Breaking News
Home / Tag Archives: PM Narendra Modi

Tag Archives: PM Narendra Modi

ఆరోగ్య రంగంపై ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు…

న్యూఢిల్లీ: కర్ణాటక బెంగళూరులోని రాజీవ్ గాంథీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆరోగ్యరంగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కంటికి కనిపించని వైరస్‌తో పోరాడుతున్న యోధులు… వైద్యులని, పోరాటంలో వైద్యులు తప్పక విజయం సాధిస్తారని ప్రధాని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్లకు, నర్సులకు, మెడికల్ సిబ్బందికి, శాస్త్రవేత్తలకు అభినందనలు చెబుతూనే ప్రపంచమంతా …

Read More »

చారిత్రక నిర్ణయం ప్రకటించనున్న మోదీ!

న్యూఢిల్లీ : దేశంలోని రైతులందరికీ మోదీ ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. ‘వన్ నేషన్- వన్ మార్కెట్’ (ఒకే దేశం – ఒకే మార్కెట్) అన్న విధానాన్ని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్నట్లు సమాచారం. ఇకపై రైతులు పండించిన ఉత్పత్తులను ఎవరికైనా… ఎక్కడైనా మంచి ధర కోసం విక్రయించడానికి వీలుగా ఈ విధానాన్ని ఆర్డినెన్స్ రూపంలో తేనున్నట్లు సమాచారం. ఢిల్లీలోని ఉన్నతాధికారులు అన్యాపదేశంగా ఈ మేరకు సంకేతాలిచ్చారు. మోదీ …

Read More »

కేంద్ర కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలు?

న్యూఢిల్లీ: రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా సమావేశం కానున్న ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లఢక్‌ సరిహద్దులో చైనాతో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో భద్రతా అంశాల కేబినెట్‌ కమిటీ, ఎకనమిక్‌ అఫైర్స్‌ కమిటీ కూడా కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు పూర్తిస్థాయిలో సడలించిన నేపథ్యంలో మాల్స్‌, …

Read More »

మోదీ నాయకత్వంలో అది సాధ్యం…

అమరావతి: ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్‌ త్వరలోనే స్వావలంబన కలిగిన దేశంగా అవతరించబోతోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రధాని మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా ఆయన శనివారం ట్వీట్‌ చేశారు. ఈ ఏడాది కాలంలో దేశం ఎన్నో చారిత్రక, ఎన్నో సాహసోపేత నిర్ణయాలను చూసిందని పవన్‌ అన్నారు. త్వరలోనే భారత్‌ స్వావలంబన సాధించి తీరుతుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ 21వ శతాబ్ది …

Read More »

ప్రధాని మోదీపై అమిత్‌ షా ప్రశంసలు…

న్యూఢిల్లీ : భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శుభాకాంక్షలు తెలిపారు. దూరదృష్టి, నిర్ణయాత్మక నాయకత్వం నేతృత్వంలో దేశాన్ని మరింత ముందుకు నడిపిస్తున్నారని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. 60 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీ పాలనలో చేసిన చారిత్రాత్మక తప్పిదాలను ఆరేళ్ల కాలంలో నరేంద్ర మోదీ సరిచేసి చూపారని కొనియాడారు. మోదీ గత ఐదేళ్ల కాలంలో చేసిన …

Read More »

ప్రధాని మోదీతో అమిత్ షా భేటీ…

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. న్యూఢిల్లీలోని 7 కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ నెల 31న లాక్‌డౌన్ నాలుగో దశ ముగియనుంది. ఆ తర్వాత లాక్‌డౌన్ ఐదో దశ విధించాలా వద్దా అనే విషయంపై చర్చిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో లాక్‌డౌన్ ఎత్తివేస్తే తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఇద్దరు నేతలూ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, …

Read More »

ఒడిశాలో మరో 76 కరోనా కేసులు…

భువనేశ్వర్‌: ఒడిశాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ రాష్ట్రంలో కొత్తగా 76 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1593కు చేరుకుంది. వీటిలో 853 కేసులు యాక్టివ్‌గా ఉండగా…733 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. ఇప్పటివరకు ఒడిశాలో కరోనాతో ఏడుగురు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఒడిశాలో మరో నెలపాటు లాక్‌డౌన్‌ …

Read More »

పలు సడలింపులతో లాక్‌డౌన్ కొనసాగింపు?…

న్యూఢిల్లీ : కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ 4.0 మే 31తో ముగుస్తున్న క్రమంలో అదేరోజు మన్‌ కీ బాత్‌ కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో మరికొన్ని సడలింపులు ప్రకటిస్తూనే లాక్‌డౌన్‌ 5.0ను ప్రధాని ప్రకటించవచ్చని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో 70 శాతం కేసులు వెలుగుచూస్తున్న 11 నగరాలపైనే లాక్‌డౌన్‌ …

Read More »

వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిన మోదీ…

కోల్‌కతా: అంఫన్ తుఫానుతో అతలాకుతలమైన పశ్చిమబెంగాల్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు. తుఫాను తీవ్రతను తెలుసుకునేందుకు కేంద్ర మంత్రులు, సీఎం మమతాబెనర్జీతో కలిసి ఆయన ఏరియల్ సర్వే జరిపాక ఈ ప్యాకేజీ ప్రకటించారు. అంఫన్ తుఫాను కారణంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్న మోదీ కష్టకాలంలో బెంగాల్ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. తాత్కాలిక సాయం కింద వెయ్యి కోట్లు ప్రకటించిన ప్రధాని నష్టానికి …

Read More »

మెడికల్ సిబ్బందికి ప్రధాని ధన్యవాదాలు…

న్యూఢిల్లీ: ఆయుష్మాన్ భారత్ ద్వారా కోటి మంది ప్రయోజనం పొందారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రారంభించిన రెండేళ్లలోపే ఈ ఘనత సాధించగలిగామంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రయోజనం పొందిన కుటుంబాలను అభినందించారు. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్ధిస్తానని మోదీ ట్విటర్‌లో తెలిపారు. పథకాన్ని విజయవంతం చేసిన డాక్టర్లకు, నర్సులకు, మెడికల్ సిబ్బందికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. It would make every Indian proud that the …

Read More »