Breaking News
Home / Tag Archives: suprem court

Tag Archives: suprem court

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు స్టే

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. 50 శాతాన్ని మించి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని కోర్టు తప్పుబట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాల్సిందిగా ఉన్నతన్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 2010లో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే ఎన్నికలు జరగాలని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ప్రత్యేక పరిస్థితులు లేనందున తీర్పుకు …

Read More »

శబరిమల రివ్యూ పిటిషన్లపై నేటినుంచి ‘సుప్రీం’ విచారణ

శబరిమలలో మహిళల ప్రవేశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం నుంచి రోజువారీ విచారణ చేపట్టనుంది. చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బాబ్డేతో కూడిన 9 మంది సభ్యుల రాజ్యాంగధర్మాసనం వీటినివిచారించబోతోంది. ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు ఆర్.భానుమతి, అశోక్ భూషణ్, ఎల్.నాగేశ్వర రావు, ఎం.ఎం.శాంతనగౌదర్, ఎస్.ఎ. నజీర్, ఆర్.సుభాష్ రెడ్డి, బీ.ఆర్.గవాయ్,సూర్యకాంత్ సభ్యులుగా ఉన్నారు. దాదాపు 60 రివ్యూ పిటిషన్లను ఈ ధర్మాసనం విచారించబోతోంది. వీటిలో…అయ్యప్ప గుడిలో మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ.. 2018 …

Read More »

వాళ్లు బతికేఉన్నారు..

ఢిల్లీ: బిహార్‌ ముజఫర్‌పూర్‌ వసతి గృహంలో బాలికలు ఎవరూ చనిపోలేదని సీబీఐ సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేసింది. వసతి గృహంలో రెండు అస్థిపంజరాలు లభ్యమవగా వాటిని ఫోరెన్సిక్‌ పరీక్షల నిమిత్తం పంపించారు. అయితే అవి వసతి గృహంలోని మైనర్లవి కాదని ఓ మహిళ, పురుషుడికి సంబంధించిన అస్థిపంజరాలని సీబీఐ వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ తరఫున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ హాజరయ్యారు. ముజఫర్‌పూర్‌ వసతి గృహంలోని బాలికలపై లైంగిక …

Read More »

సుప్రీంకోర్టుకు చేరిన ‘జామియా ఆందోళన’

ఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న జామియా మిలియా ఇస్లామియా విద్యార్థుల ఘటన సుప్రీంకోర్టుకు చేరింది. తాజా ఆందోళనల్ని కట్టడి చేసే క్రమంలో విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును న్యాయవాది ఇందిరా జైసింగ్‌ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. దీన్ని సుమోటోగా స్వీకరించాలని కోరారు. దీనికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే నిరాకరించారు. ఇలాంటి పరిస్థితుల్లో కలగజేసుకోలేమని.. తాము శాంతినే కోరకుంటున్నామని స్పష్టం చేశారు. ఇంకా ఘటనలు …

Read More »

సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిర్భయ నిందితుడు

న్యూఢిల్లీ: 2012 నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు నిందితుల్లో ఒకడైన అక్షయ్ సింగ్ ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనకు ఉరిశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ అతడు పిటిషన్ దాఖలు చేశాడు. తనకు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలని కోరేందుకు నిందితుడు తన పిటిషన్‌లో ఓ వింత వాదన కూడా వినిపించినట్టు సమాచారం. ‘‘ఢిల్లీలో వాయు కాలుష్యం, విషతుల్య వాతావరణం కారణంగా ఇప్పటికే ఆయుర్దాయం తగ్గిపోతోంది. అలాంటప్పుడు …

Read More »

ఎన్‌కౌంటర్‌పై మరో పిటిషన్‌

అమరావతి న్యూస్, హైదరాబాద్‌: దిశ అత్యాచారం నిందితుల ఎన్‌కౌంటర్‌పై దాఖలైన పిటిషన్‌ను నేడు (సోమవారం) మధ్యాహ్నాం 2:30 గంటలకు హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ముందుగా ప్రకటించిన మేరకు నేడు ఉదయమే విచారణ జరపాల్సి ఉన్నా.. ఎన్‌కౌంటర్‌పై మరో పటిషన్‌ దాఖలు కావడంతో మధ్యాహ్నానికి వాయిదా వేసింది. రెండు పిటిషన్లు కలిపి విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం తెలిపింది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ జరిపారని మహిళా …

Read More »

సుప్రీంకోర్టు ఏం చెప్తోందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ

మహారాష్ట్ర పంచాయతీపై సుప్రీంకోర్టులో సోమవారం ఉదయం విచారణ ప్రారంభమైంది. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిపై కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ పార్టీ ఆదివారం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను దాఖలు చేశాయి. దేవేంద్ర ఫడ్నవిస్‌ను నవంబర్ 23 న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తూ గవర్నర్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా శివసేన, ఎన్సీపీ పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాయి. అయితే ఆదివారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు సస్పెన్స్‌ను కొనసాగించింది. …

Read More »

మహా ఉత్కంఠ: సుప్రీంలో కీలక విచారణ

న్యూఢిల్లీ: మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీంకోర్టులో సోమవారం ఉదయం విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ను గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీ ఆహ్వానించడాన్ని సవాలు చేస్తూ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఆదివారం సెలవురోజు అయినప్పటికీ విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఫడ్నవీస్‌ను ఆహ్వానిస్తూ గవర్నర్‌ పంపిన లేఖను, ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఫడ్నవీస్‌ …

Read More »

మొదటి సారి సుప్రీంకోర్టు తన కోర్టులో కేసు వేసుకుంది

సుప్రీంకోర్టులో సమాచార హక్కు చట్టం పనిచేస్తుందా, లేక సమున్నత న్యాయస్థానం ఆర్టీఐకి అతీతమా, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంది కనుక సమాచారం ఇవ్వాల్సిన పని లేదా, ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా ఆర్టీఐ పరిధిలోకి రావాలా- అనే అంశాల మీద సుప్రీంకోర్టుకు సందేహాలు వచ్చాయి. వాటిని తీర్చుకోవడానికి సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకుంది. సుప్రీంకోర్టు తన కోర్టులోనే కేసు వేసుకోవడం ఇదే మొదటిసారి కావచ్చు. ఇదొక ప్రత్యేకత. సుప్రీంకోర్టు స్వయంగా కేసు …

Read More »

సంచలనం సృష్టిస్తున్న సుప్రీం కోర్టు

వరుస తీర్పులతో సంచలనం సృష్టిస్తున్న సుప్రీం కోర్టు బుధవారం మరో సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు వ్యవహారాలు కూడా పారదర్శకంగా వుండాలని తేల్చి చెప్పింది. సమాచార హక్కు చట్టం పరిధిలోకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా వస్తుందని బుధవారం అపెక్స్ కోర్టు తీర్పు చెప్పింది. న్యాయవ్యవస్థ కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందంటూ 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును చీఫ్ జస్టిస్ రంజయ్ గొగోయ్ సారథ్యంలో …

Read More »