Breaking News
Home / Tag Archives: nizamabad district

Tag Archives: nizamabad district

కవితను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్

నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన కూతురు కల్వకుంట్ల కవిత పేరును సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు కవిత ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన క్రమంలో కాసేపట్లో కేసీఆర్‌ను కవిత కలవనున్నారు. అటు ఉమ్మడి నిజామాబాద్ టీఆర్‌ఎస్ కార్యకర్తలతో కూడా కవిత భేటీ కానున్నారు. కాగా కవితను మంత్రివర్గంలోకి కూడా తీసుకోనున్నారనే ప్రచారం సాగుతోంది.

Read More »

నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం…

నిజామాబాద్: డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతులు డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లికి చెందిన సుమన్ (32), రాజవ్వ (40), అనూష (10)గా గుర్తించారు. సుమన్ తన చెల్లి పెళ్లికి చెందిన పత్రికలు పంచి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read More »

టీవీ సౌండ్ పెంచాడని చంపేశాడు….

టీవీ సౌండ్ పెంచాలన్న భయం వేసే ఘటన ఇది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన రాజేందర్ (40) ఇంట్లో అద్దెకు ఉంటున్న బాలనర్సయ్య అనే వ్యక్తి తన భార్యతో గొడవపడుతున్నాడు. వీరు పెద్దగా అరుచుకుంటుండడంతో రాజేందర్ సరిగ్గా వినపడడం లేదని టీవీ సౌండ్ పెంచాడు. దీంతో సౌండ్ ఎందుకు పెంచావని ఓనర్‌తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో రాజేందర్ తలపై బలంగా కొట్టడంతో స్పాట్‌లోనే మృతిచెందాడు. పోలీసులు నర్సయ్య కోసం గాలిస్తున్నారు.

Read More »

నిజామాబాద్‌లో ఘనంగా శివరాత్రి వేడుకలు..

నిజామాబాద్: జిల్లాలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలోని నీలకంఠేశ్వరాలయం, శంభునిగుడి, బోధన్ ఏకచక్రేశ్వరాలయం, ఆర్మూర్ సిద్ధులగుట్ట ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

Read More »

వివాహమైన కాసేపటికే… మృత్యు ఒడిలోకి

బోధన్‌ గ్రామీణం: నిజామాబాద్‌ జిల్లా బోధన్ పట్టణంలో పెళ్లింట విషాదం నెలకొంది. వివాహమైన కొద్దిసేపటికే వరుడు మంగళి గణేశ్(25) మృతి చెందాడు. గణేశ్‌కు శుక్రవారం మధ్యాహ్నం వివాహం జరిగింది. రాత్రి పెళ్లి వేడుకలో భాగంగా బారాత్‌ నిర్వహించారు. డీజే సౌండ్‌కు అస్వస్థతకు గురైన గణేశ్‌ ఒక్కసారిగా కుప్పకూలాడు. బంధువులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Read More »

చెట్టును ఢీకొన్న స్కూల్ బస్సు..

నిజామాబాద్: జిల్లాలోని నల్లవెల్లి దగ్గర రోడ్డుప్రమాదం జరిగింది. డిచ్‌పల్లి విద్యా పబ్లిక్ స్కూల్ బస్సు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ విద్యార్థి కాలు బస్సు ఇంజిన్‌లో ఇరుక్కుపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు గ్యాస్ కట్టర్‌ సాయంతో విద్యార్థిని బయటకు తీశారు. గాయపడిన విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ  ప్రమాదంపై కేసు …

Read More »

స్టేట్ ఏటీఎంలో చోరీ….

కోటగిరి: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం పోతంగల్ గ్రామంలోని స్టేట్ ఏటీఎంలో దుండగులు చోరీకి తెగబడ్డారు. సుమారు 6.45 లక్షల నగదును దుండగులు అపహరించారు. ఏటీఎం వద్ద సీసీ కెమెరా లేకపోవడంతో పథకం ప్రకారం ఏటీఎంను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Read More »

నిజామాబాద్ లో కొనసాగుతున్న పోలింగ్…

నిజామాబాద్‌: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ పోలింగ్ ఈరోజు ఉదయం ఏడు గంటల నుండి ప్రారంభమైంది.. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరారు. నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్లు సంబంధిత స్లిప్పులను వెంట తీసుకురావాలని అధికారులు తెలిపారు.

Read More »

‘ఎంపీ అరవింద్ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు….

నిజామాబాద్: విపక్ష పార్టీ నేతల మాయమాటలను నమ్మొద్దని, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రజలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్‌ అభివృద్ధి కోసం వందల కోట్ల నిధులు ఖర్చు చేశామన్నారు. సోమవారం ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే మాటలు నమ్మవద్దని ప్రజలను కోరారు. ఎంపీ అరవింద్ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. నోరు …

Read More »

సైకిల్ పై వచ్చి ఆసుపత్రిలో తనిఖీ చేసిన కలెక్టర్..

నిజామాబాద్‌: సాధారణ వ్యక్తిగా కలెక్టర్ సైకిల్ పై సర్కారు ఆసుపత్రికి వచ్చాడు. కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి కేంద్ర ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తాను బస చేసిన ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి సైకిల్‌పై బయలుదేరి ఉదయం ఎనిమిది గంటలకల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. మొదట ఆస్పత్రి ఆవరణలో జలధార కేంద్రానికి వెళ్లారు. లీటరు మంచినీరు రెండు రూపాయలకు విక్రయించడాన్ని గుర్తించారు. రూపాయికే విక్రయించాలి కదా అని అడగ్గా.. …

Read More »