Breaking News
Home / Tag Archives: sk joshi

Tag Archives: sk joshi

తెలంగాణా కొత్త సీఎస్‌గా

తెలంగాణా: ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న ఎస్‌కే జోషీ ఇవాళ పదవీ విరమణ చేయనున్నారు. దీంతో నేడు మధ్యాహ్నం కొత్త సీఎస్‌ను ప్రభుత్వం నియమించనుంది. ఈ క్రమంలో ఇద్దరి పేర్లు ప్రముఖంగా సీఎస్ రేసులో వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు సోమేశ్ కుమార్ కాగా, మరొకరు అజయ్ మిశ్రా. వీరిద్దరికి సీనియారిటీతో పాటు వివాదాస్పద వ్యక్తులుగా పేరుంది. కొత్త సీఎస్ ఎవరైనా సరే సాయంత్రం నాలుగు గంటలకు బాధ్యతలు చేపటే అవకాశం ఉంది.

Read More »

అధికారులతో సీఎస్ జోషీ భేటీ….

హైదరాబాద్‌ : ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్‌ ఆదేశించారు. కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సమన్వయంతో పని చేయాలని సూచించారు.

Read More »

డెంగ్యూ జ్వరాలపై సీఎస్ సమీక్ష…

హైదరాబాద్: రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సమీక్ష సమావేశం నిర్వహించారు. జ్వరాలు, వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్ సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ… గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యాధుల నియంత్రణపై దృష్టి సారించాలి. క్రిమికీటకాల నుంచి వచ్చే వ్యాధుల నిరోధానికి కార్యాచరణ రూపొందించాలి. జ్వరాలు వచ్చిన చోట వెంటనే చర్యలు తీసుకోవాలి. జ్వరాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలి. …

Read More »

సీఎస్, ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్ నోటీసులు….

ఢిల్లీ: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు జారీచేసింది. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని బీసీ కమిషన్ ఆదేశించింది. ఈ నెల 25న ఢిల్లీలో బీసీ కమిషన్ ముందు పూర్తి నివేదికతో హాజరుకావాలని ఆదేశించింది. ఆర్టీసీ సమ్మెలో జోక్యం చేసుకోవాలని బీసీ కమిషన్‌ను ఆర్టీసీ జేఏసీ కోరింది. కార్మికుల్లో 20 వేలకు పైగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు …

Read More »

ఆ రంగాల అభివృద్ధికి సహకరించండి: జోషి

హైదరాబాద్: రాష్ట్రంలో కెమికల్స్, పెట్రో కెమికల్స్ రంగాల అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి వెల్లడించారు. ఈ క్రమంలో ఆయా రంగాల అభివృద్ధికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర కెమికల్స్, పెట్రో కెమికల్స్ శాఖ కార్యదర్శి పి. రాఘవేంద్రరావు శుక్రవారం జోషిని ఆయన కలిశారు. కెమికల్స్, పెట్రో కెమికల్స్ రంగాల అభివృద్ధి విషయమై రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన ప్రణాళికలను సిద్ధం …

Read More »

సీఎస్ ను కలవనున్న జేఏసీ నాయకులు…

హైదరాబాద్‌: ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలవనున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగుల జేఏసీ నాయకులు సీఎస్‌కు వినతిపత్రం ఇవ్వనున్నారు. ఆర్టీసీ సమ్మెను కూడా పరిష్కరించాలని జేఏసీ నాయకులు సీఎస్‌ను కోరనున్నారు.

Read More »

జాతరలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి….

ములుగు: ఫిబ్రవరి 5 నుండి 8 వరకు మేడారంలో జరిగే సమ్మక్క, సారక్క జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్. కె.జోషి అధికారులను ఆదేశించారు. బి.ఆర్.కె.ఆర్ భవన్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. జాతరకు కోటిమందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి శాఖ తమకు కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకుని భక్తులకు …

Read More »