Breaking News
Home / Tag Archives: social media

Tag Archives: social media

వాట్సాప్ అడ్మిన్‌లకు గమనిక…

కరోనాపై తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్‌లలో హల్‌చల్ చేస్తోంది. ‘రా.గం.12 నుంచి సోషల్ మీడియాలో కరోనాకు సంబంధించిన ఏ విషయమైనా, వీడియో అయినా షేర్ చేసినా, ఫార్వర్డ్ చేసినా చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని సుప్రీం ఆదేశించింది. గ్రూప్ అడ్మిన్‌లు ఈ విషయాన్ని గ్రూప్‌లో తెలియపర్చి, రెండు రోజులు గ్రూప్‌ను క్లోజ్ చేయాలి’ అనేది వార్త సారాంశం. ఇది ఫేక్ మెసేజ్. ఇలాంటివి నమ్మకండి, ఫార్వర్డ్ చేయకండి.

Read More »

సోషల్ మీడియాలో షేర్ చేయకూడనివి..

☞ తెలియని సమాచారం. ☞ తప్పుడు సమాచారం. ☞ తప్పుదారి పట్టించేవి. ☞ విద్వేషాలు రెచ్చగొట్టేవి. ☞ వివాదాలకు కారణమయ్యేవి. ☞ కించపరిచేవి.. అసభ్యకరమైనవి. ☞ వదంతులు.. తప్పుడు వార్తలు. ☞ మార్ఫింగ్‌ చేసిన ఫొటోలు.

Read More »

ప్రేమలో పూజా హెగ్డే?

ఓ బాలీవుడ్ స్టార్ హీరోతో పూజా హెగ్డే డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ స్టార్ నటుడు వినోద్ మెహ్రా కుమారుడైన రోహన్‌ మెహ్రాతో అమ్మడు ప్రేమాయణం నడుపుతోందని టాక్. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు పూజా ఇలా చేయడమేంటని అప్పుడే సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా పూజా ప్రస్తుతం తెలుగులో ప్రభాస్, అఖిల్‌తో.. హిందీలో సల్మాన్‌ఖాన్‌తో సినిమాలు చేస్తోంది.

Read More »

2మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించిన చరణ్…

మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో 2 మిలియ‌న్స్ ఫాలోవర్స్‌ని సంపాదించాడు. కేవ‌లం 67 పోస్ట్‌లు మాత్ర‌మే పోస్ట్ చేసిన చ‌రణ్ ఈ ఘ‌న‌త ద‌క్కించుకోవ‌డం విశేషం. ఎక్కువ‌గా ఫ్యామిలీకి సంబంధించిన పోస్ట్‌లు పెట్టే చ‌ర‌ణ్‌.. అప్పుడప్పుడు సినిమా విశేషాల‌ని కూడా సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తుంటాడు. అటు మరో సోషల్ మీడియా వేదికైన ట్విట్టర్‌లోకి రామ్ చ‌ర‌ణ్ ఈ మధ్య కాలంలోనే అడుగు పెట్టడం తెలిసిందే.

Read More »

మోదీ చెప్పినట్లు చేయాలన్న అమిత్ షా!

ఏప్రిల్ 5వ తేదీన అందరూ ఇంట్లో దీపాలు వెలిగించాలని మోదీ పిలుపునివ్వగా.. దాన్ని ఖచ్చితంగా పాటించాలని అమిత్ షా అంటున్నట్లు కొన్ని మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లాక్‌డౌన్ ఉన్న నేపథ్యంలో మోదీ మాట వినకపోతే.. ‘ఒక రూంలో నుండి మరో రూంకు వెళ్లడానికి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది’ అని అమిత్ షా అన్నట్లు ఉన్న ఓ మీమ్ వైరల్ అవుతోంది. కాగా మోదీ ప్రకటనపై విమర్శలు …

Read More »

