Breaking News
Home / Tag Archives: KCR

Tag Archives: KCR

19న తెలంగాణ కేబినెట్ విస్తరణ

హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న ఉదయం 11.30 గంటలకు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కేసీఆర్ కలిసి మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. అనంతరం మంత్రుల ప్రమాణస్వీకారంపై ప్రకటన వెలువడింది. ఈనెల 19న మాఘశుద్ధ పౌర్ణమి కావడంతో ఉ.11.30కి రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Read More »

‘కేసీఆర్‌ మాతో టచ్‌లో ఉన్నారు’

ఎన్నికల తర్వాతే కూటమి నేత ప్రకటన: మమత న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాల కూటమిగా కూడగడుతున్న టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ గురువారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ తమతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. ఒడిసా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌నూ గౌరవిస్తామన్నారు. మరి.. వారు విపక్ష కూటమిలో చేరడం లేదు కదా? అని ప్రశ్నించగా.. ‘‘వేచి చూడండి’’ అని సమాధానమిచ్చారు. …

Read More »

విజయబాపినీడు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు, పాత్రికేయుడు, కథా రచయిత విజయబాపినీడు మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. పలు విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, విజయ అనే పత్రిక నడపడం ద్వారా విజయాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న బాపినీడు తెలుగు సినీ రంగ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ముద్ర వేశారని సీఎం కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Read More »

ప్రతి ఒక్కరూ కేసీఆర్‌కు ఒక్కో గిఫ్ట్‌ ఇస్తారు: చంద్రబాబు

నెల్లూరు: తమ న్యాయమైన కోరికలు తీర్చాకే ప్రధాని మోదీ ఇక్కడికి రావాలని సీఎం చంద్రబాబు అల్టిమేటం జారీ చేశారు. వైసీపీ ట్రాప్‌లో మోదీ పడ్డారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు తనకంటే ఎక్కువ మెర్చ్యూరిటీ ఉందంట… కేసీఆర్‌ నాకు గిఫ్ట్‌ ఇస్తాడంట.. ఇక్కడ ప్రతి ఒక్కరూ కేసీఆర్‌కు ఒక్కో గిఫ్ట్‌ ఇస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఐదారు నదుల్ని కలుపుతున్నామని, పోలవరం మనకు జీవనాడి అని …

Read More »

సమైక్య రాష్ట్రంలో యాదాద్రి నిర్లక్ష్యానికి గురైంది: కేసీఆర్‌

యాదాద్రి: సమైక్య రాష్ట్రంలో యాదాద్రి నిర్లక్ష్యానికి గురైందని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. యాదాద్రిని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. ఆలయ పునర్‌నిర్మాణపనుల్లో వేగం పెరగాల్సిన అవసరం ఉందని, మరో 15 రోజుల్లో మళ్లీ యాదాద్రికి వస్తానని చెప్పారు. ఆగమశాస్త్రం ప్రకారం కొన్ని మార్పులు చేస్తామని, 173 ఎకరాల భూమిని సేకరించామన్నారు. దాదాపు 1100 ఎకరాల్లో టెంపుల్‌ సిటీ నిర్మాణం చేపట్టామని తెలిపారు. టెంపుల్‌ సిటీలో 354 క్వార్టర్స్‌ నిర్మిస్తామని, …

Read More »

కేసీఆర్‌ ఎన్నికను రద్దు చేయాలి

నామినేషన్‌లో నిబంధనలు పాటించలేదు కేసుల సమాచారం పూర్తిగా తెలపలేదు హైకోర్టులో ఈపీ దాఖలు చేసిన ఓటరు హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్‌ దాఖలులో నిబంధనలు పాటించలేదని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఓ ఓటరు హైకోర్టును ఆశ్రయించాడు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడాల గ్రామానికి చెందిన తమ్మాల శ్రీనివాస్‌ ఈ మేరకు హైకోర్టులో ఎన్నికల పిటిషన్‌ (ఈపీ) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో …

Read More »

మూడో రోజు కొనసాగుతున్న సహస్ర చండీయాగం

మెదక్‌: సర్వజనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్‌ చేయిస్తున్న చతుర్వేద పురస్సర మహారుద్ర సహిత సహస్ర చండీయాగం మూడో రోజుకు చేరుకుంది. వేదపారాయణాలు, వేదమంత్రాలతో ఎర్రవల్లి వ్యవసాయం క్షేత్రం ప్రతిధ్వనిస్తోంది. ఇప్పటివరకూ 200 చండీ పారాయణాలు పూర్తి అయ్యాయి. వేదఘోషతో ఎర్రవల్లిలోని కేసీఆర్‌ వ్యవసాయక్షేత్రం, చండీయాగ వేదిక మారుమోగుతోంది. తెలంగాణ ప్రజల సుఖసంతోషాలతో జీవించాలంటూ సీఎం కేసీఆర్‌ సంకల్పించిన మహారుద్ర సహిత సహస్ర చండీయాగం పంచాహ్నిక దీక్ష మూడవరోజుకు చేరుకుంది. …

Read More »

ఓటు వేయని సీఎం దంపతులు

యాగం నిర్వహణలో ఉన్నందునే! సిద్దిపేట రూరల్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దంపతులు పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోలేదు. కేసీఆర్‌ స్వగ్రామమైన సిద్దిపేట రూరల్‌ మండలం చింతమడకలో సోమవారం పంచాయతీ ఎన్నికలు తొలి విడతలో భాగంగా జరిగాయి. అయితే ఎర్రవల్లిలో తన వ్యవసాయ క్షేత్రంలో సీఎం యాగం నిర్వహిస్తుండటంతో ఓటుకు దూరమైనట్లు తెలిసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ దంపతులు చింతమడక గ్రామానికి వచ్చి ఓటు వేసిన …

Read More »

ఎర్రవల్లిలో మహారుద్ర సహిత చండీయాగం

హైదరాబాద్‌: తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో తలపెట్టిన మహారుద్ర సహిత సహస్ర చండీయాగం ప్రారంభమైంది. విశాఖ శారదా పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో యాగాలు చేపట్టారు. తొలిరోజు వంద సప్తపతి చండీ పారాయణాలు, సహస్ర చండీయాగం, రాజ శ్యామల యాగం, చతుర్వేద మహాయాగం, సప్తశతి యాగం, రుద్రమహాయాగాలను సుమారు 300 మంది రుత్వికులు నిర్వహిస్తున్నారు. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, …

Read More »

రోడ్డుపై చెత్త వేస్తే 500 ఫైన్‌!

ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే రూ.1000 గ్రామపంచాయతీ స్థలాలను ఆక్రమిస్తే రూ.2000 పంచాయతీరాజ్‌ చట్టం ఇకపై పక్కాగా అమలు విస్మరిస్తే ఉద్యోగాలకు ఎసరు, జరిమానాలు ప్రొబేషన్‌ తర్వాత రెగ్యులర్‌ చేయబోం అసెంబ్లీలో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌: చెత్త, వ్యర్థ పదార్థాలను నిర్దేశిత ప్రదేశంలో కాకుండా.. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త పడవేస్తే ఇకపై జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చెత్తను ఇలా పడవేసిన వారికి రూ.500 జరిమానా …

Read More »