Breaking News
Home / Tag Archives: jail punishment

Tag Archives: jail punishment

రెండేళ్లు జైలు శిక్ష తప్పదు…

లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు శిక్ష తప్పదని కేంద్రం హెచ్చరించింది. అలాగే కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్న వైద్య సిబ్బందిపై, పోలీసులపై ఎవరైనా దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంది. దేశంలో డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్ యాక్ట్ అమలవుతోందని.. పౌరులందరూ ప్రభుత్వానికి సహకరించాలని కేంద్రం కోరింది. కాగా దేశవ్యాప్తంగా వైద్య సిబ్బందిపై దాడులు జరుగుతుండటంతో కేంద్రం ఈ ప్రకటన విడుదల చేసింది.

Read More »

లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారి కోసం తాత్కాలిక జైళ్లు…

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్నా కొంతమంది పాటించడం లేదు. ఇష్టమొచ్చినట్లు రోడ్లపైకి వస్తున్నారు. దీంతో పంజాబ్‌లోని లుథియానా పోలీసులు తాత్కాలిక జైళ్లు ఏర్పాటు చేశారు. ఎవరైనా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిని జైల్లో పెట్టనున్నారు. 6వేల మందికి సరిపోయే నాలుగు తాత్కాలిక జైళ్లు ఏర్పాటు చేశామన్నారు. మంగళవారం ఒక్కరోజే నిబంధనలు ఉల్లంఘించిన 200 మందిని ఈ జైళ్లకు తరలించామని చెప్పారు.

Read More »

లాక్‌డౌన్ అతిక్రమిస్తే.. ఆర్నెళ్లు జైలు!

కరోనాను అదుపు చేయడానికి లాక్‌డౌన్‌ను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కఠినంగా అమలు చేస్తున్నాయి. లాక్‌డౌన్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాయి. నిబంధనలు ఉల్లంఘించినవారిని IPC సెక్షన్ 188 ప్రకారం 6 నెలల పాటు జైలుకు పంపించడంతో పాటు రూ.1000 వరకు జరిమానా విధించాలని సంబంధిత అధికారులను ఆదేశించాయి. లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉన్న సేవలు తప్ప విుగతావన్నీ బంద్ చేయాలని ప్రభుత్వాలు ఆదేశించాయి.

Read More »

ఇంటి నుండి బయటకు వస్తే 3 నెలల జైలు శిక్ష

ఇటలీలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. నిన్న ఒక్క రోజే 133 మంది కరోనా వైరస్ బారిన పడి మృతి చెందారు. దీంతో ప్రజలు ఇల్లు వదిలి బయటకు రావద్దని, అలా వస్తే మూడు నెలల జైలు శిక్ష లేదా 206 యూరోల జరిమానా విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇటలీ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. కాగా ఇటలీలో కరోనా …

Read More »