Breaking News
Home / Tag Archives: Sports News

Tag Archives: Sports News

జాక్ ఎడ్వర్డ్స్ కన్నుమూత…

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ జాక్ ఎడ్వర్డ్స్(64) కన్నుమూశారు. ఆయన మరణాన్ని ఆ దేశ సెంట్రల్ డిస్ట్రిక్స్ క్రికెట్ అసోసియేషన్ ధృవీకరించింది. అయితే ఆయన మృతికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. 1974-85 మధ్య కాలంలో క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. 64 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 6 టెస్టులు, 8 వన్డేలు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడింది కేవలం నాలుగేళ్లే అయినా తన ఆటతో బిగ్ హిట్టర్‌గా ఎడ్వర్డ్స్ పేరు …

Read More »

సామాజిక దూరం వల్ల కరోనా దూరం..

కరోనా వైరస్ సోకిన వాళ్లు ఎవరూ అధైర్య పడవద్దని టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తెలిపాడు. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లు మానసికంగా పాజిటివ్‌గా ఉండాలని పిలుపునిచ్చాడు. కరోనా రోగుల పట్ల అందరం ప్రేమతో ఉండాలని.. సామాజిక దూరాన్ని పాటించడం ద్వారానే కరోనా మన మధ్య నుండి దూరమవుతుందని సచిన్ అన్నాడు.

Read More »

ఏ క్రికెటర్ షాట్ మీ ఫేవరెట్?

కొంతమంది క్రికెటర్లు కొట్టే షాట్లు మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తూ ఉంటుంది. తాజాగా ‘క్రిక్ ట్రాకర్’ నలుగురు ఆటగాళ్ల ఫేవరెట్ షాట్ల గురించి ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసింది. సచిన్ ‘స్ట్రైట్ డ్రైవ్’, పాంటింగ్ ‘పుల్ షాట్’, సంగక్కర ‘కవర్ డ్రైవ్’, విలియమ్సన్ ‘బ్యాక్‌ఫుట్ పంచ్’ షాట్‌లో మీకు ఏ షాట్ ఇష్టమని అభిమానులకు ఓ ప్రశ్న వేసింది. దీంతో తమకు ఇష్టమైన షాట్ గురించి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. …

Read More »

సంజయ్‌కు బీసీబీ ఆఫర్…

ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బంపర్ ఆఫర్ ప్రకటించింది. టెస్టుల్లో తమ క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ సలహాదారుడిగా నియమించుకునేందుకు అతడిని సంప్రదించింది. ప్రస్తుతం టెస్టుల్లో బంగ్లాకు మాజీ SA క్రికెటర్ నీల్ మెకెంజీ కన్సల్టెంట్‌గా ఉండగా.. వన్డేల్లోనూ కన్సల్టెంట్‌గా ఉండేందుకు నీల్ ఆసక్తి చూపడం లేదు. దీంతో సంజయ్‌ను సంప్రదించగా, అతడి నిర్ణయం ఇంకా చెప్పలేదు.

Read More »

ధోనీ గురించి ఈ రికార్డు తెలుసా?

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ T20ల్లో భారత్ తరపున అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు భారత్ ఆడిన అన్ని T20 వరల్డ్‌కప్‌ టోర్నీలకు ధోనీ మాత్రమే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఏ ఇతర దేశ ఆటగాడు ఈ రికార్డును నమోదుచేయలేదు. 2007 T20 WCకు నాయకత్వం వహించిన MSD.. 2009, 2010, 2012, 2014, 2016 వరల్డ్‌కప్ టోర్నీలకు కెప్టెన్‌గా కొనసాగాడు. అయితే ఈ ఏడాది జరిగే T20 WCకు …

Read More »

ఫైనల్ ఆడకుండానే టైటిల్ గెలిచారు

ఆస్ట్రేలియాలో జరిగిన దేశవాళీ క్రికెట్ షెఫీల్డ్ టోర్నీలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఈ టోర్నీ ఫైనల్లో న్యూ సౌత్‌వేల్స్, విక్టోరియా జట్ల మధ్య ఫైనల్ జరగాల్సి ఉంది. కానీ కరోనా ప్రభావంతో ఫైనల్ మ్యాచ్ నిర్వహించడానికి వీల్లేకుండా పోయింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్న సౌత్‌వేల్స్ జట్టును విజేతగా ప్రకటించింది. కాగా ఆరేళ్ల తర్వాత న్యూ సౌత్‌వేల్స్ ఛాంపియన్‌గా నిలిచింది.

Read More »

153 బంతుల్లో 222 పరుగులు చేశాడు…?

2002వ సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజు(మార్చి16న) న్యూజిలాండ్ క్రికెటర్ నాథన్ ఆస్టల్ విధ్వంసకర ఆటతో రెచ్చిపోయాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచులో కేవలం 153 బంతుల్లో 222 పరుగులు చేశాడు. దీంతో టెస్టుల్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌‌గా చరిత్ర సృష్టించాడు. కాగా ఈ మ్యాచులో ఇంగ్లాండ్ జట్టు కివీస్‌పై 98 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Read More »

క్రికెట్ హిస్టరీలో అతిగొప్ప రోజు

మార్చి 16, 2012లో అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఢాకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 114 పరుగులు చేయడం ద్వారా సచిన్ ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతకుముందు మార్చి 2011లో సౌతాఫ్రికాపై సచిన్ తన 99వ సెంచరీ పూర్తి చేశాడు. కాగా 2013లో WIతో జరిగిన టెస్ట్ సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు సచిన్ గుడ్‌బై …

Read More »

అలాగైతే.. ఐపీఎల్ రద్దే?

ఐపీఎల్ ఇప్పటికే రెండు వారాలు వాయిదా పడగా, కరోనా ప్రభావం తగ్గకపోతే ఐపీఎల్ పరిస్థితి ఏంటనేది ప్రస్తుతం క్రీడావర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. కరోనా ప్రభావం ఏప్రిల్ తొలి వారానికి తగ్గితేనే టోర్నీ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. లేదంటే విదేశీ పర్యాటకుల వీసాలపై కేంద్రం ఆంక్షలు పెంచొచ్చు. దీంతో విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ కు అందుబాటులో ఉండరు. అలాగే కరోనా ప్రభావం ఇలాగే కొనసాగితే టోర్నీ పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉంది.

Read More »

చెన్నై సూపర్‌‌ కింగ్స్‌ ప్రాక్టీస్‌ రద్దు…

ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ కోసం జోరుగా సమాయత్తం అవుతున్న చెన్నై సూపర్‌‌ కింగ్స్‌కు కరోనా వైరస్‌ షాకిచ్చింది. కరోనా నేపథ్యంలో ఐపీఎల్ ప్రారంభ తేదీ వాయిదా పడగా.. చెన్నై జట్టు ప్రాక్టీస్‌ సెషన్స్‌ కూడా రద్దయ్యాయి. ఈ నెల రెండో తేదీ నుంచి చెన్నై చెపాక్ స్టేడియంలో సీఎస్‌కే జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది. ధోనీతో పాటు సురేశ్ రైనా, అంబటి రాయుడు, మురళీ విజయ్, హర్భజన్ సింగ్‌ తదితర క్రికెటర్లు …

Read More »