Breaking News
Home / Tag Archives: MIM

Tag Archives: MIM

‘ఢిల్లీ అల్లర్లపై ప్రధాని నోరుమెదపాలి’

హైదరాబాద్‌: ఢిల్లీలో ఇటీవల జరిగిన అల్లర్లను ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ మారణహోమంగా అభివర్ణించారు. ఢిల్లీ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని, బాధిత ప్రజలను పరామర్శించేందుకు ఆయా ప్రాంతాల్లో పర్యటించాలని కోరారు. దేశ రాజధానిని కదిపివేసిన అల్లర్లపై ఎన్డీయే నేతలు మౌనం దాల్చడాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ తన అధికార నివాసానికి సమీపంలో జరిగిన ఢిల్లీ హింసాకాండపై ఎందుకు నోరు మెదపడం లేదని తాను …

Read More »

నగరంలో దేశ ద్రోహులు ఉన్నారు…

హైదరాబాద్: నగరంలో దేశ ద్రోహులు ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… దొంగ పత్రాలతో ఆధార్‌ కార్డులు పొందిన 127 మందిపై..నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని డీజీపీని కోరామన్నారు. రోహింగ్యాలకు ఎంఐఎం మద్దతివ్వడం వెనుక మతలబేంటని ఆయన ప్రశ్నించారు. ఎంఐఎం నేతలు పోలీసులకే సవాల్‌ విసురుతున్నారని, ప్రభుత్వ మద్దతుతోనే ఎంఐఎం నేతలు ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. సీఏఏకు మద్దతుగా మార్చి 15న నిర్వహించే …

Read More »

పఠాన్ వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలి

హిందువుల సహనాన్ని చేతగానితనంగా భావించొద్దని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. 100 కోట్ల మంది హిందువులకు 15 కోట్ల మంది ముస్లింలు చాలని ఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైందవ మతానికి సహనం ఎక్కువని, కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పఠాన్ వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని ఫడ్నవీస్ డిమాండ్ చేశారు.

Read More »

కేసీఆర్, కేటీఆర్ చర్చకు సిద్ధమా :కిషన్‌ రెడ్డి

భైంసా: కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు. అధికార తెరాస అండదండలతోనే ఎంఐఎం పార్టీ అల్లర్లు సృష్టిస్తోందని విమర్శించారు. నిర్మల్ జిల్లా తల్వేద గ్రామంలో నూతనంగా నిర్మించిన భాజపా జిల్లా కార్యాలయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్షణ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెరాసపై విమర్శలు గుప్పించారు. కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల …

Read More »

సీఏఏకు వ్యతిరేకంగా తొలి తీర్మానం

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఓ మునిసిపల్ కార్పొరేషన్ తీర్మానించింది. ఇప్పటి వరకు పలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పాటు కొన్ని బీజేపీ వ్యతిరేక పార్టీలు అధికారంలో వున్న రాష్ట్రాలు సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఓ మునిసిపల్ కార్పొరేషన్ సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేయడం ఇదే తొలిసారి. అది కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన మునిసిపల్ కార్పొరేషన్ కావడం విశేషం. దేశంలో తొలిసారిగా ఓ …

Read More »

జేబీఎస్‌- ఎంజీబీఎస్‌ మెట్రో: ఒవైసీ ట్వీట్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో రైలు యాజమాన్యంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంజీబీఎస్‌ నుంచి జేబీఎస్‌ వరకు మెట్రో పనులు పూర్తి చేశారు గానీ.. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నామా మార్గంలో పనులు ఎప్పుడు మొదలుపెడతారని ప్రశ్నించారు. ఈ మేరకు… ‘దార్‌ ఉల్‌ షిఫా నుంచి ఫలక్‌నామా మెట్రో లైన్‌ సంగతి ఏంటి? జేబీఎస్‌ మార్గాన్ని పూర్తి చేశారు గానీ.. దక్షిణ హైదరాబాద్‌ విషయానికి …

Read More »

నన్ను చంపెయ్యండి: ఓవైసీ

దేశద్రోహులను కాల్చివేయాలంటూ(గోలీ మారో) నిన్న కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కౌంటరిచ్చారు. ‘అనురాగ్ ఠాకూర్.. నేను సవాల్ చేస్తున్నా. దేశంలో ఎక్కడికి రమ్మన్నా నేను వస్తా నన్ను చంపెయ్యండి. మీ మాటలకు నేను భయపడటం లేదు. ఎందుకంటే దేశాన్ని రక్షించడానికి భారీగా నా అక్కాచెళ్లెల్లు, తల్లులు రోడ్ల మీదకు వస్తున్నారు’ అని ఓవైసీ అన్నారు.

Read More »

పంతం నెగ్గించుకున్న గులాబీ పార్టీ

నిజామాబాద్ కార్పొరేషన్‌పై TRS పంతం నెగ్గించుకుంది. కవిత ఓటమికి ప్రతీకారంగా మేయర్ స్థానాన్ని పొత్తులతో చేజిక్కించుకుంది. ఎన్నికల్లో 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా BJP నిలువగా, MIM 16, TRSకు 13 సీట్లు, కాంగ్రెస్ 2, ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అయితే మ్యాజిక్ ఫిగర్ 34‌కు సీట్లు లేకపోవడంతో BJP ప్రతిపక్షంలోకి వెళ్లగా.. MIM, ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి TRS మేయర్ స్థానాన్ని దక్కించుకుంది.

Read More »

దేశాన్ని ఎవరూ విడదీయలేరు: అసదుద్దీన్

దేశాన్ని ఎవరూ ముక్కలు చేయలేరని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. అస్సాంను భారతదేశం నుండి విడదీస్తామంటూ నిన్న JNU స్టూడెంట్ షర్జీల్ ఇమామ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. భారతదేశం ఎప్పటికీ ఒకటిగానే ఉంటుందని అన్నారు. ఎవరికీ ఈ దేశాన్ని విడదీసే దమ్ము లేదని, దానిని తాము వ్యతిరేకిస్తామన్నారు. అటు నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని కానీ ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ ఆహ్వానించదగినవి కాదన్నారు.

Read More »

నిజామాబాద్ పేరు మారుస్తాం: అరవింద్

నిజామాబాద్ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఎంపీ అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. తాము గెలిస్తే నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తూ మొదటి తీర్మానం చేస్తామని చెప్పారు. అటు నిజామాబాద్ మేయర్ పీఠంపై ఎంఐఎంను కూర్చోబెట్టేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అరవింద్ వ్యాఖ్యలకు TRS ఎమ్మెల్యే గణేశ్ గుప్తా కౌంటరిచ్చారు. TRSకు కాకుండా మేయర్  MIMకు ఇస్తే ముక్కు నేలకు రాస్తానన్నారు.

Read More »