Breaking News
Home / Tag Archives: nakka anand babu

Tag Archives: nakka anand babu

టీడీపీ నేతలకు లీగల్ నోటీసులు…

అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాజధానిని విశాఖపట్నంలో ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు తమ కంపెనీకి దురుద్దేశాలు అంటగడుతూ చేసిన ఆరోపణలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని టీడీపీ నేతలను ప్రముఖ ఫార్మా కంపెనీ అరబిందో ఫార్మా లిమిటెడ్‌ డిమాండ్‌ చేసింది. తమపై చేసిన నిందారోపణలు దురుద్దేశపూరితమని, ఇవి తమ కంపెనీ పరువు ప్రతిష్టకు భంగం కలిగించేవిగా ఉన్నందున క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా …

Read More »

కోటప్పకొండలో రాజధాని నినాదాలు…

అమరావతి: కోటప్పకొండలో రాజధాని నినాదాలు మార్మోగాయి. కమ్మవారిపాలెం, కావూరు ప్రభల్లో జై అమరావతి నినాదాలు దద్దరిల్లాయి. ప్రభల తాళ్లు పట్టుకొని రాజధాని రైతుల జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. తిరునాళ్లలో మొత్తం అమరావతి సందడే నెలకొంది. రాజధాని నుంచి తరలివచ్చిన మహిళలకు, రైతులకు పలు జిల్లాల నుంచి వచ్చిన శివభక్తులు సంఘీభావం తెలిపారు. అనంతరం రాజధాని రైతులతో కలిసి భక్తులు కూడా నడిచారు. దాదాపు 2 వేల మంది …

Read More »

అమరావతికి మద్దతుగా నినాదాలు…

గుంటూరు: మూడు రాజధానులకు వ్యతిరేకంగా బుధవారం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. అమరావతికి మద్దతునిస్తూ జిల్లా ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Read More »

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలి…

అమరావతి : ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. అమరావతి ప్రాంత రైతులు చేసిన త్యాగాలను గౌరవించాలని అన్నారు. విశాఖ రాజధానిగా కావాలని ఎవరూ అడగలేదని… కానీ, అమరావతిని అందరి ఆమోదంతోనే నిర్ణయించారని చెప్పారు. అమరావతిని మార్చాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. అమరావతి ప్రాంత రైతులకు కుల ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులను పెయిడ్ ఆర్టిస్టులు …

Read More »

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత వ్యాఖ్యలు…

అమరావతి: అమరావతిలో చంద్రబాబు పర్యటన.. అధికార పార్టీకి వణకు పుట్టించిందని టీడీపీ నేత నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం దాడి జరిపించిందని ఆయన ఆరోపించారు. చంద్రబాబుపై దాడికి పోలీసులు సైతం వత్తాసు పలికారన్నారు. బస్సుపైకి పోలీసులు లాఠీలు విసిరారని ఆరోపించారు. నిర్మాణాలు జరగలేదని మంత్రులు అసత్యాలు చెబుతున్నారన్నారు. దాడి ఘటనకు డీజీపీ సమాధానం చెప్పాలని నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు.

Read More »

నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దు…

అమరావతి: వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చి లక్షలాది మంది ఉద్యోగాలు పోగొట్టిన ఘనత ఏపీ సీఎం జగన్‌దేనని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. గత 4 నెలల్లో 40 లక్షల మంది ఉపాధిని జగన్ ప్రభుత్వం పోగొట్టిందని ఆరోపించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి అనేక అవకతవకలు బయటపడుతుంటే ఎందుకు విచారణ జరిపించటం లేదని ప్రశ్నించారు. టాప్ ర్యాంక్‌లు వచ్చిన వారు మీడియాకు దూరంగా ఉండటం చరిత్రలో …

Read More »