Breaking News
Home / Tag Archives: rbi

Tag Archives: rbi

గూగుల్ పే గురించి వస్తున్న పుకార్లు అబద్ధం

ఇండియాలో గూగుల్ పే యాప్‌ను RBI బ్యాన్ చేసిందంటూ వస్తున్న పుకార్లపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) క్లారిటీ ఇచ్చింది. గూగుల్ పే యాప్ చట్ట పరిధిలోనే పనిచేస్తోందని.. దాన్ని నిషేధించట్లేదని స్పష్టంచేసింది. ఇది థర్డ్ పార్టీ యాప్ అని.. UPI చెల్లింపుల కోసం బ్యాంకులకు సర్వీస్ ప్రొవైడర్‌గా వ్యవహరిస్తోందని తెలిపింది. దీని ద్వారా జరిగే ప్రతీ లావాదేవి సురక్షితమేనని NPCI స్పష్టంచేసింది.

Read More »

ఆర్‌బీఐకి చిదంబరం కీలక సలహా…

న్యూఢిల్లీ : కరోనా సంక్షోభ కాలంలో ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ కోసం కృష్టి చేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)కు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కీలక సూచన చేశారు. ఆర్‌బీఐ సత్యర చర్యల్ని కొనియాడిన ఆయన తమ కర్తవ్య నిర్వహణపై నిర్మొహమాటంగా వ్యవహరించాలని సలహా ఇచ్చారు. తమ డ్యూటీ తమను చేసుకోనివ్వమని మొహ​మాటం లేకుండా ప్రభుత్వానికి గట్టిగా చెబుతూనే, ఆర్థిక చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత …

Read More »

కీలక ప్రకటనలు చేసిన ఆర్బీఐ గవర్నర్…

ముంబై: రెపో రేటు 40 బేసిస్‌ పాయింట్లు తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. శుక్రవారం ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. రెపో రేటు 4.40 నుంచి 4 శాతానికి తగ్గించినట్లు పేర్కొన్నారు. రివర్స్‌ రెపోరేటు 3.35శాతానికి కుదిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉందని, ఆర్థికరంగ అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ తెలిపారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో …

Read More »

నేడు ఆర్బీఐ మీడియా సమావేశం..

లాక్‌డౌన్‌ నిబందనలు సడలింపుపై, దేశ ఆర్ధిక వ్యవస్థపై ఇవాళ ఉదయం 10:00 గంటలకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ పత్రికా సమావేశం నిర్వహించనున్నారు…కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ, రాయితీలపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది…లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే నష్టపోయినా పరిశ్రమలకు మరింత వెసులుబాటు కల్పించే అవకాశాలు ఉన్నాయి…లాక్‌డౌన్ కారణంగా ఈఎంఐలపై మూడు నెలల పాటు మారిటోరియం ఆర్బీఐ విధించిన విషయం …

Read More »

రుణాలపై మారటోరియం

మూడు నెలలు పెంచే యోచనలో ఆర్‌బిఐ న్యూఢిల్లీ : బ్యాంక్‌ రుణాలపై మళ్లీ మారటోరియం విధించే ప్రతిపాదనను ఆర్‌బిఐ పరిశీలిస్తోంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 17 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. దీంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న ప్రజలు, పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు మరో మూడునెలలు పెంచాలనే నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. బ్యాంకుల సంఘాలు, వివిధవర్గాల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఆర్‌బిఐ ఈ అంశాన్ని తీవ్రంగా …

Read More »

ఆర్బీఐపై చిదంబరం ప్రశంసలు..

న్యూఢిల్లీ: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయంపై సీనియర్ కాంగ్రెస్ నేత పి. చిదంబ‌రం స్పందించారు. కరోనా వైరస్, లాక్‌డౌన్ కార‌ణంగా దెబ్బ‌తిన్న మ్యూచువ‌ల్ ఫండ్స్ ప‌రిశ్ర‌మ‌కు ద్ర‌వ్య లభ్య‌త కోసం సోమవారం రిజ‌ర్వు బ్యాంకు రూ.50000 కోట్ల ప్యాకేజీ ప్ర‌క‌టించ‌టాన్ని ఆయన స్వాగతించారు. ఆర్‌బీఐ సత్వర చర్య మ్యూచువ‌ల్ ఫండ్స్ విభాగంలో నెల‌కొన్న ఆందోళ‌న‌ల‌కు ఊరటనిస్తుందని ఆయ‌న ప్రశంసించారు. ప్ర‌ముఖ పెట్టుబ‌డి సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ భార‌త్‌లోని …

Read More »

లాభాల జోరు : 9200 ఎగువకు నిఫ్టీ

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, మంచి వర్షపాతం అంచనాలు, ఆర్ బీఐ ప్రకటించిన ఆర్థిక పటిష్ట చర్యలతో కీలక సూచీలు వారాంతంలో లాభాల్లో ముగిసాయి. ఒక దశలో ఆరంభ వెయ్యిపాయింట్ల లాభం నుంచి వెనక్కి తగ్గిన సూచీలు మిడ్ సెషన్ నుంచి అదే రేంజ్ లో పుంజుకున్నాయి. వారాంతం కావడంతో ఆఖరి అర్థగంటలో లాభాల స్వీకరణతో చివరికి సెన్సెక్స్ 986 …

Read More »

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక ప్రకటనలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక ప్రకటనలు చేశారు. ఇందులో ప్రధానంగా కరోనా లాక్ డౌన్ కారణంగా స్థూల ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. శక్తికాంత్ దాస్ కీలక ప్రకటనలు: 1. కరోనా సంక్షోభంలో దెబ్బతిన్న …

Read More »

బ్యాంక్ ఖాతాదారులకు ఆర్బీఐ సూచన….

కరోనా నేపథ్యంలో దేశంలో ఊహించని పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  పలు సూచనలు చేసింది. ఖాతాదారులు తాము చెల్లించాల్సిన ఎలాంటి వాయిదాలనైనా డిజిటల్ విధానంలో చెల్లించాలని సూచించింది. అన్ని బ్యాంకులు డిజిటల్ పేమెంట్ విధానాన్ని కల్పిస్తున్న నేపథ్యంలో దానిని వినియోగించుకోవడం ద్వారా పరోక్ష సామాజిక దూరాన్ని పాటించినట్లవుతుందని వివరించింది.

Read More »

మళ్లీ మన ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది: ఆర్బీఐ

కరోనా వైరస్ వల్ల తలెత్తిన పరిస్థితులు చక్కబడితే మళ్లీ మన ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఆర్బీఐ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇటీవల కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ, ఉద్దీపన చర్యలు ఇందుకు బలాన్ని ఇస్తాయని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో వృద్ధి రేటును అంచనా వేయడం కష్టమని తెలిపింది. అంతర్జాతీయంగా కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని, ఇది మనకూ వర్తిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

Read More »