Breaking News
Home / Tag Archives: liquor stores

Tag Archives: liquor stores

బెజవాడ పోలీసులు కొత్త వ్యూహం…

కృష్ణా: విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలకు కొత్త నిబంధనలు అమలు చేశారు. రెడ్ జోన్ నుంచి వచ్చే వారిని కట్టడి చేసేందుకు బెజవాడ పోలీసులు కొత్త వ్యూహం పన్నారు. ఆయా మండల పరిధిలో ఆధార్ కార్డు ఉంటేనే మద్యం కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. మద్యం కోసం రెడ్ జోన్ల నుంచి గత రెండు రోజులుగా గ్రీన్ జోన్లకు వెళుతున్నట్లు గుర్తించారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి …

Read More »

మద్యం దుకాణాల వద్ద బారికేడ్లు

అమరావతి : రాష్ట్రంలో ఇప్పటికే 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో స్కూళ్లు, టెంపుల్స్ ఇప్పటికే మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో మద్యం దుకాణాల వద్ద ఒక్కొక్కరికి మధ్య కనీసం 2-3 మీటర్ల దూరం ఉండేలా క్యూలైన్లలో బారికేడ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే విశాఖలో ఈ విధానం అమలు చేస్తుండగా.. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనుంది.

Read More »

డిసెంబర్ 31కి ఈ సారి ‘నో పర్మిషన్’

ఏపీలో రోజూలాగే నేడు కూడా రాత్రి 10 గంటలకు బార్లు మూతబడనున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న అర్థరాత్రి ప్రతి ఏటా 12 గంటల వరకు మద్యం దుకాణాలు, ఒంటిగంట వరకు బార్లకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చేది. అయితే ఈ సారి అవకాశం ఇవ్వలేదు. దీంతో అర్థరాత్రి 10 గంటల తర్వాత మద్యం కొనుగోలు చేయాలనుకునే వారికి అవకాశం లేదు.

Read More »

ముఖ్యమంత్రి సొంత జిల్లాలో మద్యం దుకాణాలకు ఫుల్ డిమాండ్..

ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినా మెదక్ లో మొత్తం 38 షాపులకు నోటిఫికేషన్ విడుదల చేయగా ఈ షాపుల కోసం ఏకంగా 438 దరఖాస్తులు రావడం విశేషం. గతంలో ఒక్కో టెండర్ కు టెండర్ ఫీజు కింద లక్ష రూపాయలు మాత్రమే చెల్లించాల్సి వచ్చేది. అది నాన్ రిఫండ్ బుల్. కానీ, ఈసారి ఫీజును ఏకంగా రెండు లక్షల రూపాయలు పెంచారు. అంటే గతంలో కంటే డబుల్. అయినా సరే …

Read More »

నేటితో ముగియనున్న వాటి దరఖాస్తు గడువు…

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ దాఖలుకు దరఖాస్తు గడువు నేటితో ముగియనున్నది. మంగళవారం ఒక్కరోజే 10 వేల దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది. ఈ నెల 9 నుంచి మంగళవారం వరకు అందిన మొత్తం దరఖాస్తుల సంఖ్య 20,630కి చేరినట్టు సమాచారం. దరఖాస్తులు స్వీకరించేందుకు 33 జిల్లాల్లో 34 కేంద్రాలను నెలకొల్పారు. టెండర్లు దాఖలు చేసేవారు నిర్దేశించిన విధంగా ఫారం-ఏ3 (ఏ)లో దరఖాస్తు చేసుకోవాలి. నాన్ రీఫండబుల్ ఫీజు కింద …

Read More »

తెలంగాణ మద్యం దుకాణాలకు నోటిఫికేషన్‌…

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో నవంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న నూతన మద్యం విధానంలో భాగంగా మద్యం దుకాణాల నిర్వహణకు బుధవారం రాష్ట్రంలో టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుండి దరఖాస్తుల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 9 నుంచి 16 వరకు (ఆదివారం మినహా) కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 18 వ తేదీన …

Read More »

మద్యం దుకాణం సరుకులను తక్షణమే తీసేయాలి….

పశ్చిమ గోదావరి : ఆలమూరులోని ప్రభుత్వ మద్యం దుకాణం సరుకులను తక్షణమే తీసివేయాలంటూ.. ఐద్వా ఆధ్వర్యంలో స్థానిక మహిళలతో కలిసి పెనుమంట్ర మండలంలో ధర్నా నిర్వహించారు. పెనుమంట్ర మండలం ఆలమూరులోని కొయ్యేటిపాడు రోడ్డులో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం సరుకులను తక్షణమే తీసివేయాలంటూ.. ఐద్వా జిల్లా కార్యదర్శి డి.కళ్యాణి డిమాండ్‌ చేశారు.

Read More »