Breaking News
Home / Tag Archives: road accident

Tag Archives: road accident

శ్రీకాకుళంలో రోడ్డు ప్రమాదం…

శ్రీకాకుళం: మందస మండలం బాలిగాం వద్ద ప్రైవేటు బస్సు బోల్తా పడింది. 20 మందికి గాయాలయ్యాయి. వారిని పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా వలసకూలీలుగా గుర్తించారు. బస్సు చెన్నై నుంచి కోల్‌కతా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Read More »

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

గుంటూరు మండలం పొత్తూరు వద్ద గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వలసకూలీలతో వెళ్తున్న వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టింది. అదే సమయంలో అటుగా నెల్లూరు వెళ్తున్న అనిల్ కుమార్ యాదవ్ ఘటనా స్థలంలో ఆగి క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్ కాలు విరగగా, కండక్టర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

Read More »

శ్రీకాకుళం జిల్లాలో రోడ్డుప్రమాదం…

శ్రీకాకుళం: పలాసలో రోడ్డుప్రమాదం జరిగింది. చిన్న పొలం వద్ద చేపల ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. గ్రామం నుంచి పలాసకు వస్తుండగా ఈ ఘోరం జరిగింది. మ‌ృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read More »

యూపీ రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి…

ఉత్తరప్రదేశ్‌లోని ఔరాయా జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వలస కార్మికుల మరణం దురదృష్టకరమన్న సీఎం.. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ అదనపు కార్యదర్శి అవినాశ్ అవస్థి తెలిపారు. వలస కూలీల ట్రక్కు రాజస్థాన్ నుంచి యూపీ వస్తుండగా ఔరాయా వద్ద మరో ట్రక్కు దానిని ఢీకొట్టింది. …

Read More »

రోడ్డు ప్రమాదంలో 23 మంది వలస కార్మికుల దుర్మరణం

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని అవురియా ప్రాంతంలో శనివారం తెల్లవారుఝామున ఘోరం జరిగింది. వలస కార్మికులతో ప్రయాణిస్తున్న ఓ ట్రక్కు.. ఎదురుగా వస్తున్న మరో ట్రక్కు ఢీకొని 23 మంది వలస కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది కార్మికులు తీవ్ర గాయాల పాలయ్యారు. గాయాల పాలైన వారిని పోలీసులు, స్థానిక అధికారులు స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటన శనివారం తెల్లవారుఝామున 3:30 గంటల ప్రాంతంలో …

Read More »

బోల్తా పడ్డ వలస కూలీల లారీ

నిర్మల్‌: జిల్లా కేంద్రం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముప్ఫై మంది వలస కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కూలీలతో వెళ్తున్న లారీ నిర్మల్‌ మండలంలోని కొండాపూర్‌ వద్ద బోల్తా పడింది. ప్రమాద సమయంలో లారీలో మొత్తం 60 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని నిర్మల్‌ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ వలస కూలీలంతా ఉత్తరప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన …

Read More »

చెక్ పోస్ట్ మీదకు దూసుకెళ్లిన లారీలు !

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఏపీ తెలంగాణా బోర్డర్ లో నిన్న రాత్రి పెను ప్రమాదం తప్పింది. అక్కడ చెక్ పోస్ట్ లో డ్యూటీలో ఉన్న పోలీస్, వైద్య, రెవెన్యూ సిబ్బందికి పెను ప్రమాదం తప్పింది. బోర్డర్ లో తెలంగాణ అధికారులు వైద్య, పోలీస్,రెవెన్యూ, సిబ్బంది కరోనా నేపథ్యంలో ఏర్పాటు చేసుకున్న చెక్ పోస్ట్ వద్ద ఎదురెదురుగా రెండు లారిలు ఢీకొనడంతో ఆ లారీలు రెండూ కలిసి చెక్ పోస్ట్ …

Read More »

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం…

కడప: జిల్లాలోని జేఎంజే కాలేజీ దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకువచ్చిన ఓ లారీ పోలీస్‌ చెక్‌పోస్ట్‌ టెంట్‌లోకి దూసుకెళ్లింది. కాగా ఆ సమయంలో టెంట్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Read More »

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం…

గుంటూరు: జిల్లాలోని మంగళగిరి మండలం కాజా టోల్‌గేట్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వేగంగా వస్తున్న లారీ…ఆటోను బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More »

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం…

రాయచూర్‌: కర్ణాటకలోని రాయచూర్‌ వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గద్వాల జిల్లా కె.టి దొడ్డికి చెందిన గోపాల్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా గురువారం ఉదయం బెంగళూరు నుంచి కారులో స్వగ్రామానికి బయలు దేరాడు. ఈ క్రమంలో రాయచూర్‌ జిల్లా మాన్వి వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టును …

Read More »