Breaking News
Home / Tag Archives: rahul gandhi

Tag Archives: rahul gandhi

ప్రజాకోర్టులో కాంగ్రెస్‌కు శిక్ష తప్పదు.. కాగ్ రిపోర్ట్‌పై జైట్లీ స్పందన

న్యూఢిల్లీ: రాఫెల్ ఒప్పందంపై ఎన్డీయే వాదనలను కాగ్ రిపోర్ట్ సమర్థించిందని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అన్నారు. కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాన్ని కాగ్ రిపోర్ట్ పటాపంచలు చేసిందని వ్యాఖ్యానించారు. 500 – 1600 అంటూ తప్పుడు లెక్కలతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విసుగు పుట్టించారని.. కాగ్ నివేదికలో అవి ఎక్కడా కనపడలేదన్నారు. సుప్రీం కోర్టు, కాగ్ సంతృప్తి చెందినా.. విపక్షం మాత్రం దేశాన్ని తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. …

Read More »

ఆ ఈమెయిల్ రాహుల్‌కి ఎలా దొరికింది?: కేంద్రమంత్రి

న్యూఢిల్లీ: ఎయిర్‌బస్‌ కంపెనీకి సంబంధించిన అంతర్గత ఈమెయిల్ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేతికి ఎలా వచ్చిందంటూ కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. అది రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించినది కాదనీ… హెలికాప్టర్లకు సంబంధించినదని పేర్కొన్నారు. రాఫెల్ ఒప్పందం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘‘రాజద్రోహానికి’’ పాల్పడ్డారంటూ రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై కొద్ది నిమిషాల్లోనే బీజేపీ తీవ్ర స్థాయిలో స్పందించింది. ‘‘మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ బాధ్యతా …

Read More »

ఏపీ ఈ దేశంలో భాగం కాదా.. మోదీకి రాహుల్ సూటి ప్రశ్న

ఢిల్లీలో: ఆంధ్రాభవన్‌లో దీక్ష చేపట్టిన సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. దేశవ్యాప్తంగా మోదీ విశ్వసనీయత కోల్పోయారన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేరుస్తారో లేదో చెప్పాలని ప్రధాని మోదీని ప్రశ్నించారు. ఏపీ ఈ దేశంలో భాగం కాదా అన్నారు. గత ప్రధాని ఇచ్చిన హామీలను ఈ ప్రధాని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే ‘‘ఏపీ ప్రజలకు అండగా ఉంటాను. ఎక్కడికి వెళితే …

Read More »

రావణుడిగా నరేంద్రమోదీ ఫ్లెక్సీ…భోపాల్‌లో సంచలనం

రాముడిలా ఉన్న రాహుల్… బాణం ఎక్కుపెట్టి భోపాల్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ రావణుడిగా, కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ రాముడిగా చిత్రీంచిన పోస్టరు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో వెలుగుచూసింది. భోపాల్ నగరంలోని సూరజ్ తివారీ ఫ్యాన్స్ క్లబ్ సభ్యులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రధానమంత్రి మోదీని రావణుడిగా పది తలలతో కూడిన చిత్రాన్ని రూపొందించారు. మోదీ ముఖంతో చిత్రీంచిన రావణుడిని బాణం గురిచూసి కొడుతున్న రాముడి ఫోటోలో …

Read More »

మోదీ ఓ పిరికిపంద.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మరోసారి పదునైన వ్యాఖ్యలతో విరుకుచుకుపడ్డారు. ప్రధానమంత్రి ఓ ‘‘పిరికిపంద’’ అనీ… దమ్ముంటే జాతీయ భద్రత, రాఫెల్ ఒప్పందం, ఆర్ధిక వ్యవస్థ తదితర అంశాలపై తనతో చర్చకు రావాలంటూ ఆయన సవాల్ విసిరారు. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ మైనారిటీ విభాగం నిర్వహించిన ఓ సమావేశంలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు. ‘‘ఐదేళ్ల పాటు పోరాడిన తర్వాత ఆయన (మోదీ) సంగతేంటో నాకు …

Read More »

రాహుల్ గాంధీ గారూ, ఎందుకంత సీరియస్‌గా ఉన్నారు : అమిత్ షా

డెహ్రాడూన్ : భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా శనివారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయోధ్యలో రామాలయం నిర్మాణంపై కాంగ్రెస్ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అయోధ్య రామ జన్మభూమిలోని వివాద రహిత భూమి సుమారు 42 ఎకరాలు ఉందని, దీనిని అసలు యజమానులైన రామ జన్మభూమి న్యాస్‌, తదితరులకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనుకుంటోందని, దీనిపై …

Read More »

‘రాహుల్‌కు కనీసం ఆ విషయమైనా తెలుసా’

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై బీజేపీ నేత కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. రాహుల్‌కు వ్యవసాయం అంటే తెలుసా అని ప్రశ్నించారు. కనీసం పాలు బర్రె నుంచి వస్తాయా.. దున్నపోతు నుంచి వస్తాయా అనేది కూడా తెలియదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌ అన్ని వర్గాలకు న్యాయం చేసేదిగా ఉందని కొనియాడారు. ప్రధాని మోదీ నీతి, నిజాయితీతోనే దేశంలో పాలన గాడిన పడిందన్నారు. మోదీ …

Read More »

రాహుల్ గాంధీ మరో భారీ ఆఫర్

కొచ్చిన్ : రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును తాము ఆమోదిస్తామని చెప్పారు. ఈ బిల్లును 2010లో రాజ్యసభలో ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు. త్వరలో జరిగే లోక్‌సభ …

Read More »

ఒకే రాహుల్, ఒకే ప్రియాంక : అమిత్ షా

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు అమిత్ షా కాంగ్రెస్ అగ్ర నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ఉణలో సోమవారం జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ‘వన్ ర్యాంక్, వన్ పెన్షన్’ కు సంక్షిప్త రూపం ఓఆర్ఓపీకి కొత్త వివరణ ఇచ్చారు. ఓఆర్ఓపీ అంటే ఓన్లీ రాహుల్, ఓన్లీ ప్రియాంక అని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ …

Read More »

లోక్‌సభ ఎన్నికల్లో సంపూర్ణ బలంతో పోటీ : రాహుల్ గాంధీ

అమేథీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సంపూర్ణ బలంతో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాందీ గురువారం చెప్పారు. ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో కూడా గెలిచే సత్తా ఉందని చెప్పారు. రాహుల్ గాంధీ తాను లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథీలో రెండు రోజులపాటు పర్యటించారు. గురువారం ఈ పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘మనం లోక్‌సభ …

Read More »