Breaking News
Home / Tag Archives: new delhi

Tag Archives: new delhi

3 రాష్ట్రాల్లో మోదీ జబర్దస్త్‌!

న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌, జార్ఖండ్‌, ఒడిసా ప్రజలు ప్రధాని మోదీ వైపే మొగ్గు చూపనున్నట్లు తాజా సర్వే ఒకటి తేల్చింది. ఈ 3 రాష్ట్రాల్లో దాదాపు సగం మంది మరోసారి మోదీకే అధికారం అప్పగించాలని భావిస్తున్నట్లు ఇండియాటుడే పొలిటికల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ సర్వే నిర్ధారించింది. నాలుగున్నరేళ్ల పాలనపై వారెవరికీ పెద్దగా సంతోషంగా లేకపోయినా వారికి ప్రత్యామ్నాయం లేకపోయింది. బిహార్‌లో నితీశ్‌ ప్రజాదరణ రెండు నెలల్లో 46 నుంచి …

Read More »

ఢిల్లీలో ఏం జరుగుతోంది…?

న్యూఢిల్లీ: ఆమాద్మీ పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ ఇంటిపై 25 మంది దుండగులు కాల్పులకు తెగబడడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో స్పందించారు. ‘‘ఢిల్లీలో అసలేం జరుగుతోంది..?’’ అంటూ ట్విటర్లో ప్రశ్నించారు. ఈ ఘటనపై సౌత్ ఢిల్లీలోని సంగమ్ విహార్ కౌన్సిలర్ జితేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ‘‘దాడి జరిగిన సమయంలో నా పెళ్లికి వచ్చిన బంధువులతో పాటు నేను ఇంట్లోనే ఉన్నారు. గురువారం సాయంత్రం 6:30 సమయంలో దాదాపు …

Read More »

కోదండ కోర్టులో జనగామ!

ఆయనకా..? పొన్నాలకా?.. తెరపైకి కొమ్మూరి అభ్యర్థిత్వం! ఆయనకు కోదండరాం ఫోన్‌.. ఢిల్లీలో పొన్నాల మంతనాలు.. టికెట్‌ తనకేనని ధీమా హైదరాబాద్‌/న్యూఢిల్లీ: జనగామ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఎవరు? రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్‌టాపిక్‌! మహాకూటమి పొత్తుల్లో భాగంగా ఈ సీటును ఎవరికి కేటాయిస్తారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. జనగామను టీజేఎస్‌కు కేటాయించాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించిందని, ఆ పార్టీ అధ్యక్షుడ్ని అక్క డినుంచి బరిలో దిగాలని ప్రతిపాదించిందని కూడా ప్రచారం …

Read More »

మోదీకి సెమీఫైనల్స్‌…

మోదీ నాయకత్వానికి అగ్నిపరీక్ష హిందీ బెల్ట్‌లో మళ్లీ పట్టుకు ఇదే దారి మజ్‌ ‘బూత్‌’ నినాదంతో జనంలోకి..! ప్రతీ ఇంటినీ జల్లెడపడుతున్న బీజేపీ నేతలు సంఘ్‌ సహకారం.. వర్గాల వారీగా ఓటర్లకు చేరువ సెమీఫైనల్స్‌… ప్రధాని నరేంద్ర మోదీ భవిష్యత్తును నిర్దేశిస్తాయనడంలో సందేహం లేదు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రికానికి ఇవి తొలి కోడి కూత మాత్రమే కాదు, ఆయన అనుసరిస్తున్న విధానాలకు ఓ పరీక్ష. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ల్లో …

Read More »

సాయంత్రానికి టీ.కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా

న్యూఢిల్లీ: నాటకీయ పరిణామాల మధ్య తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం మరో రెండు విడతలుగా అభ్యర్థులను ప్రకటించనుంది. రెండో జాబితాపై ఏఐసీసీ కసరత్తు మొదలుపెట్టింది. తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్య నేతలు ఉత్తమ్‌, జానారెడ్డి, రేవంత్‌ ఢిల్లీలోనే మకాం వేశారు. ఇవాళ సాయంత్రానికి కాంగ్రెస్‌ రెండో జాబితా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూడో జాబితాలో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. రెండో జాబితాలో 15మంది పేర్లను, మూడో జాబితాలో …

