Breaking News
Home / Tag Archives: kerala

Tag Archives: kerala

శబరిమల…ఇద్దరు మహిళలు పురుషుల దుస్తుల్లో…

కేరళ : శబరిమల పరిసర ప్రాంతాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శబరిమల ఆలయ దర్శనానికి వెళ్తున్న ఇద్దరు మహిళలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. పంబ బేస్‌ క్యాంప్‌ దాటి వెళ్తుండగా నీలిమల వద్ద వారిని అడ్డుకుని వెనక్కి పంపించారు. అనంతరం ఆ మహిళలను పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. కన్నూరుకు చెందిన ఇద్దరు మహిళలు ఎవరికి అనుమానం రాకుండా పురుషుల దుస్తుల్లో తెల్లవారుజామున 5 గంటల సమయంలో శబరిమల దర్శనానికి …

Read More »

స్వదేశ్ దర్శన్ స్కీమ్ ప్రారంభం

తిరువనంతపురం : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం స్వదీశ్ దర్శన్ స్కీమ్‌ను ప్రారంభించారు. శ్రీ పద్మనాభ స్వామి దేవాలయాన్ని సందర్శించిన మోదీ ఈ స్కీమ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ పళనిసామి సదాశివం, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ పాల్గొన్నారు. మోదీ శ్రీ పద్మనాభ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు గవర్నర్ సదాశివం కూడా ఉన్నారు. అంతకుముందు మోదీ …

Read More »

శబరిమల వివాదంపై స్పందించిన మోదీ

కొల్లం : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం కేరళ వేదికగా కాంగ్రెస్, కమ్యూనిస్టులపై విరుచుకుపడ్డారు. యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ ప్రజల మాట వినడం లేదని ఆరోపించారు. ఈ కూటములు కేరళలో శాంతి, సామరస్యాలను దెబ్బతీస్తున్నాయన్నారు. శబరిమల వివాదంపై మాట్లాడుతూ కమ్యూనిస్టులకు భారతీయ ఆధ్యాత్మికత, సంస్కృతి, చరిత్రలపై గౌరవం లేదన్నారు. ఎల్‌డీఎఫ్ ప్రభుత్వ ప్రవర్తన చరిత్రలో హేయంగా మిగిలిపోతుందని మండిపడ్డారు. ఏ ప్రభుత్వం కానీ, ఏ పార్టీ కానీ ప్రవర్తించనంతటి అతి …

Read More »

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై..రివ్యూ పిటిషన్‌ వాయిదా

కేరళ:  శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ అంశంపై ఈనెల 22న విచారణ జరపాల్సి ఉండగా జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ వాయిదా వేశారు. రాజ్యాంగ ధర్మాసనంలోని జస్టిస్‌ ఇందు మల్హోత్రా సెలవులో ఉండటంతో వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు గొగోయ్ వెల్లడించారు. శబరిమల ఆలయంలోకి మహిళలు వెళ్లవచ్చునని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సుమారు 40 మంది కోర్టులో పిటిషన్లు వేశారు. …

Read More »

అయ్యప్పను దర్శించినందుకు అత్త చావబాదింది..

కొచ్చి: కేరళలోని శబరిమల ఆలయంలోకి ఇటీవల ప్రవేశించి చరిత్ర సృష్టించిన ఇద్దరు మహిళల్లో ఒకరైన కనకదుర్గపై దాడి జరిగింది. సోమవారంనాడు ఇంటికి తిరిగి వస్తుండగా ఆమెపై ఈ దాడి జరిగింది. సొంత అత్తగారే కనకదుర్గ తలపై బలంగా మోదిందని, ప్రస్తుతం మల్లాపురం జిల్లాలోని ఓ ఆసుపత్రిలో కనకుదుర్గ చికిత్స పొందుతోందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కనకదుర్గ ఆరోగ్య పరిస్థితి నిలికడగానే ఉందని చెబుతున్నారు. గత జనవరి 2న శబరిమల …

Read More »

