Breaking News
Home / Tag Archives: students

Tag Archives: students

అసోంకు 391 మంది విద్యార్థులు

అసోం: లాక్ డౌన్ తో రాజస్థాన్ లోని కోటలో చిక్కుకున్న 391 మంది విద్యార్థులు సురక్షితంగా అసోంకు చేరుకున్నారు. విద్యార్థులంతా ప్రత్యేక బస్సుల్లో చిరాంగ్ కు చేరుకున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తిరిగి ఇంటికి చేరుకోవడం సంతోషంగా ఉంది. ప్రభుత్వం మాకు ఇబ్బందులు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. ప్రభుత్వానికి విద్యార్థులందరి తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఓ విద్యార్థి తెలిపాడు. విద్యార్థులను వారి కుటుంబసభ్యులకు అప్పగిస్తాం. అందరూ 14 రోజులు …

Read More »

ఇటలీ నుంచి విశాఖ విద్యార్థుల రాక

కరోనా నెగెటివ్‌ నిర్ధారణ తరువాత హోం క్వారంటైన్‌కు తరలింపు విశాఖ/వెంకోజీపాలెం: ఇటలీలో చదువుతున్న 33 మంది తెలుగు విద్యార్థులు సోమవారం విశాఖపట్నం చేరుకున్నట్టు కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ తెలిపారు. వీరందరినీ నిబంధనల ప్రకారం ఇండో- టిబెటన్‌ బోర్డర్‌ క్యాంప్‌(ఐటీబీసీ) ఢిల్లీలోని క్యాంపస్‌లో 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచి రెండు సార్లు వారి నుంచి సేకరించిన శాంపిల్స్‌ పరీక్ష చేయగా నెగెటివ్‌ వచ్చిందని తెలిపారు. నెగెటివ్‌ వచ్చిన తరువాత వీరిని బస్సు ద్వారా …

Read More »

జిల్లాకు చేరిన నవోదయ విద్యార్థులు

ఒంగోలు  : చత్తీస్‌గఢ్‌ జవహర్‌ నవోదయ విద్యాలయంలో చదువుతున్న జిల్లా విద్యార్థులను ఒంగోలుకు సురక్షితంగా చేరుకున్నారు. ఒంగోలులో 9వ తరగతి చదువుతున్న జెన్‌వీ విద్యార్థులు 24 మంది మైగ్రేటెడ్‌ స్టడీస్‌ కోసం వెళ్లారు. ఈనెల 20వరకు పరీక్షలు నిర్వహించి, మిగతా పరీక్షలు రద్దు చేసి, సొంత జిల్లాకు పంపించారు. ఆదివారం వారంతా ఒంగోలు చేరకున్నారు. అయితే చత్తీస్‌గఢ్‌కు చెందిన మరో 24 మంది ఒంగోలులోనే ఉండగా, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా …

Read More »

కరోనా ఎఫెక్ట్ : నన్నయ వర్శిటీ విద్యార్థులకు సెలవు

అమరావతి: కోవిడ్-19 ప్రభావంతో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం విద్యార్థులకు సెలవు ప్రకటించినట్లు రిజిస్టర్ ఆచార్య గంగారావు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. కోవిడ్-19 దృష్ట్యా ప్రభుత్వ సూచనల ప్రకారం విశ్వవిద్యాలయ వీసీ పేరుతో ప్రోసిడింగ్‌ను శనివారం సర్క్యులేట్ చేశారు. దీనిపై రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. కోవిడ్-19 ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం, కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్ లతోపాటు అనుబంధ కళాశాలలకు చెందిన విద్యార్థులందరికీ సెలవు ప్రకటించడం జరిగిందని అన్నారు. హాస్టల్లో ఉన్న …

Read More »

విద్యార్థులకు టిప్స్

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఇంటర్ పరీక్షలు కొనసాగుతుండగా, త్వరలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు రాసే విద్యార్థులు ఇలా ప్రిపేర్ అవండి.. ఎలాంటి ఒత్తిడికి గురికాకండి. ఇతరులతో పోల్చుకోకండి. టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోండి. తినే ఆహారంపై దృష్టి పెట్టండి. ఫోన్, టీవీ, చిట్ చాట్‌లకు దూరంగా ఉండండి. మెడిటేషన్, యోగాలాంటివి చేయండి. తగినంత నిద్రపోండి, రోజూ వ్యాయామం చేయండి. ఆత్మవిశ్వాసంతో చదవండి.

