Breaking News
Home / Tag Archives: Khammam district

Tag Archives: Khammam district

ఖమ్మం జిల్లాలో కరోనా కలకలం

ఖమ్మం జిల్లా: మహాదేవపురంలో కరోనా కలకలం రేగింది. ఈ నెల 14న ముంబై నుంచి ప్రత్యేక బస్సులో 22 మంది మహాదేవపురం చేరుకున్నారు. వారిలో ఒకరికి కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. అనుమానితుడితోపాటు అతనితో సంబంధం ఉన్న మరో ఏడుగురిని అంబులెన్స్‌లో ఖమ్మం తరలించి, పరీక్షలు చేయించారు. వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతనిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా గ్రీన్ …

Read More »

కోళ్లకు వైరస్‌పై అధికారుల ప్రకటన

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో 30వేల ఫారం కోళ్ల మృతిపై తెలంగాణ పశుసంవర్ధక శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రతి ఏటా ఫిబ్రవరి నుంచి మే వరకూ ఎండలు పెరిగే సమయంలో విరులెంట్ న్యూకాజిల్ డిసీజ్ అనే వైరస్ కోళ్లకు సోకుతుందని.. టీకాలతో దీన్ని నియంత్రించడం సాధ్యమేనని పేర్కొంది. ఏపీలోని నూజివీడు నుంచి కోడిపిల్లలను పెనుబల్లికి తీసుకొచ్చారని.. దీంతో అక్కడి నుంచి VND వ్యాపించిందని స్పష్టం చేసింది.

Read More »

సహకార సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత…

తిరుమలాయపాలెం: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం బీరోలు సహకార సంఘాల ఎన్నికలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్ఎస్‌లోని ఇరు వర్గాల మధ్య గొడవతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి వెళ్లడంతో గొడవ మొదలైంది. ఇందుకు నిరసనగా పోలింగ్ కేంద్రం ఎదుట మరో వర్గం ఆందోళనకు దిగింది. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన టీఆర్ఎస్ నేతని పోలీసులు అడ్డుకున్నారు.

Read More »

ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం…

ఖమ్మం : ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెనుబల్లి సమీపంలో బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న 9 నెలల నిండు గర్భిణి మరణించింది. కడుపులో ఉన్న గర్భస్థ శిశువు కూడా చనిపోయింది. దాదాపు 10 మీటర్ల దూరంలో ఆ బేబీ ఎగిరిపడింది. ఘటనా స్థలంలో ఆ దృశ్యాలను చూసి స్థానికులు కంటతడిపెట్టారు. ప్రమాదంలో గర్భిణీ భర్త రామచంద్రరావుకు తీవ్ర గాయాలుకావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స …

Read More »

ఖమ్మం మిర్చి మార్కెట్‌లో దళారీ రాజ్యం…

ఖమ్మం : ఖమ్మం మిర్చి యార్డులో దోపిడీ రాజ్యం కొనసాగుతోంది. ఆరు రోజుల్లోనే క్వింటాకు దాదాపు రూ.5 వేలు ధర తగ్గడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. నెల రోజుల క్రితం రూ.21 వేలు పలికిన క్వింటా మిర్చి.. ప్రస్తుతం రూ.12 వేలకు చేరుకుంది. అయితే ధరల తగ్గుదల వెనుక దళారుల హస్తం ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. అధికారులు మాత్రం మార్కెట్‌లోకి పంట ఎక్కువగా రావడంతోనే ఈ పరిస్థితి …

Read More »

ఖమ్మం మిర్చియార్డు వద్ద ఉద్రిక్తత…

ఖానాపురం హవేలి: ఖమ్మం మిర్చి యార్డులో ఉద్రిక్తత నెలకొంది. మిరప ధర పతనాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. ఒకేసారి మిర్చిధరను రూ. 5 వేలు తగ్గించి క్వింటాల్‌కు రూ.13,000 కేటాయించడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా జెండా పాట రూ.17000లుగా పెట్టి.. ఇవాళ ఒకేసారి తగ్గించటంతో ఆందోళనకు దిగారు. పంటను అమ్మేది లేదంటూ మార్కెట్ గేట్లు మూసి నిరసన వ్యక్తం చేశారు. ఈ …

Read More »

వైరా మున్సిపాలిటీలో టీఆర్ఎస్ విజయం…

ఖమ్మం: వైరా మున్సిపాలిటీలో టీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 19 వార్డులకు పోలింగ్ జరగగా టీఆర్ఎస్ పార్టీ 15 వార్డులలో గెలుపొంది మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థులు 2, కాంగ్రెస్ 2, సీపీఎం 1 వార్డు చొప్పున గెలుచుకున్నాయి.

Read More »

ఖమ్మంలో ఉద్రికత్త…

ఖమ్మం: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జిల్లాలో ఉద్రిక్తతలకు దారి తీసింది. బంద్‌కు సహకరించని ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలపై విద్యార్థి సంఘాలు గొడవకు దిగాయి. బల్లేపల్లెలో విద్యార్థి సంఘాల నేతలు, ప్రైవేటు స్కూల్ బస్సు సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బంద్ అయినా బస్సు తిరగడంపై విద్యార్థి సంఘం నేతలు మండిపడ్డారు. వీవీఎస్ స్కూల్ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు.

Read More »

ఖమ్మం జిల్లాలో 28 మంది ఎస్సైల బదిలీ…

ఖమ్మం: ఎట్టకేలకు ఏడాది తర్వాత ఎస్సైల బదిలీలు జరిగాయి. ఈ మేరకు వరంగల్‌ రేంజ్‌ డీఐజీ  ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ప్రొబేషనరీ పూర్తి చేసుకున్న ఎస్సైలకు పోస్టింగ్‌లు కల్పించారు. ప్రొబేషనరీ పూర్తయిన మహిళా ఎస్సైలు ఇద్దరికి మండలాల ఎస్‌హెచ్‌ఓలుగా స్థానం కల్పించారు.

Read More »

ఆర్మీ, పారా మిలిటరీ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ…

ఖమ్మం: బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో అర్హులైన బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఆర్మీ, పారా మిలిటరీ(సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, సీఐఎస్‌ఎఫ్, ఎన్‌ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్‌)ఉద్యోగాల్లో చేరేందుకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి చదివిన యువకులు 18 నుంచి 27 సంవత్సరాలు వయసు కలిగి ఉండి 167 సెం.మీ. ఎత్తు, …

Read More »