Breaking News
Home / Tag Archives: Police complaint

Tag Archives: Police complaint

యువకుడిపై ఫిర్యాదు చేసిన అమృత

నల్గొండ: మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్‌ భార్య అమృత ఓ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటి ఎదురుగా ఉండే విజయ్‌ అనే యువకుడు తన వ్యక్తిగత సమాచారాన్ని ప్రణయ్‌ హత్య కేసు నిందితుడు కరీంకు చేరవేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విజయ్‌ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read More »

టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటిపై దాడి

తిరుపతి: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు మద్యం సీసాలతో దాడి చేశారు. సుగుణమ్మ ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో సుగుణమ్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.

Read More »

లంగర్‌హౌస్‌లో రెచ్చిపోయిన బైక్‌ రేసర్లు

హైదరాబాద్: రెచ్చిపోయిన బైక్ రైసర్లు ఇతర వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలిగించారు. హైదరాబాద్ లంగర్‌హౌస్‌లో బైక్‌ రేసర్లు రెచ్చిపోయారు. టోలిచౌకి-మెహిదీపట్నం ప్రధాన రహదారిపై నంబర్‌ ప్లేట్లు తొలగించి మరీ బైక్‌ రేసింగ్‌ నిర్వహించారు. బైక్ రైసర్ల తీరు కారణంగా తీవ్ర ఇబ్బందుల పాలైన వాహనదారులు యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read More »

టీడీపీ నేత ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్ మృతి….

విజయవాడ: తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న హరి వరుణ్ రెడ్డి అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించాడు. గత కొన్నేళ్లుగా అతను జేసీ ఇంట్లో విధులను నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. హరి వరుణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Read More »

ప్రముఖ సినీ దర్శకుడు ఇంట్లో చోరి….

ఫిల్మ్ న్యూస్: ప్రముఖ సినీ దర్శకుడు భారతి రాజా ఇంట్లో చోరీ జరిగింది. చోరీకి పాల్పడిన అగంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. టి.నగర్‌లోని కృష్ణన్‌ వీధిలో భారతిరాజా నివసిస్తున్నారు. రూ.లక్ష విలువైన ఐఫోన్‌, పూజ గదిలో ఉంచిన రూ.లక్ష విలువైన వెండి వస్తువులు, రూ.15 వేల నగదు అదృశ్యం కావడం గమనించిన రాజా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన …

Read More »

టీడీపీ అధినేతపై పోలీసులకు ఫిర్యాదు….

గుంటూరు: పోలీసు వ్యవస్థను కించపరిచేలా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేత వర్ల రామయ్య లు మాట్లాడుతున్నారంటూ గుంటూరు జిల్లా అరండల్ పేట పోలీసు స్టేషన్లో వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, విడదల రజని, మహ్మద్ ముస్తఫా తదితరులు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, వర్ల రామయ్య పోలీసుల ఆత్మా స్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని, డీజీపీపైనా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన తప్పులను సమర్ధించుకోకుండా సరిదిద్దుకోవాలని హితవు …

Read More »

ఎమ్మెల్యేతో పాటు ఐదుగురిపై ఫిర్యాదు..

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లాలోని తుని మండలంలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సత్యనారాయణ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. అయితే ఈ దారుణానికి పాల్పడిందెవరన్న విషయం ఇంతవరకూ తెలియరాలేదు. తాజాగా.. హత్య విషయంలో సత్యనారాయణ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో సహా మరో ఐదుగురి పేర్లను ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కేసులో …

Read More »

ప్రేమించి పెళ్లి చేసుకుని ఆపై….

శ్రీకాకుళం: పోలాకి మండలం డీఎల్.పురంలో దారుణం జరిగింది. ప్రియుడి చేతిలో ఓ యువతి నిలువునా మోసపోయింది. ఒకే గ్రామానికి చెందిన అబ్బాయి-అమ్మాయి ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి గత రాత్రి ఆమె మెడలో ప్రియుడు తాళి కట్టాడు. రాత్రంతా ఆమెతో ఉండి.. ఉదయాన్నే ప్రియురాలిని వదిలేసి వెళ్లిపోయాడు. ప్రియుడి చేసిన మోసంపై బాధితురాలు పోలీసులకు  ఫిర్యాదు చేసింది. మరోవైపు అధికార పార్టీ నేతలు నిందితుడ్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. …

Read More »