Breaking News
Home / Tag Archives: jammu kashmir

Tag Archives: jammu kashmir

పుల్వామాలో ఎన్‌కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా బండ్ జూ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా జిల్లాలోని బండ్ జూ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర 55 రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్‌పీఎఫ్ జవాన్లతోపాటు జమ్మూకశ్మీర్ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున గాలింపు చేపట్టారు. బండ్ జూ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదులు గాలిస్తున్న భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో తాము ఎదురుకాల్పులు జరిపామని కశ్మీర్ జోన్ ఐజీ విజయ్ …

Read More »

నోయిడాలో మరో వ్యక్తికి కరోనా

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌(కోవిడ్‌-19) పేరు వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇటీవల భారత్‌లోనూ ప్రవేశించిన ఈ ప్రాణాంతక వైరస్‌ అనతి కాలంలోనే తన పంజా విసురుతోంది. తాజాగా గురువారం నోయిడాకు చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 69కి చేరింది. నోయిడా నగరానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తి టూరిస్ట్‌ గైడ్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన ఆగ్రా, జైపూర్‌ నగరాలు …

Read More »

జమ్మూలో హిజ్బుల్‌ కీలక ఉగ్రవాది హతం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్ర సంస్థకు చెందిన ఓ కీలక ముష్కరుడిని భారత భద్రతా దళాలు బుధవారం మట్టుబెట్టాయి. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరుగుతున్న సమయంలో ఒక ఉగ్రవాది తప్పించుకున్నట్టు తెలుస్తోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారం భద్రతా దళాలకు అందింది. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లి ఆపరేషన్‌ చేపట్టిన దళాలు హిజ్బుల్‌కు చెందిన కీలక ఉగ్రవాదిని …

Read More »

సీఏఏపై పాక్‌కు భారత్‌ చురకలు

ఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పాకిస్థాన్‌ పార్లమెంటు తీర్మానం చేయడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. పాక్‌లో మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాల నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టి మరల్చడానికే ఇటువంటి తీర్మానాలు చేస్తోందని భారత విదేశాంగశాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. సొంత దేశంలోని పరిస్థితులపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన ఓ దేశం ఇలాంటి తీర్మానాలు చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించింది. జమ్మూకశ్మీర్‌ విషయంలో పాక్‌ చేస్తున్న నిరాధార ఆరోపణల పరంపరలోనే ఈ తీర్మానం …

Read More »

ఏపీకి రెండు రాజధానులు ఏర్పాటు చేయాల్సిందే …

జమ్మూ కాశ్మీర్:బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ ఏపీకి రెండు రాజధానుల అంశంపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి రెండు రాజధానులు ఏర్పాటు చేయాల్సిందే అంటున్న టీజీ.. రాయలసీమలో శీతాకాల లేదా వేసవి రాజధానిని ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జమ్మూకశ్మీర్ తరహాలో కాలానికి అనుగుణంగా ఏపీలో రెండు రాజధానులు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే రాయలసీమలో హైకోర్టు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలన్నారు.ఎన్నో ఏళ్లుగా సీమ …

Read More »

జమ్మూకశ్మీర్‌లో విద్యాసంస్థలు నేటి నుంచి ప్రారంభం

జమ్మూ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్‌లో విద్యాసంస్థలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయోధ్య రామజన్మభూమిపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లో పాఠశాలలు, కళాశాలలకు ముందు జాగ్రత్త చర్యగా సెలవు ప్రకటించారు. అయోధ్య తీర్పు అనంతరం శాంతియుత పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా పాఠశాలలు, కళాశాలలను సోమవారం నుంచి ప్రారంభిస్తామని జమ్మూ డివిజనల్ కమిషనర్ సంజీవ్ వర్మ చెప్పారు. అయోధ్య తీర్పు వెలువడిన నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ లో ముందు జాగ్రత్తగా 144 …

Read More »

జమ్మూకాశ్మీర్ లో ఎన్‌కౌంటర్….

జమ్మూకాశ్మీర్‌: జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు ఓ ఇంట్లోకి చొరబడి కాల్పులు జరుపుతున్నారు. భద్రతా బలగాలు ఉగ్రదాడిని తిప్పికొడుతున్నారు. భద్రతా బలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్లు సమాచారం.

Read More »

ఓ పార్టీకి విజయం కట్టబెట్టేందుకే ….

న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్‌లో జరుగుతున్న తొలి ఎన్నికలను కాంగ్రెస్ బహిష్కరించింది. ప్రధాన పార్టీల అధినేతలు గృహనిర్బంధంలో ఉండగా ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారని, కార్యకర్తలు ఎలా సిద్ధం కాగలరని జమ్మూకాశ్మీర్ కాంగ్రెస్ చీఫ్‌ గులాం అహ్మద్ మీర్‌ కేంద్రాన్ని ప్రశ్నించారు. తేదీలు ప్రకటించే ముందు రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సంప్రదింపులు జరిపి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓ పార్టీకి విజయాన్ని కట్టబెట్టేందుకే ఇలా హడావిడిగా …

Read More »

గవర్నర్ పాలన ఎత్తివేసిన మరుక్షణమే…

న్యూఢిల్లీ: నేడు ‘జనజాగరణ్ సభ’లో బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ మాట్లాడుతూ గృహ నిర్బంధంలో ఉన్న జమ్మూకశ్మీర్ నేతలకు త్వరలోనే విముక్తి కల్పిస్తామని తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో గవర్నర్ పాలన ఎత్తివేసిన మరుక్షణం గృహ నిర్బంధంలో ఉన్న నేతలను విడుదల చేస్తామని, ఆ తర్వాత వారు తమ రాజకీయ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే, ఈ ప్రాంతంలో ఎస్సీ కమిషన్, మహిళా, మైనారిటీ కమిషన్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్టికల్ …

Read More »