Breaking News
Home / Tag Archives: meeting

Tag Archives: meeting

ముగిసిన న్యాయవాదుల సమావేశం..

గుంటూరు: దళిత ప్రజాప్రతినిధులపై జరిగిన దాడులను ఖండిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ న్యాయవాదుల సంఘం నిర్వహించిన సమావేశం శనివారం ముగిసింది. రాజధానిలో దళిత ప్రజాప్రతినిధుల దాడులపై.. నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుంటున్న వైనంపై గుంటూరులో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దళిత ఎమ్మెల్యే శ్రీదేవి, ఎంపీ నందిగం సురేష్‌లపై జరిగిన దాడులను న్యాయవాదుల సంఘం ఖండించింది. త్వరలోనే న్యాయవాదుల జేఏసీని ఏర్పాటు చేయాలని సమావేశంలో …

Read More »

13న ఏపీ కేబినెట్ భేటీ

అమరావతి: ఈ నెల 13వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరగనుండగా.. 11వ తేదీ సాయంత్రంలోగా ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలను ప్రభుత్వం కోరింది. హైకోర్టులో కేసులు, విశాఖకు సచివాలయం తరలింపు, ఉగాదికి ఇళ్ల పట్టాలు పంపిణీ అంశాలపై కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అలాగే శాసనమండలిలో సెలక్ట్ కమిటీ ప్రక్రియపై కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read More »

తమిళనాడుకు వెళ్లనున్న కియా మోటార్స్?

అనంతపురం జిల్లా నుంచి కియా మోటార్స్ తరలివెళ్లనున్నట్లు సమాచారం. మొత్తం ప్లాంట్‌ను తమిళనాడుకు తరలించాలని కియా మోటార్స్ యాజమాన్యం భావిస్తున్నట్లు జాతీయ మీడియాల్లో కథనాలు వస్తుండగా.. ఇటీవల మారిన ప్రభుత్వ పాలసీల వల్ల కియా ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రూ.13వేల కోట్లతో ఏర్పాటైన ఈ ప్లాంట్ ద్వారా ఏటా 3 లక్షల కార్లు ఉత్పత్తి కానుండగా.. త్వరలో జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే ఛాన్సుంది.

Read More »

మోదీతో భేటీ కోసం ఢిల్లీకి 66మంది విద్యార్థులు

చెన్నై: రాష్ట్రానికి చెందిన 66 మంది విద్యార్థులు ఢిల్లీ పయనం అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం భేటీ కానున్నారు. ప్రధానితో భేటీ సమయంలో సంధించేందుకు కొన్ని ప్రశ్నలను విద్యార్థులు సిద్ధం చేసుకున్నారు. ప్రతి ఏటా పబ్లిక్‌ పరీక్షలకు ముందుగా విద్యార్థుల్లో ధైర్యాన్ని, ఉత్తేజాన్ని కల్గించే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రసంగం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఆదిశగా ఈ ఏడాది పది, ప్లస్‌టూ పరీక్షలు రాయనున్న …

Read More »

రేపు జనసేన-బీజేపీ కీలక భేటీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలో రాజకీయపరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ నెల 16వ తేదీన జనసేన, బీజేపీ నేతల సమావేశం విజయవాడలో జరగనుంది. ఈ రెండు పార్టీలు ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఒక అవగాహనకు వస్తుండడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా రాజధాని ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తోంది. 29 గ్రామాలకే పరిమితమైందనుకున్న ఉద్యమం.. తర్వాత గుంటూరు, కృష్ణా జిల్లాలతోపాటు కోస్తా, రాయలసీమ జిల్లాలకు …

Read More »

రేపు మధ్యాహ్నం తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల భేటీ

హైదరాబాద్‌: సోమవారం మధ్యాహ్నం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం – 2014 లోని పరిష్కారం కాని అంశాలు, జలవనరుల సద్వినియోగం తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే పలుమార్లు రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశమై పలు అంశాలపై చర్చించిన …

Read More »

లౌకిక దేశాన్ని బిజెపి విడదీయాలని చూస్తోంది

పిఠాపురం: పిఠాపురం లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక లయన్స్‌ క్లబ్‌ కల్యాణ మండపంలో ఎన్‌పిఆర్‌, ఎన్‌ఆర్‌సి, సిఎఎ బిల్లుల పై రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.శేషబాబ్జి మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి.. ఎన్‌పిఆర్‌, ఎన్‌ఆర్‌సి, సిఎఎ బిల్లుల పేరుతో లౌకిక దేశాన్ని మత ప్రాతిపదిక పేరుతో విడదీయాలని చూస్తోందని పేర్కొన్నారు.

Read More »

నేడే హైపవర్‌ కమిటీ తొలి భేటీ

అమరావతి: రాష్ట్ర రాజధాని అంశంపై జీఎన్‌ రావు, బీసీజీ కమిటీలు ఇచ్చిన నివేదికల అధ్యయనానికి ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ తొలిసారిగా సమావేశం కానుంది. కమిటీ సభ్యులైన 10 మంది మంత్రులు, ఆరుగురు ఉన్నతాధికారులు మంగళవారం విజయవాడలోని ఏపీసీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో భేటీ కానున్నారు. సోమవారమే ఈ సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని కమిటీలోని పలువురు మంత్రులు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లడంతో మంగళవారానికి వాయిదా పడింది. …

Read More »

ఇండోర్‌లో ప్రారంభమైన ఆర్.ఎస్.ఎస్ జాతీయ కార్యవర్గ సమావేశాలు

ఇండోర్ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జాతీయ కార్యకారిణీ (జాతీయ కార్యవర్గ) సమావేశాలు ఇండోర్‌లో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు, ఎన్నార్సీపై కూడా సుదీర్ఘంగా చర్చించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో సంఘ్‌కు చెందిన 56 అనుబంధ సంఘాలు పాల్గొంటున్నాయి. వీరందరికీ ఆర్.ఎస్.ఎస్ అగ్రనేతలు మార్గనిర్దేశనం చేయనున్నారు. అయితే మధ్యప్రదేశ్‌కు సంబంధించిన ప్రచారాలకు అందరికీ ఒక్కో …

Read More »

ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం

హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె కొనసాగించాలా? వద్దా? అనే దానిపై కాసేపట్లో ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. సమ్మె కొనసాగింపుపై మంగళవారం ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర తర్జనభర్జనలకు లోనైన సంగతి తెలిసిందే. సమ్మె అంశాన్ని హైకోర్టు లేబర్‌ కోర్టుకు నివేదించడంతో.. సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాలు పునరాలోచనలో పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ బుధవారం కూడా సమావేశమైంది. సమ్మె విషయమై లేబర్‌ కమిషన్‌కు …

Read More »