Breaking News
Home / Tag Archives: one woman died

Tag Archives: one woman died

ప్రకాశం జిల్లాలో దారుణం….

ఒంగోలు: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో దారుణం జరిగింది. జ్వరం, జలుబుతో అస్వస్థతకు గురైన రాణి అనే మహిళ స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వైద్యునివద్దకు చికిత్స కోసం వెళ్లింది. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లడమే మంచిదని, తాను వైద్యం చేయనని చెప్పాడు. దీంతో ఆస్పత్రి మెట్లవద్దే కుప్పకూలిన రాణి అక్కడికక్కడే మృతి చెందింది. తెంగాణకు చెందిన రాణి మూడేళ్లుగా కూలిపనులు చేసుకుంటూ స్థానిక ఎన్టీఆర్ నగర్‌లో నివాసం ఉంటోంది. అయితే …

Read More »

ఏపీలో కరోనా అనుమానిత మహిళ మృతి…

తూర్పుగోదావరి: కరోనా అనుమానిత లక్షణాలున్న మహిళ మృతి చెందింది. కాకినాడ ఐసొలేషన్ వార్డులో చికిత్స పొందుతూ అంతర్వేదిపాలెం మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇటీవలే దుబాయ్‌ నుంచి అంతర్వేదిపాలెం ఆమె వచ్చినట్లు గ్రామస్థులు చెప్పారు. నిన్న కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఆమెను అడ్మిట్ చేశారు. ప్రాథమికంగా మెదడువాపుతో మృతి చెందినట్లు భావిస్తున్నామని, కరోనా పరీక్షలు రిపోర్టు రావాల్సి ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ పేర్కొన్నారు.

Read More »

యూసఫ్‌గూడలో రోడ్డు ప్రమాదం..

హైదరాబాద్: యూసఫ్‌గూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. టూవీలర్ అదుపు తప్పి ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సాయి దీపికారెడ్డి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సాయి దీపిక.. జూబ్లీహిల్స్‌లోని అపర్ణ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తోంది.

Read More »

సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం…

సూర్యాపేట: ఆటో బోల్తా పడటంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం తిమ్మాపురం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కొమ్మాల గ్రామానికి చెందిన చంద్రమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురికి గాయాలయ్యాయి.

Read More »

హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం…

హైదరాబాద్: కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కాప్రా నుంచి దమ్మాయిగూడ వైపు మళ్లేందుకు కోలాటి సరిత(35) అనే మహిళ స్కూటీని ఒక్కసారిగా కుడివైపునకు తిప్పడంతో వెనుకే వస్తున్న టిప్పర్‌ బంపర్‌కు తాకి కింద పడిపోయింది. టిప్పర్‌ వెనుక చక్రాలు తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.

Read More »

హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం….

హైదరాబాద్‌: నగరంలోని గచ్చిబౌలి బయోడైవర్సిటీ వద్ద ప్రమాదం జరిగింది. ఓ కారు వంతెనపై నుంచి కింద ఉన్న మరో కారుపై పడింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More »

హైదరాబాద్ లో మహిళ దారుణ హత్య…

హైదరాబాద్: నగరంలోని అత్తాపూర్ రాంబాగ్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. జ్యోతి అనే మహిళను హత్య చేసిన దుండగులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More »

నాగర్ కర్నూలు లో రోడ్డు ప్రమాదం…

నాగర్‌కర్నూల్‌ : జిల్లాలోని వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి గేట్‌ వద్ద రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ – శ్రీశైలం ప్రధాన రహదారిపై గుర్తు తెలియని మహిళను ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read More »

రైలు కింద పడి మహిళ మృతి…

కడప: మతి స్థిమితం లేని మహిళ రైలు కింద పడి మృతి చెందిన ఘటన కడప జిల్లా పుల్లంపేట మండలం రామక్కపల్లిలో జరిగింది. రామక్కపల్లికి చెందిన చింతారెడ్డి హైమావతి (45) అనే మహిళ రైలు క్రింద పడి మృతి చెందింది. మృతురాలికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

Read More »

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి…

నిజామాబాద్‌ : నిజామాబాద్‌ నగరంలోని ఎన్టీఆర్‌ చౌరస్తా వద్ద బుధవారం ఓ ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందింది. నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన అబీబా బేగం(45) ఇంటినుంచి మార్కెట్‌ వైపు నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో ఆర్టీసీ అద్దె బస్సు నందిపేటనుంచి నిజామాబాద్‌ వైపు వస్తోంది. ఎన్టీఆర్‌ చౌరస్తా వద్ద వెనుకనుంచి అబీబా బేగంను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణించింది. బస్సు డ్రైవర్‌ కర్షక్‌ కుమార్‌ను …

Read More »