Breaking News
Home / Tag Archives: Nara Chandra Babu Naidu

Tag Archives: Nara Chandra Babu Naidu

ఏమైంది 40 ఇయర్స్ ఇండస్ట్రీకి?

అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విజయసాయిరెడ్డి ట్విటర్‌లో ఈ విధంగా స్పందించారు. ‘అహ్మద్ పటేల్ కు పంపిన రూ.400 కోట్లే కాదు. బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నిటికీ నిధులు సమకూర్చాడు. తెలంగాణ ఎన్నికల్లో రూ.400 కోట్లు ఖర్చుపెట్టాడు. అప్పట్లో దీనిపై జాతీయ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. 13 జిల్లాల చిన్న రాష్ట్ర సీఎం దేశం …

Read More »

వైసీపీ నేత విద్యాసాగర్ హత్యకు కుట్ర

చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం వైసీపీ నేత విద్యాసాగర్ రావు హత్యకు కుట్ర పన్నిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. విద్యాసాగర్‌ను హత్య చేయాలని గణేష్, రవి అనే ఇద్దరు రౌడీషీటర్లకు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రూ.10లక్షలు సుఫారీ ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇది ప్రతిపక్షనేత చంద్రబాబు నియోజకవర్గం కావడంతో ఈ కుట్ర కలకలం రేపుతోంది.

Read More »

అక్రమాలకు పాల్పడినవారిని వదిలిపెట్టేది లేదు

విజయవాడ: ఈఐఎస్‌ కుంభకోణంలో అక్రమాలకు పాల్పడినవారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని కార్మిక శాఖమంత్రి గుమ్మనూరు జయరాం స‍్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా దోచుకుందని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు హయాంలో భారీ స్థాయిలో ఈఎస్‌ఐ స్కామ్‌ జరిగిందన్నారు. అక‍్రమాలు చేసినవారిపై చర్యలు తీసుకోవడానికి విజిలెన్స్‌ విచారణకు ఆదేశించామన్నారు. మాజీమంత్రి అచ్చెన్నాయుడు అవినీతికి ఆయన రాసిన లేఖ సాక్ష‍్యమన్నారు. అవినీతిపై విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని …

Read More »

చిట్టినాయుడేమో ఆస్తుల వివరాలంటూ

అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడి కుటుంబం ఆస్తుల వివ‌రాల‌ను గురువారం రోజున ఆయన కుమారుడు నారా లోకేశ్ ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘తండ్రేమో తన ఆస్తి లక్ష కోట్లని వేల మంది సాక్షిగా ప్రకటించాడు. చిట్టినాయుడేమో ఆస్తుల వివరాలంటూ, ఎండాకాలంలో లేచే సుడిగాలిలా అందరి కళ్లలో దుమ్ముకొడతాడు. ఈ ఐదేళ్లలో ఎంత …

Read More »

ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ పథకాలు అమలు

తూర్పు గోదావరి: ఐటీ దాడులతో టీడీపీ నేతల అసలు స్వరూపం బయట పడిందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి అన్నారు. రామచంద్రపురంలో తోట త్రిమూర్తులు అధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేసేందుకే యాత్ర పేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో డ్రామాకు తెర లేపారని విమర్శించారు. అయిదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలకు …

Read More »

నిరుద్యోగుల కోసం.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌!

తూర్పుగోదావరి: టీడీపీ గెలవడం కోసం 2014 ఎన్నికల్లో జాబు కావాలంటే బాబు రావాలన్నారని.. బాబు వచ్చాడు కానీ జాబ్‌ ఎవరికి రాలేదని రాజమండ్రి వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భారత్‌రామ్‌ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీఎం వైఎస్‌ జగన్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రతి పార్లమెంటు పరిధిలో పది ఎకరాల విస్తీర్ణంలో రూ. 50 కోట్లతో స్కిల్ డెవెలప్‌మెంట్ …

Read More »

చంద్రబాబుకు లేఖ రాసిన కేంద్రమంత్రి

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రమంత్రి జైశంకర్ లేఖ రాశారు. చైనాలో చిక్కుకున్న 58 మంది ఇంజినీర్లను భారత్‌కు తీసుకురావాలని జనవరి 31న కేంద్రమంత్రికి బాబు లేఖ రాయగా.. తాజాగా ఆ లేఖకు జైశంకర్ జవాబు ఇచ్చారు. ఫిబ్రవరి 1న 56 మంది ఇంజినీర్లను వూహాన్ నుంచి ఇండియాకు తీసుకొచ్చామని.. తీవ్ర జ్వరం కారణంగా జ్యోతి, సత్యసాయికృష్ణలను విమానంలో పంపేందుకు చైనా అధికారులు అనుమతించలేదని జైశంకర్ తన లేఖలో పేర్కొన్నారు.

Read More »

రామోజీరావుకు మంత్రి బొత్స బహిరంగ లేఖ

అమరావతి: తనపై రాసిన తప్పుడు వార్తను ఈనాడు దినపత్రిక వెనక్కి తీసుకోవాలంటూ పురపాలక శాఖమంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఈనాడు సంస్థల చైర్మన్‌ రామోజీరావుకు లేఖ రాశారు. ‘ ఇవాళ ఈనాడు పేపర్‌లో నాపై తప్పుడు వార్త రాశారు. ఆ వార్తను వెనక్కి తీసుకోవాలి. నేను అనని మాటలను మీ అజెండా ప్రకారం మార్చి ప్రచురించారు. చంద్రబాబు పార్టీని బతికించి రక్షించుకోవాలనుకుంటున్న మీ …

Read More »

‘బాబు రాజకీయ జీవితం ముగిసింది’

విశాఖపట్నం: ఐటీ సోదాలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌ ఏం సమాధానం చెప్తారని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ వద్దనే రూ. 2 వేల కోట్లు బయటపడితే.. అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో గమనించాలని ప్రజలను కోరారు. చంద్రబాబు, టీడీపీ నేతలు పంచభూతాలను పంచుకుని తినేశారని విమర్శించారు. చంద్రబాబు చేసేవన్నీ దొంగ పనులని విమర్శించిన బొత్స.. అక్రమ లావాదేవీలపై …

Read More »

అభివృద్ధిని చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారం

తిరుపతి: గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఐటీ దాడుల్లో చంద్రబాబు నాయుడు బినామీల అక్రమ ఆస్తులు వెలుగు చూశాయని పరిశ్రమల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారం చేసే ఎల్లో మీడియాకి ఐటీ దాడులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 2 వేలకోట్లు బయటపడ్డ కళ్లకు గంతలు కట్టినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్న చంద్రబాబు ఒక్కమాట …

Read More »