Breaking News
Home / Tag Archives: nellore district

Tag Archives: nellore district

నెల్లూరులో 79కి చేరిన కరోనా కేసులు…

నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 79కి చేరింది. తాజాగా ఐసోలేషన్‌లో చికిత్స పొందుతూ కరోనా బాధితుడు మృతి చెందాడు. దీంతో జిల్లాలో కరోనా మరణాల సంఖ్య మూడుకు చేరింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభన కొనసాగుతోంది. ఒక్కరోజే 80 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా వారం రోజుల నుంచి వైరస్‌ తీవ్రంగా విజృంభిస్తోంది. గత సోమవారం నుంచి ఈ సోమవారం ఉదయం వరకు …

Read More »

అంతా లాక్‌డౌన్ పుణ్యమే…

నెల్లూరు: పిచ్చుకలే కనిపించకుండాపోయిన నేటికాలంలో, లాక్‌డౌన్ కారణంగా అంతా ప్రశాంతంగా ఉంటుంది. దీంతో ఓ కారు సైడ్ మిర్రర్ సందులో పిచ్చుక గూడుకట్టుకుంది.

Read More »

నెల్లూరులో ముగ్గురు పిల్లలకు కరోనా పాజిటివ్…

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ముగ్గురు పిల్లలకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. నిన్నటి పరీక్షల్లో బయట పడటంతో అధికారులు, వైద్యులు ఆందోళన చెందుతున్నారు. తడకు చెందిన వ్యక్తికి ఇప్పటికే ఐసోలేషన్‌లో చికిత్స జరుగుతోంది. అతని ఇద్దరు పిల్లలకు కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో వెల్లడైంది. వాకాడులో పదేళ్ల బాలికకు కూడా కరోనా పాజిటివ్ అని నివేదికలో స్పష్టమైంది. ఇకపై పిల్లలున్న ఇంటిలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని వైద్య …

Read More »

నెల్లూరులో హైఅలెర్ట్….

నెల్లూరు: నెల్లూరు జిల్లాకి ఢిల్లీ లింకులున్నట్టు పోలీసులు గుర్తించారు. ఢిల్లీలో జరిగిన మతపరమైన సమావేశానికి జిల్లా నుంచి 68 మంది వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. 34 మందికి సంబంధించిన రిపోర్టులు ఇవాళ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు నగరంలో హైఅలెర్ట్ ప్రకటించారు. 43, 47 డివిజన్లని అధికారులు రెడ్‌ జోన్‌లుగా ప్రకటించారు.. నిత్యవసరాలు, కూరగాయలు ఇళ్ల వద్దకే‌ సరఫరా చేస్తున్నారు.

Read More »

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం…

నెల్లూరు: జిల్లాలోని సూళ్లూరుపేట టోల్ ప్లాజా సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న లారీని ఆర్టీసి బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు నుండి చెన్నైకు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Read More »

నేడు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–10 లాంచ్‌ రిహార్సల్స్‌

సూళ్లూరుపేట: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి జియో సింక్రోనస్‌ లాంచింగ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–10) ఉపగ్రహ వాహక నౌక ద్వారా జీఐశాట్‌–1 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపేందుకు ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సా.5.43 గంటలకు దీనిని రోదసిలోకి పంపుతారు. దేశరక్షణ వ్యవస్థకు, విపత్తుల సమాచారాన్ని ముందుగా తెలుసుకోవడమే జీశాట్‌–1 ముఖ్యోద్దేశం. ఈ రిమోట్‌ సెన్సింగ్‌ …

Read More »

18 అడుగుల భారీ శివలింగం.. ఎక్కడో తెలుసా?

నెల్లూరు: నగరంలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ఏటా మహాశివరాత్రి రోజున విభిన్న శివలింగాలను ఏర్పాటు చేసి.. అందరు సన్మార్గంలో నడుచుకోవాలని ప్రచారం నిర్వహిస్తుంటారు. అందులో భాగంగానే గతంలో ఎన్నడు లేని విధంగా ఈ ఏడాది భారీ శివలింగాన్ని ఏర్పాటు చేశారు. నగరవాసులు శివలింగాన్ని చూసి భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది. 18 అనే సంఖ్యకు చాలా విశిష్టతలు ఉన్నాయని మహా భారతంలో కూడా పద్దెనిమిది …

Read More »

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం….

పన్నంగాడు: నెల్లూరు జిల్లా పన్నంగాడు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. లారీ, కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన కారు దర్శి ప్రాంతానికి చెందినదిగా తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Read More »

మాట్లాడితే రూ.10 వేలు జరిమానా

నెల్లూరు : టీడీపీ ఎమ్మెల్సీ  బీద రవీంద్రకు సొంత ఊరి ప్రజలే షాక్ ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఇస్కపల్లి గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘దరిద్రపు ఊరు జిల్లాలోనే లేదు’ అంటూ వ్యాఖ్యలు చేసినందుకు ఆయనతో ఎవరూ మాట్లాడొద్దని గ్రామస్తులు తీర్మానం చేశారు. ఒకవేళ నేరుగా మాట్లాడితే రూ.10 వేలు, ఫోన్‌లో మాట్లాడితే రూ.3వేలు జరిమానా చెల్లించాల్సిందేనని ఊరి ప్రజలు కట్టుబాటు పెట్టుకున్నారు. కాగా దీనిపై రాజకీయ వివాదం చెలరేగుతోంది.

Read More »

తల్లీకూతుళ్ల హత్య కేసులో సంచలన తీర్పు…

నెల్లూరు: హరనాథపురంలో 8వ అదనపు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తల్లీ, కూతుళ్ల హత్య కేసులో నిందితుడు ఇంతియాజ్‌కు కోర్టు ఉరిశిక్ష విధించింది. 2013 ఫిబ్రవరి 12న  భార్గవి, ఆమె తల్లి శకుంతలను ఇంతియాజ్ దారుణంగా హత్య చేశాడు. కిరాతకుడి దాడిలో భార్గవి తండ్రి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. కాగా ఇంతియాజ్‌కు సహకరించిన ఇద్దరు మైనర్లకు కోర్టు గతంలోనే జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.

Read More »