Breaking News
Home / Tag Archives: SC

Tag Archives: SC

ఎస్సీ, ఎస్టీల సంక్షేమంలో..సరికొత్త రికార్డు

చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఈ వర్గాలకు లబ్ధి 2020–21లో వారి కోసం మరింతగా నిధుల వినియోగం ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీలకు రూ.15,735 కోట్లకు పైగా, ఎస్టీలకు రూ.5,177 కోట్లకు పైగా ఖర్చు అట్టడుగు వర్గాల వారికి మేలు చేయడమే లక్ష్యం ఆసరా, చేయూత పథకాల ద్వారా లక్షలాది మందికి లబ్ధి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి 6వ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ అమరావతి: రాష్ట్ర చరిత్రలో …

Read More »

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీపికబురు

అమరావతి: కాస్ట్(కుల ధృవీకరణ) సర్టిఫికెట్లు కావాలంటే ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సిందే. ఇకపై ఈ సమస్యకు చెక్ పెట్టేలా.. గ్రామ/వార్డు సచివాలయాల్లోనే కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఇతర రాష్ట్రాల్లో విద్య, ఉద్యోగ అవసరాల కోసం ఇచ్చే సర్టిఫికెట్లను మాత్రం తహశీల్దార్, ఆపైన ఉండే అధికారి మంజూరు చేయనుండగా.. మార్చి నెలాఖరు నుంచి ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది.

Read More »

1355 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఎస్ఎస్సి తాజాగా సెలక్షన్ పోస్ట్ ఫేజ్ -8 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌తో అసిస్టెంట్, టెక్నికల్ విభాగాల్లో 1355 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టులను బట్టి పదో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్హతలున్నాయి. మార్చి 20 లోపు ఎస్ఎస్సి  సైట్‌లో రూ.100 ఫీజు (ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి లకు ఉచితం) చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు ఎస్ఎస్సి సైట్ చూడండి.

Read More »

ఉత్తరాంధ్ర రైతుల్లో భయం ఉంది: పవన్

విశాఖపట్నం: విశాఖలో కొన్ని వేల ఎకరాల భూములు సమీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జనసేన నేతలతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ‘ఉత్తరాంధ్ర రైతులకు అమరావతి రైతుల పరిస్థితి రాకుండా చూడాలి. అసైన్డ్ భూమి తీసుకునేందుకు సిద్ధమై పేదరైతులకు అన్యాయం చేస్తున్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ రైతులు ఎక్కువగా నష్టపోతారు. తమనూ రోడ్డుపైకి తీసుకొస్తారనే భయం ఉత్తరాంధ్ర రైతుల్లోనూ ఉంది’ అని అన్నారు.

Read More »

‘స్పందించకపోతే వారిది అరణ్యరోదనే అవుతుంది’

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయని.. ఈ వ్యవస్థలు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నాయా లేదా అన్న దానిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎస్‌ నీలం సాహ్ని, వివిధ శాఖల కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలోని వివిధ వర్గాల …

Read More »

మీ దొంగ దీక్షలకు వాటిని ఖర్చుపెట్టారు….

అమరావతి: ఎస్సీ, ఎస్టీ చట్టం చేసిన రోజు చంద్రబాబు అసెంబ్లీకే రాలేదని మంత్రి కన్నబాబు ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ నిధుల్ని దారి మళ్లించిన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. మీ దొంగ దీక్షలకు ఎస్సీ నిధులు ఖర్చుపెట్టారని దుయ్యబట్టారు. జగన్‌పై బురదజల్లడమే చంద్రబాబు ఏకైక అజెండా అని కన్నబాబు విమర్శించారు. దిశ చట్టాన్ని ఢిల్లీ ప్రభుత్వం అభినందించిందన్నారు. రితేశ్వరి, ఆయేషా కేసుల్లో మీరేం చేశారని ప్రశ్నించారు. కడుపు మంటతో చంద్రబాబు విమర్శలు …

Read More »

చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన సీఎం…

చారిత్రాత్మక బిల్లు తెస్తుంటే..! ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక కమిషన్ లపై చర్చ. సస్పెండ్ చేసినా తప్పులేదు అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బాబు మాట్లాడిన అనంతరం సీఎం మాట్లాడారు. కాగా.. ఇవాళ ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్‌లపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేనని …

Read More »

దళితులకు మనోధైర్యం కల్పించాలి….

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ,ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు తీసుకురావడం హర్షనీయమని వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పేర్కొన్నారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. అంబేద్కర్ ఆలోచన, విధానం తీసుకురావడం మంచిదన్నారు. గత ప్రభుత్వంలో దళితుల భూములను లాక్కున్నారని మేరుగ ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో దళిత భూములు లాక్కుంటే ఆనాడు వైసీపీ ధర్నా కూడా చేపట్టిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వం హయాంలో దళిత మహిళలను అవమానించారని చెప్పుకొచ్చారు. …

Read More »

చట్టసభల్లో ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు పొడిగింపు…

న్యూఢిల్లీ : చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ రిజర్వేషన్లను మరో పదేళ్లు పొడిగింపు నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుత రిజర్వేషన్ల గడువు 2020 జనవరి 25వ తేదీతో ముగియనుంది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు.. 2030 జనవరి 25 వరకు వర్తించనున్నాయి.

Read More »

సమస్యల పరిష్కారమే లక్ష్యం

చిత్తూరు: దళితుల సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సూచించారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో చిత్తూరు డివిజన్‌ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్‌ మార్కండేయులు, చిత్తూరు ఆర్డీవో రేణుక సమావేశానికి అధ్యక్షత వహించారు. నారాయణస్వామి మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజాప్రతినిధులను తప్పనిసరిగా ఆహ్వానించాలన్నారు. వీటి ద్వారా సమస్యలను …

Read More »