Breaking News
Home / Tag Archives: newdelhi

Tag Archives: newdelhi

భారత రైల్వే కీలక నిర్ణయం

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రత దృష్ట్యా భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ సోకిన వారికి చికిత్స అందించేందుకు ఐసోలేషన్‌ కోచ్‌లు సిద్ధం చేసినట్లు ప్రకటించింది. ప్రతి కోచ్‌లో 10 ఐసోలేషన్ వార్డులు ఉంటాయని, సైడ్ మిడిల్ బెర్త్ లను తొలగించి ఒక్కో కూపేలో ఇద్దరి నుంచి నలుగురు వరకు ఉండేలా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఐసోలేషన్‌కు వచ్చే వారి సామాగ్రి పెట్టుకునేందుకు ప్రత్యేక …

Read More »

తెలుగులో ప్రధాని ట్వీట్‌

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఉగాది పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతోంది… ఈ ఏడాది ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చి, కష్టాలను అధిగమించే నూతన శక్తిని ప్రసాదిస్తుందని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో.. ముఖ్యంగా ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థించారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్‌ చేశారు. ఉగాదితో  కొత్త సంవత్సరం ఆరంభం అవుతోంది.ఈ సంవత్సరం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చి, కష్టాలను అధిగమించే నూతనశక్తిని ప్రసాదిస్తుందని …

Read More »

విజయం దిశగా ఆప్…

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగా ఆప్‌ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. 51 స్ధానాల్లో ఆ పార్టీ అభ్యర్ధులు ముందంజలో ఉండగా, బీజేపీ 14 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఒక్క స్ధానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం, ఆప్‌ సీనియర్‌ నేత మనీష్‌ సిసోడియాలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Read More »

మరి కొన్ని గంటల్లో బడ్జెట్ ఆవిష్కరణ…

న్యూఢిల్లీ : మోదీ ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను మరికొన్ని గంటల్లో ఆవిష్కరించబోతోంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ రెండోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మేరకు మంత్రులు నిర్మాలా సీతారామన్‌, అనురాగ్‌ ఠాగూర్‌ శనివారం ఉదయం ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా పార్లమెంట్‌కు బయలుదేరుతారు. ఉదయం 10.15గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగనుంది. కేంద్ర బడ్జెట్ ప్రసంగం ఉదయం …

Read More »

పోలవరం పర్యటనకు కేంద్ర మంత్రి ..

న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ చెప్పారని ఆంధ‍్రప్రదేశ్‌ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలతో కలిసి మంగళవారం ఆయన కేంద్ర జలశక్తి మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘రివర్స్ టెండరింగ్‌పై కేంద్ర మంత్రి సంతృప్తి చెందారు. పోలవరం ప్రాజెక్టులో కేంద్రానికి  రూ.800 కోట్లు ఆదా చేశామని వివరించాను. పార్లమెంటు సమావేశాల తర్వాత పోలవరం సందర్శనకు వస్తానని షెకావత్‌ చెప్పారు.

Read More »

పెప్సీ ప్రచారకర్తగా …

న్యూఢిల్లీ: శీతలపానీయాల దిగ్గజ సంస్థ పెప్సీకోకు ప్రచారకర్తగా బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌తో ఒప్పందం చేసుకొంది. ఈ విషయాన్ని మంగళవారం సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. పెప్సీ కార్బొనేటెడ్‌ పానీయాల ప్రచారానికి ఆయన కొత్త. 2020లో 360 డిగ్రీ వాణిజ్యప్రకటనలో నటించనున్నారు. 2019లో పెప్సీ ప్రారంభించిన స్వాగ్‌ థీమ్‌ ప్రచారాన్ని ఈ వాణిజ్య ప్రకటన ముందుకు తీసుకెళ్లనుంది. ”బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌తో ఒప్పందం చేసుకొందని ప్రకటించడానికి ఉత్సాహంగా ఉన్నాము. …

Read More »

భారత్ స్ట్రాంగ్ కౌంటర్… ..

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లుపై అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ (యూఎస్‌సీఐఆర్ఎఫ్) చేసిన ప్రకటనపై భారత విదేశాంగ శాఖ తీవ్ర స్థాయిలో స్పందించింది. యూఎస్‌సీఐఆర్ఎఫ్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమనీ, ఈ బిల్లును ఖండించే అధికారం దానికి లేదని స్పష్టంచేసింది. ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లును రేపు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బిల్లు ప్రమాదకరమైన, తప్పుడు మలుపు అంటూ యూఎస్‌సీఐఆర్ఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. …

Read More »

ముస్లింలకు తలదాచుకునే చోటు కూడా దక్కదు…

న్యూఢిల్లీ:కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ బిల్లుపై లోక్ సభలో వాడివేడిగా చర్చ కొనసాగుతోంది. ఈ బిల్లుపై ఓటింగ్ ముగిసిన తరువాత సోమవారం రాత్రి వరకూ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటనపై చర్చ సందర్భంగా.. అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సవరణ …

Read More »

దేశంలో ‘రేప్‌’లను ఆపేదెలా?

న్యూఢిల్లీ : ‘దిశ ఎన్‌కౌంటర్‌’లో నేరస్థులను హతమార్చినట్లే ప్రతి రేప్‌ కేసులో నిందితులను కాల్చి వేయాలని లేదా ఉరి తీయాలని డిమాండ్‌ దేశవ్యాప్తంగా ఊపందుకుంది. 2012లో ఢిల్లీలో జరిగిన ‘నిర్భయ’ రేప్‌ కేసు అనంతరం 2013 నుంచి దేశంలోని క్రిమినల్‌ చట్టాలను కఠినతరం చేస్తూ వచ్చారు. అదే నిర్భయ కేసులో నిందితులకు ఉరి శిక్షలు పడినా మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. అంతెందుకు ‘దిశ’ఎన్‌కౌంటర్‌’ జరిగిన రెండు రోజుల్లోనే దేశంలో …

Read More »

ఒబామా కొన్న అద్భుత ప్యాలెస్‌ ఇదే…

న్యూఢిల్లీ: చుట్టూ ఆవహించిన సముద్ర తరంగాల మీదుగా చల్లటి గాలులు వీస్తుంటే అందమైన దీవిపై వెలిసిన సువిశాల సుందర భవనంలో శాశ్వత నివాసం ఏర్పరుచుకొని, శేష జీవితం గడపాలనుకుంటే అది అందరికి స్వప్నం అవుతుందేమోగానీ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా దంపతులకు మాత్రం సాకారమవుతుంది. అమెరికాలోని మసాచుసెట్స్‌ రాష్ట్రంలోని మార్తాస్‌ వినియార్డ్‌ దీవిపై 29 ఎకరాల విస్తీర్ణ ప్రాంగణంలో 6,900 చదరపు అడుగుల్లో నిర్మించిన సువిశాల సుందర భవనాన్ని ఒబామా …

Read More »