Read More »

హాఫ్ డే స్కూల్స్ తేదీ ఖరారు

అమరావతి: రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల్లో ఈనెల 15వ తేదీ నుంచి ‘ఒంటి పూట బడులు’ ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయని రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్‌ వి. చినవీరభద్రుడు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒంటిపూట బడుల సమయంలో అనుసరించాల్సిన విధులను అందులో పేర్కొన్నారు. – ఒంటిపూట బడులపై సమయపట్టికను తప్పనిసరిగా అన్ని పాఠశాలలు అమలు చేయాలి. – ఏప్రిల్‌ రెండో శనివారం …

Read More »

ఇటలీ ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు

హైదరాబాద్: ఇటలీ ఎయిర్‌పోర్టులో తెలంగాణ విద్యార్థులు చిక్కుకున్నారు. కరోనా భయంతో విద్యార్థులను ఎయిర్‌పోర్టులో అధికారులు నిలిపివేశారు. జెనావో ఎయిర్‌పోర్టులో తెలంగాణ విద్యార్థులతో పాటు కేరళ, నాగ్‌పూర్‌, బెంగళూరు విద్యార్థులు ఉన్నారు. ఎంఎస్‌ పూర్తి కావడంతో భారత్‌కు విద్యార్థులు బయల్దేరారు. మెడికల్‌ సర్టిఫికెట్‌ తీసుకొస్తేనే విమానంలోకి అనుమతి ఇస్తామని అధికారులు చెప్పడంతో వారు అక్కడే చిక్కుకుపోయారు.

Read More »

కీచక హెచ్‌ఎం వెకిలి చేష్టలు

చీరాల: విద్యార్థినులకు విద్యాబుద్ధులు నేర్పించి వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడే ఆ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ కీచకుడిలా మారడంతో స్థానికులు ఆ అయ్య వారిని పాఠశాలలోనే చితకబాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన మంగళవారం ఈపురుపాలెంలో జరిగింది. విద్యార్థినుల తల్లిదండ్రులు, పోలీసుల కథనం ప్రకారం.. ఈపురుపాలెం పద్మనాభుని పేట మండల పరిషత్‌ పాఠశాలలో హెచ్‌ఎంగా విధులు నిర్వర్తిస్తున్న జె.నాగభూషణం కొంతకాలంగా మూడు నుంచి ఐదో …

Read More »

విద్యార్థులకు బయోమెట్రిక్ తప్పనిసరి…

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని తప్పనిసరి చేస్తూ జేఎన్టీయూహెచ్ నిర్ణయించింది. కాలేజీలు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే అనుమతులు రద్దు చేసే అవకాశముందని జేఎన్టీయూహెచ్ తెలిపింది. కాలేజీలకు అనుమతులు రావాలంటే బయోమెట్రిక్ తప్పక పాటించాలన్నారు. అటు కొత్త కోర్సులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

Read More »

పాఠశాల విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు

అమరావతి: ఒక తరగతి నుంచి మరో తరగతిలోకి వెళ్లే విద్యార్థుల్లో అవసరమైన ప్రమాణాలు, నైపుణ్యాలుంటేనే పై క్లాసుల్లోని పాఠ్యాంశాలను సులభంగా నేర్చుకోగలుగుతారు. కింది తరగతుల్లోని అంశాల్లో అవగాహన పెంచుకుని ఉంటే పై తరగతుల్లోని అంశాలు సులభంగా ఆకళింపు చేసుకోగల్గుతారు. కానీ, ఇప్పటివరకు విద్యార్థులకు సరిపడ హాజరు ఉంటే చాలు.. పై తరగతుల్లోకి పంపించేస్తున్నారు. దీనివల్ల తరగతులు పెరుగుతున్నా విద్యార్థుల్లో ప్రమాణాలు పెరగడంలేదు. ఈ నేపథ్యంలో.. విద్యార్థుల్లోని సామర్థ్యాలు ఏ మేరకు …

Read More »