Breaking News
Home / Tag Archives: jagan

Tag Archives: jagan

జగన్‌తో టీడీపీ ఎంపీ అవంతి భేటీ

హైదరాబాద్: వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్‌తో అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ భేటీ అయ్యారు. మరికాసేపట్లో ఆయన వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. అవంతి భీమిలి అసెంబ్లీ సీటు అడిగినట్లు తెలుస్తోంది. దీనికి జగన్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో ఆయన వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే భీమిలి సీటు తనదేనని నియోజకవర్గ సమన్వయకర్త విజయనిర్మల ప్రకటించారు. భీమిలీ సీటు విషయంలో ఇప్పటికే జగన్ తనకు …

Read More »

కొత్త జీవితాన్ని ప్రారంభించాం: చంద్రబాబు

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ను వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించామని, అన్ని రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధి చెందాలంటే.. కేంద్రం సహకరిస్తే 20.. 30 ఏళ్లు పడుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం దుర్మార్గంగా ప్రవర్తించిందని, మోదీ ఏపీ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారని.. ఇది మంచిది కాదన్నారు. రాష్ట్ర ప్రజల కోసమే ఢిల్లీ వీధుల్లో పాదయాత్ర చేపట్టినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పటికైనా మోదీ, …

Read More »

ఒకటో రెండో సీట్లొస్తే వైసీపీ కూడా కలిసిరావాలి!: సీఎం

న్యూఢిల్లీ: దేశ ప్రయోజనాలను కాపాడాలనే శ్రద్ధ ఉంటే… ఎన్నికల తర్వాత వైసీపీ కూడా తమతో కలిసి రావొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం ధర్మపోరాట దీక్ష సందర్భంగా ఒక జాతీయ మీడియా ప్రతినిధితో ఆయన మాట్లాడారు. ‘దేశ ప్రయోజనాలను కాపాడుకోవాలనే ఉద్దేశం ఉన్నవారందరినీ కూటమిలోకి ఆహ్వానిస్తాం. ఒకవేళ వైసీపీ ఒకటి రెండు సీట్లు గెలుచుకుంటే మాతో కలిసి రావొచ్చు. అందులో తప్పేమీ లేదు. అయితే ప్రస్తుతం జగన్‌ బీజేపీతో ఉన్నారు. …

Read More »

ప్రతి ఒక్కరూ కేసీఆర్‌కు ఒక్కో గిఫ్ట్‌ ఇస్తారు: చంద్రబాబు

నెల్లూరు: తమ న్యాయమైన కోరికలు తీర్చాకే ప్రధాని మోదీ ఇక్కడికి రావాలని సీఎం చంద్రబాబు అల్టిమేటం జారీ చేశారు. వైసీపీ ట్రాప్‌లో మోదీ పడ్డారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు తనకంటే ఎక్కువ మెర్చ్యూరిటీ ఉందంట… కేసీఆర్‌ నాకు గిఫ్ట్‌ ఇస్తాడంట.. ఇక్కడ ప్రతి ఒక్కరూ కేసీఆర్‌కు ఒక్కో గిఫ్ట్‌ ఇస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఐదారు నదుల్ని కలుపుతున్నామని, పోలవరం మనకు జీవనాడి అని …

Read More »

గవర్నర్‌తో జగన్ భేటీ

హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఆ పార్టీ నేతలు శనివారం సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల తొలగింపు, జాబితాలో అవకతవకలు జరిగాయని ఈ సందర్భంగా గవర్నర్‌కు జగన్ ఫిర్యాదు చేశారు. అలాగే పోలీస్ అధికారుల పదోన్నతుల్లో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని జగన్ వినతి చేశారు.

Read More »

గవర్నర్‌తో జగన్‌ భేటీ నేడు

అమరావతి: వైసీపీ అధ్యక్షుడు జగన్‌ శనివారం గవరర్‌ నరసింహన్‌ను కలవనున్నారు. ఏపీలో ఓటర్ల జాబితా నుంచి ఓట్లు తొలగించారని గవర్నర్‌కు ఆయన ఫిర్యాదు చేయనున్నారు. దీంతోపాటు ఏపీలో డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, శాంతిభద్రతల డీఐజీని తొలగించాలని ఫిర్యాదు చేయనున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.

Read More »

కీలక ప్రాంతంలో జగన్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ

వైసీపీని వీడేందుకు వలవల బాబ్జీ సమాయత్తం స్థానిక ఇబ్బందులే కారణం తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైసీపీకి ఎదురు దెబ్బ తగలనుందనే ఊహాగానాలకు ప్రస్తుత పరిస్థితు లు బలమైన ఊతాన్ని ఇస్తున్నాయి. వైసీపీకి సుదీర్ఘ కాలంగా సేవలందించిన సీనియర్‌ నేత వలవల బాబ్జి పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. స్థానికంగా పార్టీలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ఇక ఇమడలేమన్న భావనకు వచ్చినట్టు సమా చారం. నియోజకవర్గంలో కన్వీనర్‌ …

Read More »

దీక్షల పేరుతో చంద్రబాబు దుబారా ఖర్చులు

అమరావతి: రాష్ట్రంలో లోటు బడ్జెట్‌ ఉందంటూనే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అనేక దుబారా ఖర్చులకు పాల్పడుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు, వ్యక్తిగత పర్యటనలకు సైతం రాష్ట్ర ప్రభుత్వ నిధులనే విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. తాజాగా ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ దేశ రాజధాని ఢిల్లీలో చంద్రబాబు దీక్షకు సిద్ధమయ్యారు. ఈ దీక్షకు భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు. ఢిల్లీ దీక్షకు జనాలను తరలించేందుకు రూ.10 కోట్లు ఖర్చు చేయాలని ఇప్పటికే …

Read More »

దేవుడి దయ.. ప్రజాశీర్వాదం నేనే సీఎం!

‘అన్న’ వస్తున్నాడని చెప్పండి అన్ని హామీలు అమలు చేస్తా హోదాపై మోసం చేసిన మోదీ పూచీ ఉంటానన్న పవన్‌ గాయబ్‌ ఎన్నికల ముందు బాబు డ్రామాలు కడప ‘సమర శంఖారావం’లో జగన్‌ కడప: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారని వైసీపీ అధినేత జగన్‌ ధ్వజమెత్తారు. తిరుపతి సభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పదేళ్లపాటు హోదా …

Read More »

టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలి!

సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే పింఛనుదారులు, డ్వాక్రా మహిళలు ఆశీర్వదించాలి విపక్షానికి డిపాజిట్లు గల్లంతు చేయాలి రాష్ట్రవ్యాప్తంగా పండుగలా చెక్కుల పంపిణీ చూసి తట్టుకోలేక వైసీపీ కడుపు మంట కష్టపడుతున్న నన్ను ‘దున్న’ అంటున్నారు ఇలాంటి విపక్షం మనకు అవసరమా? ప్రజలకు ముఖ్యమంత్రి ప్రశ్న బందరు పోర్టు పనులు ప్రారంభం ‘నవయుగ’కు సీఎం ప్రశంసలు సమైక్యాంధ్ర, ప్రత్యేక హోదా కేసుల ఎత్తివేత విజయవాడ: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలంటే …

Read More »