మీడియా సంస్థలకు అండగా ఫేస్‌బుక్

కరోనా వైరస్ ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులు వల్ల ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన్న మీడియా సంస్థలను ఆదుకునేందుకు ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ముందుకొచ్చింది. 10 కోట్ల డాలర్లను విరాళంగా ఇవ్వనున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది. ప్రస్తుతం సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో విశ్వసనీయ సమాచారం చాలా ముఖ్యమని, కరోనా గురించి సమాచారం అందించేందుకు మీడియా అసాధారణ పరిస్థితుల్లో పనిచేస్తోందని ఫేస్‌బుక్ వెల్లడించింది.

Read More »

మోదీ ట్వీట్…లాక్‌డౌన్‌ను పాటిస్తామంటున్న నెటిజన్లు

ప్రధాని మోదీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు ప్రధాని పిలుపునివ్వగా.. చాలామంది ఇళ్లలో నుండి బయటకు వస్తున్నారు. ‘నేను మా అమ్మ కడుపులో 9నెలలు ఉన్నా. మీరిప్పుడు 21రోజులు ఉండలేరా?’ అంటూ చిన్నారి ప్లకార్డు పట్టుకున్నట్లు ఉన్న ఫోటోను మోదీ ట్విట్టర్‌లో పెట్టాడు. దీంతో నెటిజన్లు మేం ఇంట్లోనే ఉంటామని, భవిష్యత్తు కోసం లాక్‌డౌన్‌ను పాటిస్తామంటూ కామెంట్ చేస్తున్నారు.

Read More »

కోవిడ్-19పై తప్పుడు సమాచారాన్ని కట్టడి చేసేందుకు ఏకమైన ప్రచురణకర్తలు

న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారిపై ప్రపంచం పోరాడుతూ ఉంటే, ఈ మహమ్మారి గురించి ప్రచారమయ్యే తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు ప్రధాన వార్తా పత్రికల ప్రచురణకర్తలు నడుం బిగించారు. బీబీసీ ఆధ్వర్యంలోని గ్లోబల్ ట్రస్టెడ్ న్యూస్ ఇనీషియేటివ్ కోవిడ్-19 మహమ్మారికి సంబంధించిన తప్పుడు, హానికర సమాచారాన్ని గుర్తించి, ఆ సమాచారం పునర్ముద్రణ కాకుండా కృషి చేస్తోంది. ఈ ఇనీషియేటివ్‌లో ది హిందూ, ఫైనాన్షియల్ టైమ్స్, ది వాల్ స్ట్రీట్ జర్నల్, …

Read More »

చిరంజీవి అభిమానులకు గుడ్ న్యూస్..

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి తన అభిమానులకు ఉగాది ట్రీట్‌ ఇవ్వబోతున్నారు. ఇన్నాళ్లూ సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్న ఆయన బుధవారం నుంచి ఈ మాధ్యమంలోనూ సందడి చేయబోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలిపింది. ‘ఈ ఉగాది ఎంతో ప్రత్యేకం కాబోతోంది. మీ మెగాస్టార్‌ చిరంజీవి తన సోషల్‌మీడియా ఖాతాల ద్వారా మీతో మాట్లాడబోతున్నారు. ఆయన్ను ఫాలో కావడానికి సిద్ధంగా ఉండండి’ అని పోస్ట్‌ చేసింది. …

Read More »

కరోనా కట్టడికి స్వీయ నియంత్రణ పాటించండి…

అమరావతి : కరోనా రాకుండా ప్రజలు సామాజిక దూరం పాటించాలని చంద్రబాబు సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ముందే క్వారంటైన్ చేయాల్సిందని కానీ ప్రభుత్వం ఆలస్యంగా నిద్రలేచిందని తెలిపారు. కరోనా వైరస్‌పై అవగాహనకు సోషల్ మీడియాను వాడుకోవాలన్నారు. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించగలిగితే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. మరోవైపు ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో నిరుపేదలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు.

Read More »