర్ సస్పెన్షన్‌ రద్దు…

ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిశోర్ సస్పెన్షన్‌ను క్యాట్ రద్దు చేసింది. ఆయన తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది. కిశోర్‌పై ఉన్న కేసులను ప్రభుత్వం చట్ట ప్రకారం పరిశీలించుకోవచ్చని పేర్కొంది. గత ప్రభుత్వంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో జగన్ సర్కార్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

Read More »

క్రైస్తవ్యం ఒక మతం కాదు.. జీవన విధానం..

అమరావతి : మతాన్ని ప్రచారం చేసేందుకు ఇంగ్లీష్‌ మీడియం విద్య తెచ్చారని ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ధ్వజమెత్తారు. క్రైస్తవ్యం ఒక మతం కాదని జీవన విధానమని స్పష్టం చేశారు. పాస్టర్‌లకు గౌరవ వేతనం 5 వేలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానిదని ప్రశసించారు. మన బడి నాడు- నేడు కార్యక్రమాలతో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేలా సీఎం చర్యలు చేపట్టారన్నారు. …

Read More »

కక్ష సాధింపు ధోరణితో జగన్ ప్రభుత్వం….

విజయవాడ: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో నడుస్తోందని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేవలం ఒక కులాన్ని కేంద్రంగా చేసుకుని రాజకీయం చేస్తుందని ఆరోపించారు. ఆ కులానికి చెందిన అధికారులను లక్ష్యంగా పెట్టుకుని 50 మంది డిఎస్పీలను విఆర్‌లో పెట్టిందని విమర్శించారు. 99 సబ్ డివిజన్లలో ఒక్క కమ్మ సామాజిక వర్గం అధికారి కూడా లేరని, ఆ కులంలో ఉన్న. …

Read More »

జగన్ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతించిన ఎమ్మెల్యే….

అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టబోతున్న ఇంగ్లీష్‌ మీడియాన్ని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్వాగతించారు. చంద్రబాబు ప్రభుత్వం మధ్యలో వదిలేసిన ఇంగ్లీష్‌ మీడియాన్ని జగన్‌ ప్రభుత్వం కొనసాగించే ప్రయత్నం చేస్తోందని రాపాక చెప్పారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిపక్ష నేత స్పీకర్‌ను గౌరవించాల్సిన బాధ్యత ఉందని రాపాక అభిప్రాయపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేవలం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడితే మాతృభాష అన్యాయానికి …

Read More »

ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలి…

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ జగన్‌ సర్కారు తీసుకున్న నిర్ణయం తెలిసిందే. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెడుతూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని టీడీపీ సభ్యుడు కనకమేడల రవీందర్‌, బీజేపీ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు కోరారు. రాజ్యసభలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. తెలుగు మాధ్యమంలో చదివిన వారు కూడా ఆ తర్వాత ఇంగ్లీష్‌ మీడియంలో ప్రావీణ్యం పొందారని సభకు …

Read More »

ఇదేనా మంచి సీఎం అనిపించుకునే విధానం…

అమరావతి: జగన్ సర్కార్‌పై మాజీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కడప జిల్లాలో మంగళవారం చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పర్యటనకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేస్తూ.. ‘‘సీఎం సొంత నియోజకవర్గంలో ఇంత అరాచకమా? పార్టీ మారకపోతే చంపుతారా? ఇదేనా మంచి సీఎం అనిపించుకునే విధానం’’ అని ప్రశ్నించారు. ప్రాణాలు పోయినా.. పసుపు జెండా వదిలేది లేదన్న కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నానని పేర్కొన్నారు. నిబ్బరంగా …

Read More »