Breaking News
Home / Tag Archives: mumbai

Tag Archives: mumbai

వారికి వాటా ఉంటే మేమెలా కొంటాం?

ముంబయి: రుణ, నగదు లభ్యత సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రముఖ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌లో వాటాను కొనుగోలు చేసే ఆసక్తి తమకు ఎంతమాత్రం లేదని ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ సీఈవో అక్బర్‌ అల్‌ బకర్‌ స్పష్టం చేశారు. మంగళవారం ముంబయిలో జరిగిన ఏవియేషన్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెట్‌ను కొనుగోలు చేసేందుకు ఖతార్‌ ఆసక్తిగా ఉందని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ‘మా శత్రువు దేశం …

Read More »

వరుసగా మూడో రోజు పెరిగిన పెట్రో ధరలు

ముంబై: పెట్రో ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గతరెండు రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న పెట్రోలు, డీజిలు ధరలు మూడు రోజు (శనివారం) కూడా పైకే చూస్తున్నాయి. లీటరు పెట్రోల్‌పై19 పైసలు, లీటర్ డీజిల్‌ ధర 29పైసలు చొప్పున పెరిగింది. అంతర్జాతీయంగా చమురు ధరలు 2శాతం తగ్గుముఖం పట్టినా, దేశీయంగా ధరలు పెరుగుతూండటం గమనార్హం. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోలు లీటరు ధర రూ.69.26కు చేరగా, డీజిల్ ధర రూ. 63.10వద్ద …

Read More »

యువకుడిని చావబాదిన ‘శివసేన’ మహిళలు… ఎందుకంటే…

ముంబై: మహానగరం ముంబైలోని డోంబివలీలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఒక వ్యక్తిని శివసేన మహిళా కార్యకర్తలు పట్టుకుని చావగొట్టారు. తరువాత అతనిని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే ఆ యువకుడు డోంబీవలీలో ఎలక్ట్రానిక్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆ యువకుడిని చావబాదిన మహిళలు అందించిన వివరాలప్రకారం… అతను తన దుకాణం ముందు కూర్చుని అటుగా వచ్చిపోయే మహిళలను చూసి వెకిలి చేష్టలు చేస్తుంటాడు. ఎవరైనా ఎదురు తిరిగితే వారితో అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడు. …

Read More »

స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం…

ముంబయి : దుబాయ్ దేశానికి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం బయలుదేరి వెళ్లిన కొన్ని నిమిషాల్లోనే సాంకేతిక లోపంతో తిరిగి వచ్చింది. ముంబయి నుంచి దుబాయ్ వెళ్లేందుకు 180 మంది ప్రయాణికులు విమానం ఎక్కారు. ఈ విమానం ముంబయిలోని శాంతాక్రజ్ విమానాశ్రయం నుంచి బయలు దేరింది. విమానంలో హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అవడంతో గ్రహించిన పైలెట్ విమానాన్ని కొన్ని నిమిషాల్లోనే ముంబయి విమానాశ్రయానికి తిరిగి తీసుకువచ్చారు. ఎయిర్‌లైన్స్ ఇంజినీర్లు విమానంలో …

Read More »

కోటా బిల్లుపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు : మోదీ

ముంబై : ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు రాజ్యసభ ఆమోదం పొందుతుందన్న ఆశాభావాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. బుధవారం ఆయన షోలాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ కొందరు ఈ బిల్లుపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యసభ సభ్యులు ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బిల్లుకు మద్దతు ఇస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్లు …

Read More »

కామాంధుడిని పట్టిచ్చిన స్టంట్ మ్యాన్

ముంబయి : పట్టపగలే వీధిలో ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధిస్తున్న కామాంధుడిని బాలీవుడ్ స్టంట్ మ్యాన్ పట్టిచ్చిన ఘటన ముంబయి నగరంలో వెలుగుచూసింది. బాలీవుడ్ స్టంట్ మ్యాన్ ఆసిఫ్ రషీద్ మెహతా ముంబయి నగరంలోని మాహిమ్ ప్రాంతంలోని తన ఇంటికి వస్తుండగా వీధిలో 20 ఏళ్ల యువకుడు ఓ మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ కనిపించాడు. తన ద్విచక్రవాహనం రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఓ బాలికకు తన …

Read More »

ఆర్బీఐ సంచలన నిర్ణయం

ముంబై : భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను దర్యాప్తు చేసే కమిటీకి చైర్మన్‌గా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నియమితులయ్యారు. భారతీయ రిజర్వు బ్యాంకు ఆయనను ఈ పదవిలో మంగళవారం నియమించింది. డిజిటల్ పేమెంట్లను క్రమబద్ధీకరించేందుకు స్వతంత్ర చెల్లింపుల నియంత్రణ మండలి (పీఆర్‌బీ)ని ఏర్పాటు చేయాలని అంతర్ మంత్రిత్వ శాఖల కమిటీ సిఫారసు చేయడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీకి ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రతన్ …

Read More »

మత్స్యకారుడి వలలో భారీ చేపలు.. క్రేన్లతో తీసుకెళ్లారు..

ముంబై: మహారాష్ట్రలోని రత్నగిరికి చెందిన ఓ మత్స్యకారుడిని ఊహించని రీతిలో అదృష్టం వరించింది. రోజూ మాదిరిగానే చేపల వేటకు వెళ్లిన అతడికి ఈసారి ఏకంగా 2400 కిలోల బరువైన నాలుగు చేపలు దొరికాయి. వాటిని తీసుకెళ్లడానికి ఓ క్రేన్‌ను తెప్పించాల్సి వచ్చింది. వాఘిల్ రకానికి చెందిన ఈ చేపలు సాధారణంగా ఒక్కోటి 50 నుంచి 60 కిలోల బరువుంటాయి. అయితే సదరు జాలరి వలలో పడిన చేపలు దాదాపు 500 …

Read More »

మహారాష్ట్ర సచివాలయంలో ఉద్రిక్తత

ముంబై: మహారాష్ట్ర సచివాలయంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముంబై ఉన్న సచివాలయం బిల్డింగ్‌లో ఏర్పాటు చేసిన సేఫ్టీ నెట్‌లోకి వ్యక్తి దూకిన ఘటన కలకలం సృష్టించింది. తన డిమాండ్లు నెరవేర్చాలి అంటూ లక్ష్మణ్ చవాన్ అనే వ్యక్తి బిల్డింగ్ రెండో అంతస్థు నుంచి సేఫ్టీ నెట్‌లోకి దిగి నిరసన తెలిపాడు. పుణెకు చెందిన లక్ష్మణ్ చవాన్ భారత్ ప్రజా సతా అనే సంఘాన్ని నడిపిస్తున్నాడు. సచివాలయంలో పనుల నిమిత్తం …

Read More »

బ్రేకింగ్ : మాల్యాకు భారీ ఎదురు దెబ్బ

ముంబై : బ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్ మాల్యాను పరారైన ఆర్థిక నేరస్థుడిగా కోర్టు ప్రకటించింది. పరారైన ఆర్థిక నేరస్థుల చట్టం, 2018 ప్రకారం ఈ విధంగా నేరస్థుడిగా ప్రకటించబడిన మొదటి వ్యాపారవేత్త మాల్యాయే. మనీలాండరింగ్ నిరోధక చట్టం కోర్టు శనివారం ఈ తీర్పు చెప్పింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విజ్ఞప్తి మేరకు కోర్టు ఈ ప్రకటన చేసింది.

Read More »