Breaking News
Home / Tag Archives: police case filed

Tag Archives: police case filed

ఎక్సైజ్‌ ఎస్‌ఐ ఇంట్లో దొంగతనం…

శ్రీకాకుళం: చాపురం పంచాయతీ ఇందిరా నగర్‌ కాలనీలో నివాసముంటున్న ప్రొఫెసర్‌ అండ్‌ ఎక్సైజ్‌ సబ్‌ ఇన్స్పెక్టర్‌ ఇంట్లో బుధవారం వేకువజామున దొంగతనం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రూరల్‌ ఎస్సై లక్ష్మణ్‌, క్లూస్‌ టీం సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలన్నిటినీ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More »

బహదూర్‌పురాలో పోలీసుల ప్రత్యేక డ్రైవ్….

బహదూర్‌పురా: బహదూర్‌పురా చౌరస్తాలో ట్రాఫిక్‌ పోలీసులు ఆదివారం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో బైక్‌లు నడుపుతున్న మైనర్లను పట్టుకున్నారు. డ్రైవింగ్‌లో పట్టుబడిన ఓ మైనర్‌ ద్విచక్ర వాహనంపై రూ.20 వేల పైచిలుకు చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకున్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

Read More »

సెల్‌ఫోన్‌ దుకాణంలో భారీ చోరీ…

ప్రకాశం: చీరాలలో దొంగలు రెచ్చిపోయి బెస్తపాలెంలోని ఓ సెల్‌ఫోన్‌ దుకాణంలో చొరబడి సుమారు లక్ష రూపాయలకు పైబడిన సెల్‌ఫోన్లను చోరీ చేసిన ఘటన శనివారం వెలుగు చూసింది. స్టేషన్‌ రోడ్డులోని మరో రెండు సెల్‌ఫోన్‌ దుకాణాల్లోనూ దొంగలు చోరీకి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More »

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం…

హైదరాబాద్‌: శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో ఘట్‌కేసర్‌ – బీబీనగర్‌ రైల్వేస్టేషన్‌ల మధ్య ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుని వయసు 25 సంవత్సరాలు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే మృతుడు బ్లాక్‌ కలర్‌ టీషర్ట్‌, బూడిద కలర్‌ ప్యాంట్‌ ధరించి ఉన్నాడు. మృతుడి వద్ద ఎలాంటి …

Read More »

పెళ్లైన 3 నెలలకే తలాక్ చెప్పిన భర్త……

హైదరాబాద్: హైదరాబాద్ లోని ముస్తఫా అనే వ్యక్తి తన భార్య రుక్సానా(25) పళ్లు ఎత్తుగా ఉన్నాయని పెళ్ళైన 3 నెలలకే తలాక్ చెప్పేసి వెళ్లిపోయాడు. అయితే తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని రుక్సానా కుషాయిగుడా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read More »

పోలీస్‌ వాహనాన్ని ఢీకొట్టిన కారు….

హైదరాబాద్‌: నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 2లో ట్రాఫిక్‌ పోలీసులకు చెందిన పెట్రో వాహనం రోడ్డు పక్కకు ఆగి ఉన్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టడంతో పోలీసుల వాహనం భారీగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో హోంగార్డ్‌ రాజు తీవ్రంగా గాయపడడంతో అతడిని దగ్గరలోని ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read More »

షేర్‌చాట్‌లో చాటింగ్ తెచ్చిపెట్టిన తిప్పలు….

తాడేపల్లి రూరల్‌: 15 రోజుల క్రితం ఉండవల్లి గ్రామానికి చెందిన ఒక బాలిక (14) అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రమణపల్లికి చెందిన ఎం.విజయకుమార్‌కు షేర్‌చాట్‌లో మెసేజ్‌ పంపించింది. అప్పటి నుంచి ప్రతిరోజూ బాలిక, ఆ యువకుడు షేర్‌చాట్‌లో మెసేజ్‌లు చేసుకుంటున్నారు. తనను ఇంట్లోంచి తీసుకువెళ్లిపోమని, లేదంటే చనిపోతానని మెసేజ్‌ పెట్టడంతో విజయకుమార్, అతని సోదరుడు నవీన్‌ ఆదివారం అనంతపురం నుంచి బయల్దేరి సోమవారం విజయవాడలోని ఓ హోటల్‌కు వచ్చారు. …

Read More »

కైలాసగిరిపై దారుణం…..

విశాఖ: విశాఖలోని కైలాసగిరి వద్ద కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణం చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉండడం గమనార్హం.

Read More »

మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన….

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లాలో సోమవారం పార్టీ చేసుకుందామని గ్రామానికి చెందిన సునీల్‌ కుష్వహ, మనోజ్‌ అహిర్వార్‌లు తమ స్నేహితుడి ఇంటికి వెళ్లి ముగ్గురూ కలిసి పీకల్లోతు మద్యం సేవించారు. మద్యం మత్తులో స్నేహితుడి భార్యపై సునీల్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు. భర్త అడ్డగించడంతో మరో వ్యక్తి మనోజ్‌అహిర్వార్‌ స్నేహితుడని కూడా చూడకుండా బాధితుడిని దారుణంగా హత్య చేశాడు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. …

Read More »

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం….

చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని పలమనేరు పట్టణం ప్రభుత్వ డిగ్రీ కళాశాల దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై లారీని ఢీ కొట్టబోయిన కారు అదుపు తప్పి రోడ్డు ప్రక్కన నిల్చున్న వారి పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ సమయంలో రోడ్డుపై ఎక్కువ మంది లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గాయపడ్డ వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఈ …

Read More »