Breaking News
Home / Tag Archives: narendra modi

Tag Archives: narendra modi

‘సింధియా.. నీకేం తక్కువ చేశాం’

కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన జ్యోతిరాదిత్య సింధియాపై ఆ పార్టీ ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించింది. ’17 ఏళ్లు ఎంపీగా, 2 సార్లు కేంద్రమంత్రిగా, చీఫ్‌విప్‌గా, జాతీయ కార్యదర్శిగా, వర్కింగ్ కమిటీ సభ్యునిగా పార్టీ అవకాశాలిచ్చింది. ప్రచార సారథిగా నియమించి, 50 అసెంబ్లీ సీట్లు, 9 మంత్రి పదవులు ఇచ్చాం. అయినా మోదీ, షా ఆశ్రయం కావాల్సి వచ్చిందా?’ అని నిలదీసింది.

Read More »

‘మాజీ సీఎంల విడుదల కోరుతూ తీర్మానం’

న్యూఢిల్లీ: రాజకీయ నిర్బంధంలో మగ్గుతున్న ముగ్గురు జమ్ము కశ్మీర్‌ మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా‌, ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఎనిమిది విపక్ష పార్టీలు సంయుక్త తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపాయి. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో గత ఏడాది ఆగస్ట్‌ నుంచి ముగ్గురు మాజీ సీఎంలతో పాటు పలువురు రాజకీయ నేతలను ప్రభుత్వం గృహనిర్బంధంలో …

Read More »

స్వచ్ఛభారత్-2ను ప్రారంభించిన కేంద్రం

ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన స్వచ్ఛభారత్‌ పథకం రెండో విడత కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో అన్ని గ్రామ పంచాయతీల్లో తడి, పొడి చెత్త నిర్వహణ తప్పనిసరి చేయడమే లక్ష్యంగా పనిచేయనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ మీడియాతో మాట్లాడారు. ఈ రెండో విడత స్వచ్ఛభారత్‌ పథకం మొదటి విడతలో పొందిన విజయాలను నిలబెట్టుకోవడంపై దృష్టి …

Read More »

జ్యూవెలర్లకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ

ముంబై: నరేంద్ర మోదీ సర్కార్‌ 2016లో నోట్ల రద్దు ప్రకటించిన సమయంలో బంగారు ఆభరణాలను పెద్ద ఎత్తున విక్రయించిన జ్యూవెలర్లకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. 2016 నవంబర్‌ 8న ప్రధాని నోట్ల రద్దును వెల్లడించగానే పెద్దసంఖ్యలో కస్టమర్లు తమ షోరూంలో నెక్లెస్‌లు, రింగ్‌లు సహా కనిపించిన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి పాతనోట్లను విడిపించుకున్నారని ముంబైలోని ఓ జ్యూవెలర్‌ వెల్లడించారు. అప్పటి ఆ అమ్మకాలపై ఆదాయ …

Read More »

మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న బీజేపీ అధ్యక్ష ఎంపిక

న్యూఢిల్లీ : బీజేపీ ప్రధాన కార్యాలయంలో మరి కొద్ది సేపట్లో పార్టీ అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ, ప్రస్తుత అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితర నేతలు కార్యాలయానికి చేరుకున్నారు.

Read More »

గోద్రా అల్లర్ల కేసులో నాటి మోదీ సర్కార్‌కు క్లీన్ చిట్

గాంధీనగర్: గోద్రా రైలు దహనం తర్వాత జరిగిన అల్లర్ల కేసులో నరేంద్ర మోదీ నేతృత్వంలోని నాటి గుజరాత్ సర్కార్‌కు క్లీన్ చిట్ లభించింది. అల్లర్లకు.. అప్పటి మోదీ సర్కార్‌కు ఎలాంటి సంబంధం లేదని నానావతి – మెహతా కమిషన్ తెలిపింది. గుజరాత్ అసెంబ్లీకి తమ నివేదికను బుధవారం సమర్పించిన ఈ కమిషన్.. ఆ అల్లర్లు ఒకరి ఆధ్వర్యంలో జరిగినవి కావని తేల్చిచెప్పింది. 2002 ఫిబ్రవరి 27న అల్లరి మూకలు సబర్మతి …

Read More »

మోదీ సర్కార్ గుడ్ న్యూస్…

ఉత్తరాంధ్ర: మూడు జిల్లాల్లోని తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిదివేల ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేయడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసిఎల్), కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు రాజ్యసభలో తెలిపారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బుధవారం సమాధానమిస్తూ.. పైప్‌లైన్ ద్వారా ఇంటికి వంట గ్యాస్ సరఫరా చేసే ఈ ప్రాజెక్టు కోసం ఐఓసిఎల్ …

Read More »

కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలి ..

సింగరేణి:వేజ్‌బోర్డు సభ్యుడు, జాతీయ బొగ్గు పరిశ్రమల ఇన్‌చార్జి డాక్టర్‌ బీకే రాయ్‌ మాట్లాడుతూ …కార్మిక సంఘాల ఉనికిని ప్రశ్నిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని అన్నారు. కేసీఆర్‌ తెలంగాణ సాధనకు ఎన్నో పోరాటాలు చేసిన కార్మికులను అణగదొక్కాలనే ప్రయత్నాలు ఫలించబోవని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రభుత్వ రంగ పరిశ్రమల కార్మిక వ్యతిరేక వైఖరిపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. జీతభత్యాల పెంపు కోసం పరిశ్రమలను ప్రైవేటీకరించటం, అమ్మివేయడాన్ని …

Read More »

మీరూ మాతృభాష దిశగా కదలండి…”ప్రధాని పిలుపు”

నిర్లక్ష్యం చేస్తే ప్రగతి అసాధ్యం ఇది దేశీయ భాషల సంవత్సరం ఐక్యరాజ్యసమితి ప్రకటించింది ఉత్తరాఖండ్‌లో రంగ్లో భాషను అక్కడి ప్రజలు కాపాడుకున్నారు ఆ భాషకు లిపి కూడా లేదు మాట్లాడేవారూ పది వేల మందే అయినా కలిసికట్టుగా కృషి చేశారు భాష రక్షణకు తలోచేయి వేశారు మీరూ మాతృభాష దిశగా కదలండి ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని పిలుపు న్యూఢిల్లీ: మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే ఎంత అభివృద్ధి సాధించినా నిరర్థకమని …

Read More »

మోదీ, షా అభినందనలు

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులుగా శనివారం ఉదయం ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్‌, అజిత్‌ పవార్‌లకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ ద్వారా అభినందనలు తెలిపారు. వీరిద్దరి నాయకత్వంలో మహారాష్ట్ర మరింత అభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హెంశాఖ మంత్రి అమిత్‌ షా కూడా ఫడ్నవీస్‌, అజిత్‌ పవార్‌లను అభినందించారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మహారాష్ట్ర అభివృద్ధికి, మరాఠి ప్రజల సంక్షేమానికి …

Read More »