Breaking News
Home / Tag Archives: manchiryala district

Tag Archives: manchiryala district

యువతికి రాంగ్ కాల్… చివరికి

మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. యువతికి రాంగ్ కాల్ చేసి పిలిచి మూతబడ్డ పాఠశాలలో అత్యాచారానికి పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి గ్రామానికి చెందిన యువతికి 22 సంవత్సరాలు. 2 ఫిబ్రవరి 2020 న ఆ యువతికి మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన సాయికృష్ణ రాంగ్ కాల్ చేశాడు. ఆ రోజు నుంచి ఆ యువతికి నిత్యం కాల్స్ చేసి వేధిస్తున్నాడు. దీంతో యువతి తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. …

Read More »

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

గంగారాం: మంచిర్యాల జిల్లా గంగారాం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ గురై గట్టయ్య అనే రైతు మృతి చెందాడు. అయితే విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే గట్టయ్య మృతి చెందాడని బంధువులు ఆందోళనకు దిగారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు.

Read More »

లక్కీడ్రా పేరుతో మోసం చేసిన ముఠా అరెస్ట్…

మంచిర్యాల: లక్కీ డ్రా పేరుతో ప్రజలను మోసం చేసి లక్షలు కాజేసిన ఓ ముఠాను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. బెల్లంపల్లి మండలం కాసిరెడ్డిపల్లి కేంద్రంగా ఈ ముఠా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. లక్కీ డ్రా పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న 8 మందిని అరెస్టు చేసినట్లు వారు ప్రకటించారు. నిందితుల వద్ద నుంచి 2 కార్లు, 8 ఫోన్లు, రూ.29,090 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

Read More »

మంచిర్యాలలో రోడ్డు ప్రమాదం..

మంచిర్యాల : జైపూర్ మండలం ఇందారం రైల్వే బ్రిడ్జిపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కర్రల లోడుతో వెళ్తున్న లారీని వెనుక నుంచి వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎంలో వెళ్తున్న 30 మంది కూలీల్లో ఇద్దరు మృతి చెందారు. మిగతా కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత కూలీలంతా కర్నూలు జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ …

Read More »

ముగ్గురు అటవీ అధికారులు సస్పెండ్…

మంచిర్యాల: జిల్లాలో ముగ్గురు అటవీ అధికారులను సస్పెండ్ చేస్తూ ఎఫ్‌డీవో ఉత్తర్వులు వెలువరించారు. సెక్షన్ ఆఫీసర్ శేఘరామ్, బీట్ అధికారులు సంతోష్, శ్రీధర్‌లను ఎఫ్‌డీవో విధుల నుంచి తాత్కాలికంగా తొలగించారు. మేడరిపేట సెక్షన్‌లో కలప అక్రమరవాణాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలతో వీరిని సస్పెండ్ చేశారు.

Read More »

డెంగ్యూ జ్వరంతో నలుగురు మృతి….

మంచిర్యాల: డెంగ్యూ జ్వరంతో మంచిర్యాలకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. సికింద్రాబాద్‌లో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోనా అనే వివాహిత మృతి చెందింది. నిన్న మగ పిల్లవాడికి జన్మ నిచ్చిన అనంతరం ఆమె మృతి చెందింది. అలాగే సోనా భర్త, తాత, కుమార్తె కూడా ఇప్పటికే డెంగ్యూ జ్వరంతో మృతి చెందారు. 15 రోజుల్లో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో ఆ కుటుంబ …

Read More »

ఓపెన్ కాస్ట్ గని ఏర్పాటును విరమించుకోవాలి….

మంచిర్యాల: ఇందారంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటుకు వ్యతిరేకంగా జాతీయ రహదారిపై గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ కాస్ట్ గని ఏర్పాటు చేయవద్దని తీర్మానం చేశారు. కాగా, గ్రామస్తుల ధర్నాకు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత సోమారపు సత్యనారాయణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలంగాణను బొందల గడ్డగా మార్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం పూనుకుందని విమర్శలు గుప్పించారు. ప్రజలు …

Read More »

తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో పడింది…

మంచిర్యాల: ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..  తెలంగాణలో రాజ్యాంగం, కోర్టులు లేనట్టుగా కేసీఆర్ భావిస్తున్నారని, కేవలం ఆర్టీసీనే కాదు తెలంగాణ రాష్ట్రమే ప్రమాదంలో పడిందన్నారు. హుజూర్‌నగర్‌లో వందల కోట్లు ఖర్చు చేసి టీఆర్ఎస్ గెలిచిందని మందకృష్ణ ఆరోపించారు. ఆ అహంకారంతోనే కేసీఆర్‌ మాట్లాడుతున్నారని, ఉప ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన…జనరల్ ఎన్నికల్లో గెలుస్తామనుకోవడం పొరపాటన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం భవిష్యత్‌లో …

Read More »

కన్నుల పండుగగా దండారి ఉత్సవాలు

దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరంలోని పద్మల్‌పురి కాకో ఆలయంలో దండారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలం రిమ్మ, ఇంద్రవెల్లి మండలం నిజాంగూడ, అసిఫాబాద్‌ జిల్లాకు చెందిన గుస్సాడీ బృందాల ప్రదర్శనలతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. సంప్రదాయ …

Read More »

ఎల్లంపల్లి ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తివేత…

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటోంది. ప్రాజెక్టుకు సంబంధించిన 3 గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5 వేల క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 20.17 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 19.39 టీఎంసీలుగా ఉంది. అలాగే నారాయణపూర్ ప్రాజెక్ట్‌కు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటోంది. 21 గేట్ల ద్వారా 2.31 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.

Read More »