Breaking News
Home / Tag Archives: modi

Tag Archives: modi

మోదీపై ఆగ్రహం వ్యక్తం చేసిన శశిథరూర్‌

న్యూఢిల్లీ : ఈ మధ్య కాలంలో ఆలయ ప్రవేశాల వివాదం బాగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. నేటికి కూడా శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటూ ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనను కూడా ఆలయంలోకి అనుమతించలేదు అంటున్నారు కాంగ్రెస్‌ నాయకుడు శశిథరూర్‌. అయితే ఇక్కడ శశి థరూర్‌ని అనుమతించనది అయ్యప్ప ఆలయంలోనికి కాదు.. ప్రసిద్ధి చెందిన శ్రీ పద్మనాభస్వామి ఆలయంలోకి. వివరాలు.. మంగళవారం ప్రధాని …

Read More »

మోదీ అధికారిక కార్యక్రమానికి సీఎం గైర్హాజర్

భువనేశ్వర్: లోక్‌సభ ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో బీజేపీకీ, ప్రత్యర్థి పార్టీలకు మధ్య ఎడం పెరుగుతోంది. ప్రధాని మోదీ మంగళవారంనాడు ఒడిశాలో చేపట్టిన పలు అధికారికి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దూరంగా ఉండిపోయారు. ప్రోటోకాల్ ప్రకారం ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి అయినా ప్రధాని అధికార పర్యటనల్లో ఆయన వెంట ఉండాలి. అయితే ప్రైవేటు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటే మాత్రం సీఎం ఉండాల్సిన పని లేదు. మోదీ ఇవాళ ఒడిశాలో …

Read More »

మోదీకి మల్లికార్జున ఖర్గే ఘాటు లేఖ

న్యూఢిల్లీ: సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్‌ వర్మపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) నివేదికను బహిరంగం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మంగళవారంనాడు డిమాండ్ చేసారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. సీవీసీ నివేదికలో ఏం చెప్పిందో బహిరంగం చేయడం వల్ల దీనిపై ప్రజలు ఒక అవగాహనకు రాగలుగుతారని అన్నారు. సీబీఐ కొత్త డైరెక్టర్ ఎంపిక కోసం తక్షణ కమిటీ సమావేశం ఏర్పాటు …

Read More »

ఒడిశాలో రైల్వేలైన్‌ను ప్రారంభించిన మోదీ

బలాంగిర్: ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశాలో మంగళవారంనాడు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. బొలాంగిర్-బీచుపలి రైల్వేలైన్‌ను ప్రధాని ఇవాళ ప్రారంభించారు. సోనేపూర్‌లో కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవనానికి శంకుస్థాపన చేశారు. జగత్సింగ్‌పూర్, కేంద్రపూర్, పూరి, ఫుల్బని, బార్‌గఢ్, బలాంగీర్‌లలో కొత్త పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యాలయంలో మోదీ మాట్లాడుతూ, ఒడిశా రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. నెలరోజుల్లో మూడుసార్లు …

Read More »

గురుగోవింద్ సింగ్ స్మారక నాణెం విడుదల చేసిన మోదీ

న్యూఢిల్లీ: సిక్కు పరంపరంలో పదవ గురువు గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా ఆయన స్మారక నాణేన్ని ప్రధాన నరేంద్ర మోదీ ఆదివారంనాడు విడుదల చేశారు. లోక్‌ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు సిక్కు నేతలు పాల్గొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ 2017 జనవరి 5న పాట్నాలో జరిగిన గురుగోవింగ్ సింగ్ 350వ జయంత్యుత్సవాల్లోనూ పాల్గొన్నారు. …

Read More »

చంద్రబాబుపై మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు…

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సమావేశం వేదికగా.. చంద్రబాబు ప్రభుత్వం తీసుకొన్న ఇటీవలి నిర్ణయాలపై ధ్వజమెత్తారు. తమ రాష్ట్రాల్లోకి సీబీఐ ప్రవేశాన్ని నిరాకరించాలన్న చంద్రబాబు, మమతా బెనర్జీ సర్కారుల నిర్ణయంపై ఆయన పరుష వ్యాఖ్యలు చేశారు. ‘‘అంత భయపడేంత తప్పు వారు ఏం చేశారు? ఇప్పుడు సీబీఐని నిరాకరించారు.. రేపు మరికొన్ని సంస్థలను …

Read More »

ఎస్పీ- బీఎస్పీ పొత్తు ఖరారు.. చెరో 38 స్థానాల్లో పోటీ

లక్నో : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాజ్‌ వాదీ పార్టీ(ఎస్‌పీ), బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్‌పీ) అధినేతలు, మాజీ సీఎంలు మాయవతి, అఖిలేశ్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. శనివారం విలేకరులతో జరిగిన సమావేశంలో భాగంగా లోక్‌సభ సీట్ల పంపకంపై అనుసరించే విధానాలను తెలిపారు. బీజేపీని ఓడించాలనే ఏకైక లక్ష్యం, ప్రజలకు మేలు చేయాలనే తలంపుతోనే చరిత్రాత్మక పొత్తుకు సిద్ధపడినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ కోసం …

Read More »

ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ

అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేఖ రాశారు. వైకాపా అధినేత జగన్‌పై దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని చంద్రబాబు లేఖలో మండిపడ్డారు. జగన్‌పై దాడి కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు సరికాదని పేర్కొన్నారు. కేంద్రం వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ చంద్రబాబు 5 పేజీల లేఖ రాశారు. 2008లో ఎన్‌ఐఏ …

Read More »

ఏపీలో బీజేపీకి సినిమా చూపిస్తాం: లోకేష్

రాజమండ్రి: ప్రధాని మోదీపై మంత్రిపై మంత్రి లోకేష్ విరుచుకుపడ్డారు. మోదీ మోనార్క్‌లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీబీఐ, ఆర్బీఐలాంటి వ్యవస్థలను మోదీ భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఏపీ బీజేపీ నేతలకు దమ్ముంటే రాష్ట్ర సమస్యలపై మోదీని నిలదీయాలని సవాల్ విసిరారు. మోదీ, ప్రతిపక్ష నేత జగన్‌ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, ప్రత్యేక హోదాపై జగన్‌ ఏనాడైనా మోదీని నిలదీశారా అని లోకేష్‌ ప్రశ్నించారు. …

Read More »

అలోక్‌కు ఉద్వాసన!

సీబీఐ నుంచి అగ్నిమాపక సేవల డీజీగా బదిలీ అత్యున్నత స్థాయి కమిటీ సంచలన నిర్ణయం అవినీతి ఆరోపణలున్నాయన్న సీవీసీ నివేదిక ఆధారంగానే చర్య వాదన వినిపించుకునే అవకాశమిద్దామన్న ఖర్గే ససేమిరా అన్న ప్రధాని మోదీ, జస్టిస్‌ సిక్రి సీబీఐ పగ్గాలు మళ్లీ నాగేశ్వరరావు చేతికి కేంద్ర దర్యాప్తు సంస్థలో నెలకొన్న పరిణామాలకు సంచలన ముగింపు! 55 ఏళ్ల సీబీఐ చరిత్రలో తొలిసారిగా ఒక డైరెక్టర్‌ ఉద్వాసనకు గురయ్యారు. దిల్లీ: ప్రధాని …

Read More »