Breaking News
Home / Tag Archives: muncipal elections

Tag Archives: muncipal elections

వేములవాడ మున్సిపల్ చైర్మన్‌గా మాధవి…

వేములవాడ: వేములవాడ పాలక సంఘంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయ్యాయి. అధ్యక్ష స్థానానికి టీఆర్ఎస్ పార్టీ నుంచి రామతీర్థపు మాధవి, బీజేపీ నుంచి ముప్పిడి సునందలు పోటీ పడ్డారు. చేతులెత్తి మద్దతు తెలిపే పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. ఇందులో మాధవికి 22 ఓట్లు, సునందకు 5 ఓట్లు రావడంతో.. మాధవిని అధ్యక్షురాలుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. ఉపాధ్యక్ష పదవికి టీఆర్ఎస్ నుంచి మధు రాజేందర్ శర్మ, బీజేపీ నుంచి …

Read More »

ఎమ్మెల్సీలు, ఎంపీలతో భేటీ కానున్న మంత్రి..

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో శనివారం ఉదయం 10 గంటలకు ఎమ్మెల్సీలు, ఎంపీలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కానున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లపై చర్చించనున్నారు. అవసరం ఉన్న చోట ఎక్స్ అఫీషియో ఓట్లను వాడుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న భేటీకి ప్రాధాన్యత నెలకొంది. కాగా, టీఆర్ఎస్ పార్టీకి ఆరుగురు రాజ్యసభ సభ్యులు, 9 మంది ఎంపీలు, 32 మంది …

Read More »

మున్సిపల్ ఎన్నికలపై టీజేఎస్ ప్రణాళిక విడుదల…

హైదరాబాద్: మున్సిపల్‌ ఎన్నికల ప్రణాళికలను టీజేఎస్‌ విడుదల చేసింది. అగ్గిపెట్టె గుర్తుపై టీజేఎస్‌ పోటీ చేయాలని నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ అధినేత కోదండరామ్‌ తెలిపారు. ప్రజాసమస్యలే ప్రధాన ఎజెండాగా మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. మున్సిపాలిటీలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, తిరిగి పునరుద్ధరించాలని ఆకాంక్షించారు. ప్రజలను ఓట్లు అడిగే పార్టీలు… ఐదేళ్లలో ఏం చేస్తారో చెప్పాలని కోరారు.

Read More »

మున్సిపల్ ఎన్నికలకు అవాంతరాలు ఉండకపోవచ్చు…

నల్గొండ : మున్సిపల్ ఎన్నికలకు అవాంతరాలు ఉండకపోవచ్చని, ఆ ఎన్నికల్లోనూ ప్రజలు అభివృద్ధి వైపే ఉంటారని భావిస్తున్నానని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. 2019లో దిశ లాంటి కొన్ని సంఘటనలు దురదృష్టకరమని ఆయన అన్నారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ముందుందని, భవిష్యత్‌లో ఆదర్శ రాష్ట్రంగా …

Read More »

వేరే పార్టీలకు ఓటు వేస్తే అభివృద్ధికి ఆటంకమే…

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని మంత్రి గంగుల కమలాకర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… వేరే పార్టీలకు ఓటు వేస్తే అభివృద్ధికి ఆటంకమేనన్నారు. ప్రత్యర్థులను గెలిపిస్తే ఉత్సవ విగ్రహాలుగా ఉంటారు తప్ప.. అభివృద్ధి జరగదన్నారు. టీఆర్ఎస్‌లో టికెట్‌ రాని వారికి నామినేటెడ్‌ పోస్టులలో భర్తీ చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

Read More »

మద్యాన్ని ఆదాయ వనరుగా చూడొద్దు….

సూర్యాపేట: తెలంగాణలో విచ్చలవిడిగా మద్యంఅమ్మకాల వల్లనే మహిళల పై దాడులు జరుగుతున్నాయని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. మద్యాన్ని ఆదాయవనరుగా చూడొద్దని, ఏపీలో మాదిరిగానే తెలలంగాణలోనూ మద్యం అమ్మకాలను నియంత్రించాలని ఆయన అన్నారు. సూర్యాపేటలో సీపీఐ నిర్మాణ మహాసభ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓటరు జాబితా ప్రకటించకుండా, రిజర్వేషన్లు ఖరారు చేయకుండా మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించడాన్ని సీపీఐ ఖండిస్తుందని అన్నారు. లౌకిక పార్టీలతో కలిసి పోటీచేస్తామని, మున్సిపల్‌ ఎన్నికల్లో …

Read More »

మున్సిపల్‌ ఎన్నికల ముందస్తు ప్రక్రియ ప్రారంభం…

హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల ముందస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ముసాయిదా ఓటర్ల జాబితాకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 30వ తేదీన ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. జాబితాపై ఈనెల 31వ తేదీ నుంచి జనవరి 2 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. జనవరి 3 నాటికి అభ్యంతరాలను పరిష్కరిస్తారు. 4వ తేదీన తుది జాబితాను విడుదల చేస్తారు. కాగా, ఈనెల 31న అధికారులు, పార్టీలతో ఎన్నికల సంఘం …

Read More »

కాంగ్రెస్ గెలుపు ఖాయం: జగ్గారెడ్డి

హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతోందని వస్తోన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందిస్తూ.. ఎన్నికలు ఎప్పుడు జరిపినా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… సింగూర్ నీటి తరలింపుతో సంగారెడ్డి జిల్లాతో పాటు మెదక్ జిల్లా ప్రజలు నీటికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నీటి సమస్యపై మంత్రి హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై అలక్ష్యం తగదని పేర్కొన్నారు. …

Read More »

ఆయనకు ప్రజలే బుద్ధి చెప్తారు….

పెద్దపల్లి: తెలంగాణలో కూడా త్వరలో ప్రజల మనోభావాలకు అనుకూలంగా పొలిటికల్‌ సర్జికల్‌ స్ట్రయిక్‌ ఉంటుందని బీజేపీ నేత లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. బాహుబలి కేసీఆర్‌.. మోదీ అణ్వస్త్రం ముందు నిలవలేరన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిస్తే సింగరేణిని అమ్ముతారని ఆరోపించారు. సింగరేణి మనుగడ మున్సిపల్‌ ఎన్నికలతో ముడిపడి ఉందని వెల్లడించారు.

Read More »

మున్సిపల్‌ ఎన్నికలపై విచారణ వాయిదా…

హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా స్టే ఉన్న 77 మున్సిపాలిటీలకు విడివిడిగా వాదనలు వినాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరారు. అన్నింటికీ కలిపి ఒకే కౌంటర్‌ దాఖలు చేయడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటి వరకు వార్డుల విభజన, జనాభాకు సంబంధించి ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదని వారు న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై ప్రభుత్వ తరపు న్యాయవాది మాట్లాడుతూ… ఎన్నికల నిర్వహణపై వచ్చిన అభ్యంతరాలను …

Read More »