Read More »

ఈ సారి స్వల్ప స్థాయిలోనే ఎగ్జిబిషన్

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నవంబరు 14న 38వ ట్రేడ్ ఫెయిర్ ప్రారంభం కానుంది. ప్రతీసారీ ఈ ఎగ్జిబిషన్‌లో 5000 నుంచి 6,500 మంది పార్టిసిపేట్ చేస్తుండగా, ఈసారి ఎగ్జిబిషన్‌ను తక్కువ ఏరియాలో ఏర్పాటుచేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే రోజుకు 25 వేల సందర్శకులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈసారి ‘రూరల్ ఎంటర్‌ప్రైజ్ ఇన్ ఇండియా’ అనే థీమ్‌తో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. నవంబరు 14న మొదలయ్యే …

Read More »

వచ్చే ఐపీఎల్‌ వారం ముందుగానే!

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సీజన్‌ను కాస్త ముందుగానే నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌లో జరిగే వన్డే ప్రపంచక్‌పను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోనున్నారు. ఎందుకంటే ఐపీఎల్‌ ముగింపునకు.. ప్రపంచకప్‌ ఆరంభానికి మధ్య విరామం చాలా తక్కువగా ఉండడంతో భారత పేసర్లకు విశ్రాంతి ఎక్కువగా లభించడం లేదు. షెడ్యూల్‌ ప్రకారం ఈ లీగ్‌ మార్చి 29 నుంచి మే 19 వరకు జరగాల్సి ఉంది. …

Read More »

పోలవరంపై కేంద్ర అధికారులతో ఏపీ అధికారులు భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్ భేటీ అయ్యారు. పోలవరానికి సంబంధించి డీపీఆర్-2పై ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో కేంద్ర జలవనరుల శాఖ అధికారులు, ఏపీకి సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనాలు రూ. 57,940 కోట్లతోపాటు కేంద్రం కోరిన కొత్త లెక్కలపై చర్చ జరిగింది. కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలన్నింటికీ ఏపీ అధికారులు సమాధానం చెప్పారు. డీపీఆర్-2కు త్వరలో ఆమోదం …

Read More »

ప్రైవేటు వాహనాల రాకపోకలపై త్వరలో నిషేధం?

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీ కాలుష్యం కోరల్లో విలవిలలాడుతోంది. పరిస్థితి మెరుగుపడకపోతే ప్రైవేటు వాహనాల రాకపోకలపై కఠినమైన ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్విరాన్‌మెంట్ పొల్యూషన్ కంట్రోల్ అథారిటీ చైర్మన్ భూరే లాల్ మంగళవారం మాట్లాడుతూ వచ్చే నెల 1 నుంచి దశలవారీ ప్రణాళికను అమలు చేస్తామన్నారు. కాలుష్యం సమస్య మరింత క్షీణించబోదని ఆశిస్తున్నామని, ఒకవేళ కాలుష్యం పెరిగితే, ప్రైవేటు వాహనాల రాకపోకలను నిలిపేస్తామని, కేవలం ప్రజా …

Read More »

సీబీఐ కార్యాలయం దగ్గ భారీగా బలగాల మోహరింపు

న్యూఢిల్లీ: సీబీఐ చీఫ్ అలోక్‌వర్మను బాధ్యతల నుంచి తొలగించడంపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సీబీఐ కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టనుండటంతో ఆయా కార్యాలయాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. దేశరాజధానిలో సీజేఓ కాంప్లెక్స్‌లోని సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద మధ్యాహ్నం 11 గంటలకు చేపట్టనున్నట్టు నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వం వహించనున్నారు. దీంతో న్యూఢిల్లీ సీబీఐ కార్యాలయం ప్రధాన ద్వారం భారీగా పోలీసులు, సీఆర్‌పీఎఫ్ …

Read More »