ఇంకా ఇంటికి చేరుకోని ఆ ఇద్దరు కేరళ మహిళలు

కొచ్చి: శబరిమల ఆలయంలోకి ప్రవేశించి సంచలనం సృష్టించిన ఇద్దరు మహిళలు కనకదుర్గ (39), బిందు అమ్మిని (40)లు ఇప్పటి వరకు ఇల్లు చేరుకోలేదు. ఆందోళనకారుల నుంచి హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ఇద్దరూ అజ్ఞాతంలో గడుపుతున్నారు. కేరళలోని కన్నూరు యూనివర్సిటీలో బిందు లా లెక్చరర్‌గా పనిచేస్తుండగా, కనకదుర్గ సివిల్ సర్వెంట్. ‘‘చాలామంది మమ్మల్ని నిరుత్సాహపరచాలని చూశారు. చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో పోలీసులు, స్నేహితులు వెనక్కి తగ్గమని సూచించారు’’ అని …

Read More »

‘భారత కుబేరుడు’.. టీ కొట్టు యజమాని

టీ అమ్ముతూ 23 దేశాల పర్యటన కల సాకారం చేసుకున్న కేరళ దంపతులు కొచ్చి : కలలను సాకారం చేసుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ, ఆ దిశగా నిర్విరామంగా కృషి చేసి విజయం సాధించేది కొందరే. కేరళకు చెందిన విజయన్‌ దంపతులు ఈ కోవకు చెందినవారే. తమ చిన్ననాటి కలలను సాకారం చేసుకోవడానికి వీరు చేస్తున్న కృషిని మహింద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహింద్రా కొనియాడారు. ప్రపంచ పర్యటనే లక్ష్యంగా …

Read More »

శబరిమల ఆలయంలోకి మరో మహిళ…

కేరళ: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశంతో కేరళ అట్టుడికిన విషయం తెలిసిందే. అది మరవక ముందే తాను ఆలయంలోకి వెళ్లానంటూ మరో మహిళ ప్రకటించడం సంచలనం రేపుతోంది. జనవరి 8న శబరిమల ఆలయంలోకి వెళ్లానంటూ మంజు అనే మహిళ పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. జుట్టుకు తెల్లరంగు వేసుకుని వెళ్లానని, ఆలయంలో రెండు గంటలపాటు ఉన్నానని మంజు పేర్కొంది. కాగా …

Read More »

కేరళలో అయ్యప్పల వాహనానికి ప్రమాదం…కడప వాసి మృతి

చిన్నార్సుపల్లె: కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన అయ్యప్ప భక్తుడు మృతి చెందాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. చిన్నమండెం మండలంలో చిన్నార్సుపల్లెకు చెందిన కొందరు అయ్యప్ప స్వాములు రెండు వాహనాలలో శబరిమలైకు వెళ్లారు. కాగా ఇందులో ఒక వాహనం అదుపుతప్పి లోయలో పడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన వల్లపు కృష్ణ(30) అక్కడికక్కడే మృతి చెందగా గోపాల్, వెంకటమ్మ, కృష్ణ, కారు డ్రైవర్ …

Read More »

అట్టుడుకుతున్న కేరళ… నేతల ఇళ్లపై బాంబులు…

కొజికోడ్: శబరిమల వివాదంపై కేరళలో మొదలైన ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారాయి. ఇవాళ తెల్లవారుజామున కొజికోడ్ జిల్లాలో సీపీఎం, బీజేపీ నాయకుల ఇళ్లపై దుండగులు నాటు బాంబులు విసిరారు. సీపీఎం కోయిలాండీ కమిటీ సభ్యుడు షిజు ఇంటిపై తొలుత దాడి జరగ్గా… కొద్దిసేపటికి ఇదే ప్రాంతంలోని బీజేపీ నేత వీకే ముకుంద ఇంటిపైనా నాటుబాంబులు పడ్డాయి. అయితే ఈ రెండు ఘటనల్లోనూ ఎవరికీ ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. కాగా …

Read More »