Breaking News
Home / Tag Archives: short circuit

Tag Archives: short circuit

తూర్పుగోదావరి జిల్లాలో అగ్నిప్రమాదం…

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్‌ మండలం బండారులంక మట్టపర్తివారి పాలెంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మూడు ఇళ్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో దాదాపు రూ.10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఇల్లు కాలిబూడిదవడంతో ఆరు కుటుంబాలు నిరాశ్రయులయ్యారు.

Read More »

విశాఖ ఉత్సవ్‌లో తప్పిన పెను ప్రమాదం..

అలజడి రేపిన అలలు వీఐపీ లాంజ్‌లోకి నీరు రావడంతో కలకలం విద్యుత్‌ తీగల షార్ట్‌ సర్క్యూట్‌తో భయాందోళన విశాఖపట్నం: విశాఖ ఉత్సవ్‌లో పెను ప్రమాదం తప్పింది. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి 9.30 గంటలు సమయంలో ఉవ్వెత్తున ఎగసిన అలలు వేదిక ముందు ఏర్పాటు చేసిన వీఐపీ, వీవీఐపీ లాంజ్‌ల్లోకి రావడంతో ఒక్కసారిగా సందర్శకులు భయాందోళనలకు గురయ్యారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన లాంజ్‌లోకి నీరు ఒక్కసారిగా రావడంతో …

Read More »

షార్ట్‌ సర్క్యూట్‌ తో పెంకుటిల్లు దగ్ధం..

పశ్చిమ గోదావరి : పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి బండివారి వీధిలో షార్ట్‌ సర్క్యూట్‌ అవడంతో పెంకుటిల్లు దగ్ధమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. బండివారి వీధిలోని ఓ పెంకుటింట్లో షేక్‌ సుభాని అతని భార్య, ఇద్దరు ఆడ పిల్లలు అద్దెకు నివాసముంటున్నారు. నిన్న (సోమవారం) సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో సత్తుపల్లిలోని బంధువుల ఇంటికి సుభాని కుటుంబంతో కలిసి వెళ్లాడు. తిరిగి వచ్చేప్పటికి …

Read More »

తృటిలో తప్పిన పెను ప్రమాదం…

నల్గొండ : నల్గొండ జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పడంతో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు డ్రైవర్ అప్రమత్తతతో వీరంతా సజీవంగా ఉన్నారు. నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై చర్లపల్లి వద్ద ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో మంటలు చెలరేగాయి. షార్ట్‌ సర్క్యూట్‌తో బస్సు పూర్తిగా దగ్ధమైంది. హైదరాబాద్‌ నుంచి ఒంగోలు వెళ్తుండగా ఈ  ఘటన జరిగింది. బస్సులో నుంచి పొగలు రావడంతో డ్రైవర్ వెంటనే బస్సును ఆపి …

Read More »

షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం…

నిజామాబాద్: జిల్లాలోని నందిపేట మండలం కౌల్‌పూర్ గ్రామంలోని ఎన్టీఆర్ కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన ప్రమాదంలో బత్తుల ప్రసాద్‌కు చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. మూడు లక్షల రూపాయల నగదు, ఐదు తులాల బంగారం, ఇంట్లో టీవీ ఫర్నీచర్, బట్టలు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న  అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read More »

మేడ్చల్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ …

మేడ్చల్ జిల్లా: ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒక మహిళతో పాటు చిన్నారికి గాయాలయ్యాయి. మేడ్చల్ మండలం రాజాబొల్లారం తండాలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి.. మంటలు ఎగిసి పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఒక మహిళతో పాటు చిన్నారికి గాయాలయ్యాయి.

Read More »

షార్ట్‌ సర్క్యూట్‌కు బలైన తల్లీకొడుకులు….

చిత్తూరు : బుధవారం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం గానుగపెంట పంచాయతీ కూనపల్లి గ్రామంలోని శేఖర్‌ అనే వ్యక్తి ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడి తల్లి శంకరమ్మ (75), కొడుకు శేఖర్‌ (50) లు ఇద్దరూ సజీవదహనమయ్యారు. ఇంట్లో నిద్రిస్తుండగా మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో యుపిఎస్‌ బ్యాటరీ పేలుడు సంభవించి మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను …

Read More »

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం…

తిరుపతి: చిన్న బజారు వీధిలోని లలితా మెడికల్ స్టోర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో కొన్ని క్షణాల్లోనే.. లలితా మెడికల్ స్టోర్‌తో పాటు పక్కనే ఉన్న కూల్‌డ్రింక్‌ షాపు పూర్తిగా కాలి బూడిదగా మారాయి. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా షార్ట్ …

Read More »