Breaking News
Home / Tag Archives: mp revanth reddy

Tag Archives: mp revanth reddy

రేవంత్ రెడ్డికి తప్ప పీసీసీ ఎవరికిచ్చినా ఓకే …

పీసీసీ మార్పుపై కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయన్నారు. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని మార్చాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. రాహుల్ ‌గాంధీకి ఉత్తమ్‌ను మార్చవద్దంటూ లేఖ రాస్తానన్నారు. రేవంత్ రెడ్డి కూడా పీసీసీ అడుగుతున్నాడన్న ఆయన అభిప్రాయాలు తీసుకోకుండా రేవంత్ కి పీసీసీ ఇస్తే వ్యతిరేకిస్తానని అన్నారు. రేవంత్ కి పీసీసీ ఇవ్వొద్దనే చెప్తానన్న ఆయన, నన్ను అడగకుండా రేవంత్ కి పీసీసీ ఇస్తే… నా రాజకీయం నాకు …

Read More »

రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. చర్లపల్లి జైలు నుంచి విడుదలైన రేవంత్ రెడ్డి.. ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను కలిసేందుకు ఎమ్మెల్యే సీతక్క .. రేవంత్ ఇంటికి వెళ్లారు. అయితే ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్‌ను కలిసేందుకు అనుమతి నిరాకరించారు. దీంతో సీతక్క.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More »

రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు…

హైదరాబాద్: రాజేంద్రనగర్ జన్వాడ డ్రోన్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. చర్లపల్లి జైలు నుంచి రేవంత్‌రెడ్డి సాయంత్రం విడుదలకానున్నారు. కరోనా కారణంగా జైలు దగ్గర 144 సెక్షన్‌ విధించారు. 14 రోజులుగా చర్లపల్లి జైలులో ఉన్న ఆయనకు.. హైకోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. తొలుత కుకట్‌పల్లి కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చగా.. ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు …

Read More »

హైకోర్టును ఆశ్రయించిన రేవంత్‌….

హైదరాబాద్‌: డ్రోన్‌ కెమెరా కేసులో కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి ఆయన ఇవాళ హైకోర్టులో 3 పిటిషన్లు దాఖలు చేశారు. నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని, మియాపూర్‌ కోర్టు విధించిన రిమాండ్‌ రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. పార్లమెంట్‌ సమావేశాలకు హాజరుకావాల్సి ఉన్నందున బెయిల్‌ మంజూరు చేయాలని మరో పిటిషన్‌ దాఖలు చేశారు.

Read More »

రేవంత్ రెడ్డికి చుక్కెదురు…

హైదరాబాద్ : గోపన్‌పల్లి భూవ్యవహారంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. చట్టప్రకారం నడుచుకోవాలని ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులను ఆదేశించిన కోర్టు.. ప్రభుత్వం చర్యలు తీసుకోకముందే కోర్టును ఎందుకు ఆశ్రయిస్తున్నారని పిటిషనర్‌ను ప్రశ్నించింది. అటు చట్టప్రకారం ముందుకు వెళ్తామని ప్రభుత్వం తరపున ఏజీ కోర్టుకు తెలిపారు.

Read More »

ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా…

హైదరాబాద్: ఓటుకు నోటు కేసు విచారణను ఏసీబీ కోర్టు ఈనెల 17కు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. కొద్దిసేపు వాదనలు జరిగిన అనంతరం తదుపరి విచారణను కోర్టు 17కు వాయిదా వేసింది.

Read More »

ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్

హైదరాబాద్: మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌ అయ్యారు. హైదరాబాద్ శివారులోని గండిపేట చెరువుకు వెళ్లే దారిలో మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫామ్‌హౌస్‌ నిర్మించారని ఆరోపిస్తూ.. ఫామ్‌హౌస్‌ ముట్టడికి రేవంత్‌ వెళ్లారు. అయితే మార్గం మధ్యలోని జన్వాడ వద్ద ఆయనతో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. 111 జీవోను తుంగలో తొక్కి కేటీఆర్.. 25 ఎకరాల్లో ఫామ్‌హౌస్‌ నిర్మించారని రేవంత్ ఈ సందర్భంగా …

Read More »

కేసీఆర్ పై ఎంపీ రేవంత్ వ్యాఖ్యలు…

హైదరాబాద్: కేసీఆర్‌కు పాలమూరు బతుకులంటే పరాచకమైందని ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. నేడు ఆయన మల్కాజ్‌గిరిలో పట్నం గోస కార్యక్రమాన్ని ప్రారంభించారు. భూదేవినగర్‌లో ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. పట్టణ ప్రగతి పేరుతో మరోసారి మోసం చేయడానికి కేటీఆర్ పాలమూరు వెళ్లారన్నారు. మీకోసం అవసరమైతే కేసీఆర్ గల్లా పట్టి గుంజాడనికైనా నేను సిద్ధమని రేవంత్ స్పష్టం చేశారు. కేసీఆర్‌ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తానని చెప్పి పట్టించుకోలేదన్నారు. పేదల …

Read More »

అందులో తెలంగాణ మొదటి స్థానం…

హైదరాబాద్: టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని.. రైతు బంధు ఎన్నికల బందుగా మారిందని విమర్శించారు. రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. దీనిపై బహిరంగ చర్చకు వస్తారా అని సవాల్ విసిరారు. లిక్కర్‌ ధరలు పెంచుతున్న కేసీఆర్.. పంటలకు ధరలు ఎందుకు పెంచడం లేదన్నారు. కాళేశ్వరం నుంచి ఏటా 530 టీఎంసీలు ఎత్తిపోస్తామంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని.. …

Read More »

కేసీఆర్ పై ఎంపీ రేవంత్ విమర్శలు…

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికలు ఉంటేనే పథకాలు అమలవుతాయని… లేకపోతే అన్నీ అటకెక్కినట్టే అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశంలో రైతుల ఆత్మహత్యల విషయంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందన్న నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ లెక్కలను ఆయన ప్రస్తావించారు. జనాభా ప్రకారం చూసుకుంటే… ఈ విషయంలో తెలంగాణ తొలిస్థానంలో ఉందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. కలెక్టర్ల సమావేశంలో …

Read More »