Breaking News
Home / Tag Archives: jagityal

Tag Archives: jagityal

జగిత్యాలలో మరో నలుగురికి కరోనా..

జగిత్యాల: జిల్లాలో మరో నలుగురు వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ధర్మపురి మండలం రామయ్యపల్లె, బుగ్గారం మండలం మద్దునూర్, మాల్యాల మండలం లంబాడిపల్లె, కొడిమ్యాల మండలం నాచుపెల్లిలో ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 40కి చేరింది. ఇందులో ముంబాయి వలస కార్మికులు 36 మంది ఉన్నారు.

Read More »

చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్నదానం

జగిత్యాల: నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు. ఆయన జన్మదినాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు పలు స్వచ్ఛంద కార్యక్రమాల ద్వారా నిర్వహిస్తున్నారు. కాగా.. జగిత్యాల టీడీపీ నేతలు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా స్థానిక బీహార్ వలస కూలీలకు అన్నదానం చేశారు.

Read More »

జగిత్యాలలో దారుణం…

జగిత్యాల: జగిత్యాల జిల్లా పెగడపెళ్లి మండలం బతికపెళ్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. నిత్యం మద్యం సేవించి వచ్చి వేధింపులకు గురిచేస్తున్నాడంటూ కట్టుకున్న భర్త సత్యంను భార్య లత, కుమారుడు శ్రవణ్‌తో కలిసి హత్య చేసేందుకు యత్నించింది. ఇద్దరు కలిసి సత్యంపై ఇనుప రాడ్‌తో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి …

Read More »

ప్రాణం తీసిన సపోటా గింజ!…

జగిత్యాల  : తల్లి ఏమరుపాటు ఓ చిన్నారి ప్రాణం మీదికి తెచ్చింది. సపోటా తినే ప్రయత్నంలో దాని గింజ గొంతుకు అడ్డంగా ఉండిపోవడంతో ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌కు చెందిన అనుపురం సుజాత-లింగాగౌడ్ దంపతులు. వీరి కొడుకు శివకుమార్ (4). భర్త సౌదీలో పనిచేస్తుండడంతో బీడీ కార్మికురాలైన సుజాత మల్లాపూర్ లో తన ఇద్దరు కొడుకులతో ఉంటోంది. సపోటా పండ్లు కొనితెచ్చిన సుజాత వాటిని …

Read More »

జగిత్యాలలో కాల్పుల కలకలం….

జగిత్యాల : భార్యభర్తల గొడవ కాల్పులకు దారితీసిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గోవిదారం గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు శ్రీనివాస్‌, ఇస్రాజుపల్లికి చెందిన గీతిక దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో గీతిక ఆరు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా, గత అర్థరాత్రి ఇస్రాజుపల్లికి వెళ్లిన శ్రీనివాస్‌..భార్యతో గొడవకు దిగాడు. మేనమామ రాజిరెడ్డి అడ్డుకోబోగా శ్రీనివాస్‌ …

Read More »

ఆ జిల్లాకు ఉత్తమ ఎన్నికల నిర్వహణ అవార్డు…

జగిత్యాల(కరీంనగర్‌): జిల్లా పార్లమెంట్‌ ఎన్నికలకు జాతీయ స్థాయిలో ఉత్తమ ఎన్నికల నిర్వహణ అవార్డు రావడంతో కలెక్టర్‌ శరత్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తక్కువ సమయంలోనే ఎన్నికలను చక్కగా నిర్వహించామని, ఎన్నికల అధికారులు, పోటీ చేసిన అభ్యర్థుల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. జిల్లా ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యత కూడా ఇందుకు కారణమని తెలిపారు. సమిష్టి కృషితో పనిచేస్తూ …

Read More »

ఓటు హక్కు వినియోగించుకున్న సింధు..

జగిత్యాల: తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాతంగా కొనసాగుతున్నాయి. జగిత్యాల జిల్లాలోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటు వేసేందుకు జనం పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. జగిత్యాల జిల్లా పరిధిలో ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై ఎస్‌పి సింధుశర్మ పర్యవేక్షించారు. అదే సమయంలో జగిత్యాలలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల థరూర్‌ క్యాంపులోని పోలింగ్‌ కేంద్రంలో ఎస్‌పి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఎన్నికల్లో భద్రతా ఏర్పాట్లపై …

Read More »

జగిత్యాలలో మహిళ దారుణ హత్య…

జగిత్యాల: జిల్లాలోని వెల్గటూరు మండలం కొండాపూర్‌లో అమానుష సంఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళను దారుణంగా హతమార్చారు. మహిళ కూలీ పనులకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో మహిళ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టగా గ్రామశివారులోని పంటపొలం సమీపంలో వివస్త్రగా మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న …

Read More »

ప్రభుత్వాస్పత్రిలో అరుదైన ఆపరేషన్….

జగిత్యాల : కార్పొరేట్‌ ఆస్పత్రులకు ధీటుగా సర్కార్ దవాఖానాలను తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఆ దిశగానే అన్ని జిల్లా కేంద్రాలు, పీహెచ్‌సీ సెంటర్లలలోనూ నాణ్యమైన వైద్య పరికరాలను అందుబాటులో ఉంచిన అధికారులు..రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో తొలిసారిగా వైద్యులు ఓ అరుదైన ఆపరేషన్‌ చేశారు. సుమారు రెండు గంటలపాటు శ్రమించిన డాక్టర్ల బృందం..రెండేళ్ల బాలుడికి ప్రాణం పోశారు. …

Read More »

సీఎం కేసీఆర్ పై టీటీడీపీ నేత వ్యాఖ్యలు….

జగిత్యాల: ఆర్టీసీ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించిందని టీటీడీపీ నేత ఎల్.రమణ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్‌ను కార్మికులు నమ్మారని, అయినా సీఎం సెల్ఫ్ డిస్మిస్ పేరుతో కార్మికులను బయపెట్టారన్నారు. ఆర్టీసీ లేకుండా చేయాలని కేసీఆర్ కుట్ర పన్నారన్నారు. ఆర్టీసీ కార్మికులకు పండగల్లేకుండా చేశారని, సీఎం అసలు రూపం బయట పడిందన్నారు. ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్ను పడిందని రమణ విమర్శించారు.

Read More »