Breaking News
Home / Tag Archives: media conference

Tag Archives: media conference

వైసీపీపై ప్రతిపక్షనేత యనమల ఎద్దేవా….

రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరంలోని మండలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, ఆత్మహత్యలపై వైసీపీ నాయకులు హేలనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలను విమర్శించడానికే మంత్రులు పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో ఇసుక కొరత లేదని, కార్మికులకు చేతినిండా పని దొరికిందని గుర్తు చేశారు. సింగపూర్‌ కన్సార్టియం ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పాలని యనమల …

Read More »

ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడిని వేటాడిన జాగిలం ఇదే…!

అమెరికా: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు అబూ బాకర్ అల్ బగ్దాదీని అమెరికా డెల్టా ఫోర్స్ దళాలు ఖతం చేసిన విషయం తెలిసిందే. సిరియాలోని ఓ టన్నెల్‌లో దాక్కున్న బగ్దాదీని వెంటాడి చంపేశారు. అయితే ఆ ఉగ్రవాదిని వేటాడిన జాగిలం ఫోటోను డోనాల్డ్ ట్రంప్ రిలీజ్ చేశారు. ఓ చూడముచ్చటైన జాగిలం ఫోటోను రిలీజ్ చేశామని, అబూ బాకర్‌ను పట్టుకుని చంపడంలో ఈ జాగిలం కీలక పాత్ర పోషించినట్లు ట్రంప్ …

Read More »

సీఎంను విమర్శించే నైతిక హక్కు వారికి లేదు….

విశాఖపట్నం: శుక్రవారం మద్దిలపాలెంలోని వైసీపీ పార్టీ నగర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌గాంధీ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సొంత అజెండాను గాలికొదిలేసి టీడీపీ అధినేత చంద్రబాబుకు తొత్తులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గాజువాకలో పవన్‌ను నమ్మి 58 వేల మంది ఓట్లు వేస్తే ఓటమి తర్వాత వారిని పట్టించుకోకుండా ఇసుక కోసం బీచ్‌లో మార్చ్‌ చేస్తాననడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పవన్‌ …

Read More »

మేము నీట్‌కు వ్యతిరేకం: పీఎంకే చీఫ్….

చెన్నై: సేలంలో శుక్రవారం పీఎంకే అధ్యక్షుడు జేకే మణి మీడియాతో మాట్లాడుతూ డీఎంకే చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మని ప్రజలు అధికార అన్నాడీఎంకేకు విజయాన్ని అందించారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మి ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించారు కానీ వారి హామీలు ఆచరణకు సాధ్యం కావని గుర్తించి అన్నాడీఎంకేకు విజయాన్ని కట్టబెట్టారని చెప్పారు. అధికార అన్నాడీఎంకే కూటమిలో పీఎంకే భాగస్వామ్యంగా ఉందని తెలిపారు. స్థానిక …

Read More »

మరికాసేపట్లో సీఎం కేసీఆర్‌ మీడియాతో భేటీ….

హైదరాబాద్‌ : హుజుర్‌నగర్‌ ఉపఎన్నిక తుది ఫలితం వెలువడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మరికాసేపట్లో హుజుర్‌నగర్‌ తుది ఫలితం వెలువడనుంది. మొత్తం 22 రౌండ్లకు గానూ ఇప్పటి వరకు 13 రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. తొలి రౌండ్‌ నుంచి 13వ రౌండ్‌ వరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డే ఆధిక్యంలో ఉన్నారు. సైదిరెడ్డి విజయం ఖాయం కావడంతో తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ …

Read More »

క్రికెట్ చరిత్రలో ధోనీది ప్రత్యేక స్థానం: దాదా

ముంబయి: బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సౌరవ్‌ గంగూలీ మీడియాతో మాట్లాడుతూ ఈ బాధ్యతలు చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. దేశంలోని ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్ల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. భారత క్రికెట్‌కు మేలు చేసేందుకే తామున్నామని, క్రికెట్‌ కమిటీలు, సంఘాల్లోకి మాజీ క్రికెటర్లు రావడం సంతోషదాయకమని, ముంబయి నగరం టీమిండియాకు ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లను అందించిందని చెప్పారు. ప్రస్తుతం భారత జట్టు అద్భుతంగా ఉందని కెప్టెన్‌ కోహ్లీకి …

Read More »

అటువంటి దాడులు మరోసారి జరగకుండా….

ఢిల్లీ: ఢిల్లీలో జరుగుతున్న ‘నావెల్‌ కమాండర్స్‌ కాన్ఫరెన్స్‌’లో పాల్గొన్న కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ ‘భారత్‌ ఎప్పుడూ తప్పులు చేయలేదు. కావాలని ఏ దేశంపైనా దాడికి పాల్పడలేదు. పరాయి భూమిని కనీసం అంగుళం కూడా బలవంతంగా లాక్కోలేదు. కానీ, భారత్‌ను తప్పుడు దృష్టితో చూసేవారికి తగిన గుణపాఠం చెప్పే సామర్థ్యం మన సాయుధ బలగాలకు ఉంది. భారత నేవీ నిఘా నీడలో సముద్రమార్గం అత్యంత సురక్షితంగా ఉంది. …

Read More »

రూ.60 ఖర్చవుతుందనడం హాస్యాస్పదం:టీడీపీ

అమరావతి: అమరావతిలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విలేకరులతో మాట్లాడుతూ ప్రజాధనం వృథా వంకతో కోర్టు వాయిదాల నుంచి సీఎం జగన్‌ తప్పించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. కోర్టుకు హాజరైతే రూ.60 ఖర్చవుతుందని చెప్పడం హాస్యాస్పదమని, అధికారంతో కేసులను ప్రభావితం చేసే ప్రమాదం గతం కన్నా ఇప్పుడు రెట్టింపు అయ్యిందని, సీఎం హాజరుకు మినహాయింపు అడగడంపై అనేక అనుమానాలు ఉన్నాయని యనమల తెలిపారు. చట్టం ముందు అందరూ సమానులేనని, శిబుసోరెన్‌ సీఎంగా …

Read More »

ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారు:బాబు

గుంటూరు: గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరతతో 30 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, మద్యానికి జె-ట్యాక్స్‌ విధిస్తున్నారని మండిపడ్డారు. సచివాలయ ఉద్యోగాల్లో ప్రశ్నపత్రం టైప్‌ చేసిన వాళ్లకే ప్రథమ ర్యాంకు వచ్చిందని ఎద్దేవా చేశారు. ఐదు నెలల్లో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారని, వర్షాకాలంలోనే విద్యుత్‌ కోతలు విధిస్తున్నారని దుయ్యబట్టారు.

Read More »

నాకు ఇప్పటి వరకు పిలుపు రాలేదు:కేకే

హైదరాబాద్‌: నేడు హైదరాబాద్‌లో తెరాస ముఖ్యనేత కేశవరావు విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ తెలంగాణ ఆర్టీసీ ఐకాస నేతలతో సంప్రదింపుల విషయమై సీఎం కేసీఆర్ నన్ను ఇప్పటి వరకు పిలవలేదని అన్నారు. ఆర్టీసీ ఐకాస నేతలెవ్వరూ తనను కలవలేదని, ఒక వేళ సీఎం ఆదేశిస్తే మధ్యవర్తిగా ఉంటానని కేకే తెలిపారు. ఇద్దరు కార్మికులు చనిపోయారనే బాధతోనే ‘ చర్చలకు సిద్ధం కావాలి’ అంటూ స్టేట్మెంట్ ఇచ్చానన్నారు. ఆర్టీసీ సమ్మెపై కేవలం ఒక …

Read More »