Breaking News
Home / Tag Archives: Kadapa district

Tag Archives: Kadapa district

ఉపవాస దీక్ష చేపట్టిన బొమ్మన సుబ్బారాయుడు..

కడప: రాష్ట్ర బీజేపీ మానవ హక్కుల కన్వీనర్ బొమ్మన సుబ్బారాయుడు ఈరోజు తన స్వగ్రామమైన కడప జిల్లా అప్పరాజపేటలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు, దేవాలయాలపైన ప్రభుత్వం చూపుతున్నటువంటి వివక్షతపైన ఉపవాస దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ… హిందూ దేవాలయాలను గాని, దేవాలయాల భూములను గాని వేలం వేయటానికి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. అందుచేత ప్రభుత్వం భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని …

Read More »

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం…

కడప: జిల్లాలోని జేఎంజే కాలేజీ దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకువచ్చిన ఓ లారీ పోలీస్‌ చెక్‌పోస్ట్‌ టెంట్‌లోకి దూసుకెళ్లింది. కాగా ఆ సమయంలో టెంట్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Read More »

కడప జిల్లాలో 29కి చేరిన కరోనా కేసులు…

కడప: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 29కి చేరింది. ఆరు ప్రాంతాల్లో రెడ్ జోన్లుగా ప్రకటించారు. ప్రొద్దుటూరు 11, కడప 6, బద్వేల్ 3, పులివెందుల 4, వేంపల్లె 2, మైదుకూరులో 3 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి.

Read More »

కడప జిల్లాలో అకాల వర్షం..

కడప జిల్లా: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతను దెబ్బతీశాయి. కడప జిల్లా వెంకాయపేట మండలంలో ఈదురుగాలులకు మామిడి తోటల్లో మామిడికాయలు నేలరాలాయి. బలమైన గాలులు వీయడంతో మామిడి తోటలోని చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. తీవ్ర నష్టం వాటిల్లిందని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న మామిడి తోటలను అధికారులు పరిశీలించి నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు.

Read More »

కడప జిల్లాలో వర్షం…

కడప: జిల్లాలో అకాల వర్షం కారణంగా పెనుగాలుల బీభత్సం సృష్టించాయి. దీంతో 868 హెక్టార్లలో పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. అరటి, మామిడి తోటల రైతులకు అపార నష్టం వాటిల్లింది. 13 వందల కోట్లకు పైన పంటల నష్టం జరిగినట్లు ఉద్యానవన శాఖాధికారులు అంచనా వేస్తున్నారు.

Read More »

కడపలో 28 కి చేరిన కరోనా కేసులు…

కడప: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 28కి చేరుకుంది. జిల్లాలో పెరుగుతున్న ప్రతి కేసూ ఢిల్లీ ప్రభావమేనని అధికారులు చెబుతున్నారు. ప్రొద్దుటూరులో అత్యధికంగా 11 కేసులు… కడప 6, బద్వేల్ 3, పులివెందుల 4 , వేంపల్లె 2, మైదుకూరు 2 కేసులు నమోదు అయినట్టు అధికారులు వెల్లడించారు. పాజిటివ్ ఉన్న ప్రాంతాల్లో రెడ్ జోన్లు కొనసాగుతున్నాయి.

Read More »

బొమ్మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీసులకి అన్నదానం

కడప: కడప జిల్లా బద్వేల్ పట్టణంలో లాక్ డౌన్ సందర్భంగా గత పది రోజుల నుంచి బొమ్మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీసులకి మరియు నిరాశ్రయులకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బొమ్మన ఫౌండేషన్ అధ్యక్షుడు బొమ్మన సుబ్బరాయుడు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల లాక్ డౌన్ సందర్భంగా పోలీసులు నిరంతరం కృషి చేస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేస్తున్నారని అన్నారు. వారికి సరైన సమయానికి భోజన …

Read More »

కడప జిల్లాలో కొనసాగుతున్న కరోనా కర్ఫ్యూ…

కడప: లాక్ డౌన్‌లో భాగంగా మూడవ రోజు కడప జిల్లాలో కరోనా కర్ఫ్యూ కొనసాగుతోంది. వ్యాపార వాణిజ్య సంస్థలు, దుకాణాలను స్వచ్చంధంగా మూసివేశారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలు మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ..డిపోలకే పరిమితమయ్యాయి. అత్యవసర సేవల మినహా మిగితా వ్యాపార సంస్థలు మూసివేశారు. వారం రోజుల పాటు ఇళ్లకే పరిమితం కావాలని ప్రజలకు అధికారులు సూచించారు. జన సమూహం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు.

Read More »

కడప జిల్లాలో కరోనా కలకలం…

కడప : కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 125 దేశాల్లో కల్లోల్లం సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు పాకడం.. తెలంగాణలో ఒకరికి కరోనా సోకడం.. మరోవైపు పెద్ద ఎత్తున అనుమానిత కేసులు నమోదవుతుండటంతో ఇరు రాష్ట్రాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మరోవైపు.. నెల్లూరు జిల్లాకు కరోనా పాకింది. ఇటలీ నుంచి వచ్చిన ఒకరికి వైద్య పరీక్షలు చేయగా …

Read More »

అందుకే విశాఖలో చంద్రబాబు పర్యటన….

కడప: టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను ప్రజలే అడ్డుకున్నారని ఏపీ హోంమంత్రి సుచరిత అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ… రాజకీయం చేసేందుకే చంద్రబాబు విశాఖలో పర్యటించడానికి వచ్చారని విమర్శించారు. చంద్రబాబు పార్టీ కార్యక్రమాల కోసం అక్కడికెళ్ళారన్నారు. శాంతి భద్రతల కారణంగానే బాబును వెనక్కి పంపాల్సి వచ్చిందన్నారు. చంద్రబాబును ఎవరూ అరెస్ట్ చేయలేదని ఆమె స్పష్టం చేశారు. బాబు అప్పట్లో మెచ్చుకున్న పోలీసులే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నారని సుచరిత వ్యాఖ్యానించారు.

Read More »