Breaking News
Home / Tag Archives: kurnool district

Tag Archives: kurnool district

శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయాలు….

కర్నూలు: కరోనా వైరస్ కారణంగా శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయాలు నిర్ణయాలు తీసుకుంది. నేటి నుంచి శ్రీశైలంలోని పాతాళగంగలో భక్తుల పుణ్యస్నానాలను నిలిపివేసినట్టు దేవస్థానం అధికారులు వెల్లడించారు. అన్నదాన మందిరంలో సైతం మార్పులు చేపట్టారు. అన్న ప్రసాద వితరణను.. వడ్డించే పద్ధతిలో కాకుండా ప్యాకెట్ల రూపంలో భక్తులకు అందజేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాల్నీ నేటి నుంచే అమలు చేయనున్నట్టు ఈవో కెఎస్ రామారావు తెలిపారు. విదేశాల నుంచి వచ్చే భక్తులెవరు …

Read More »

కడపలో రోడ్డు ప్రమాదం.. ఒకరు సజీవదహనం

కడప: కడప జిల్లా సిద్దవటం మండలం ఉప్పరపల్లె శివారులో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కార్పియో-లారీ ఢీ కొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో స్కార్పియో డ్రైవర్‌ బండి ఆది సజీవదహనమయ్యారు. పలువురికి గాయాలయ్యాయి.బాధితులు కర్నూలు జిల్లా బాలంపురం నుంచి స్కార్పియోలో తిరుమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను 108 వాహనంలో కడప సర్వజన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను సుల్తాన్‌ …

Read More »

కర్నూలులో కరోనా అనుమానిత కేసు…

కర్నూలు: కర్నూలులో కరోనా వైరస్‌ అనుమానిత కేసు నమోదైంది. కరోనా లక్షణాలు ఉన్నట్టు అనుమానిస్తున్న 65 ఏళ్ల వృద్ధురాలిని కర్నూలు సర్వజన వైద్యశాలలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రోగి రక్త నమూనాలను పూణేకు పంపించినట్లు వైద్యులు తెలిపారు. వృద్ధురాలు ఇటీవల జోర్దాన్‌ వెళ్లి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా ఆమె నివాస ప్రాంతంలో ఉన్నవారిని అప్రమత్తం చేశారు.

Read More »

అందుకే హడావుడిగా ఎన్నికలు…

కర్నూలు: కేంద్రం నిధులు ఆగిపోతే జనం వెంబడించి మరీ కొడతారనే భయంతోనే హడావుడిగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లారని మాజీ మంత్రి అఖిలప్రియ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ… రిజర్వేషన్ల విషయంలో బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతూనే ఉందన్నారు. పాదయాత్ర సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలను విస్మరించారని ధ్వజమెత్తారు. స్థానిక …

Read More »

తండ్రీకొడుకులను కలిపిన టిక్ టాక్

టిక్ టాక్ చెడుతో పాటు మంచి కూడా చేస్తుందనడానికి ఈ సంఘటన ఉదాహరణగా నిలుస్తుంది. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన పుల్లయ్య ఆరేళ్ల క్రితం ఇంటిని వదిలివెళ్లాడు. ఎంత వెతికినా కనపడకపోవడంతో కర్మకాండలను కూడా నిర్వహించారు. అయినా ఆయన కోసం వెతకడం మానలేదు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు టిక్ టాక్ వీడియో చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో తండ్రి ఆచూకి తెలిసింది. దీంతో గుజరాత్‌లో ఉన్న తండ్రిని …

Read More »

ఆ తర్వాతే రాయలసీమలో అడుగుపెట్టాలి…

కర్నూలు: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ ఉనికి కోసం ప్రజా చైతన్య యాత్ర పేరుతో డ్రామాలాడుతున్నారని నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రకిషోర్‌ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారని.. అందుకే విశాఖలో ఆయనను ప్రజలు అడ్డుకున్నారని చెప్పారు. కర్నూలు జ్యూడిషియల్‌ క్యాపిటల్‌కు మద్దతు ఇవ్వకపోతే కర్నూలులో కూడా చంద్రబాబుకు విశాఖ గతే పడుతుందన్నారు. కర్నూలును రాజధానిగా స్వాగతించిన తర్వాతే చంద్రబాబు …

Read More »

సీఎం జగన్‌కు కృతజ్ఞతలు…

కర్నూలు: కర్నూలును న్యాయరాజధానిగా ఏర్పాటు చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి బీజేపీ నేత, ఎంపీ టీజీ వెంకటేశ్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో సీఎం జగన్‌, ఎంపీ టీజీ వెంకటేశ్‌ల మధ్య అసక్తికర చర్చ జరిగింది. తమకు రావాల్సిన హైకోర్టు ఎంతవరకు వచ్చిందని సీఎంను ఎంపీ కోరగా..  కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం అనుమతి కోరామని, నివేదిక కూడా పంపించామని సీఎం జగన్‌ …

Read More »

కర్నూలులో దొంగల హల్‌చల్…

డోన్: కర్నూలు జిల్లా డోన్‌లో దొంగలు హల్‌చల్ చేశారు. కృష్ణా లాడ్జ్ సమీపంలోని రెండు ఇళ్లలో చోరీకి తెగబడిన దుండగులు భారీగా బంగారం, నగదును చోరీ చేశారు. అనంతరం మరో రెండు వీధుల్లో రెండు బైక్‌లను అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం దర్యాప్తు చేపట్టారు. మరోవైపు పట్టణంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Read More »

టామీకి అంతిమ యాత్ర…

కర్నూలు, ఆళ్లగడ్డ: పట్టణానికి చెందిన ఆవుల భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉండే శునకం (టామీ) అనారోగ్యంతో ఆదివారం మృతిచెందింది. దానిపై ప్రేమతో ఘనంగా అంతిమయాత్ర నిర్వహించారు. ఆ తర్వాత అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ దృశ్యాన్ని పట్టణవాసులు ఆసక్తిగా తిలకించారు.

Read More »

జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన పవన్…

కర్నూలు: సుగాలి ప్రీతి కేసు సీబీఐకి ఇవ్వాలన్న నిర్ణయం మంచిదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యానించారు. జగన్‌ సర్కార్‌ నిర్ణయం ప్రీతి కుటుంబానికి ఊరటనిచ్చే విషయమన్నారు. ఇప్పటికే కేసు విచారణ ఆలస్యమైందన్నారు. సీబీఐ విచారణను వేగవంతం చేయాలని పవన్‌ కోరారు. కాగా.. పవన్ రేపు ఢిల్లీకి పయనమవనున్నారు. ఢిల్లీలో కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌ కార్యాలయానికి వెళ్లనున్నారు. మాజీ సైనిక సంక్షేమ నిధికి ఆయన రూ.కోటి విరాళం ఇవ్వనున్నారు. అనంతరం …

Read More »