Breaking News
Home / Tag Archives: supreme court

Tag Archives: supreme court

న్యాయవాది ముఖుల్ రోహత్గీకి సుప్రీం అక్షింతలు

న్యూఢిల్లీ: కర్ణాటక శాసనసభలో వెంటనే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని మనవి చేస్తూ రెబల్ ఎమ్మెల్యేలు సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇంతలో మంగళవారం కుమారస్వామి ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్షలో ఓడిపోవడం… ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగిపోయాయి. దీంతో తమ ఆర్జీని వెనక్కి తీసుకోవడానికి అనుమతించాలంటూ సుప్రీం కోర్టును రెబల్ ఎమ్మెల్యేలు అభ్యర్థించిన సమయంలో .. అత్యున్నత న్యాయస్థానం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ‘‘మీకు అవసరం వచ్చినప్పుడు అర్ధరాత్రైనా …

Read More »

అంగవైకల్యాన్ని ఓడించిన కోర్టు తీర్పు

అహ్మదాబాద్: గుజరాత్‌లోని భావనగర్‌కు చెందిన గణేశ్ కు 2018 నాటికి వయసు 17 ఏళ్లు, ఎత్తు 3 అడుగులు, బరువు 14 కిలోలు మొత్తంగా 70 శాతం దివ్యాంగుడు కావడంతో 2018లో నీట్ పరీక్షలో 223వ ర్యాంకు దక్కినప్పటికీ అతనికి మెడికల్ కాలేజీలో సీటు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడాది అతనికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు దక్కింది. ప్రస్తుతం గణేశ్‌ 18 ఏళ్లు వయసుతో మూడడుగల …

Read More »

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం షాక్

హైదరాబాద్: సుప్రీం తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టని ఎమ్మెల్సీ రాములు నాయక్ చెప్పారు. గవర్నర్ కోటా కింద ఏ పార్టీకి సంబంధం లేకుండా సామాజిక కార్యకర్తగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యానని ఆయన చెప్పుకొచ్చారు. తనకు తప్పక న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని రాములు నాయక్ పేర్కొన్నారు. ఈ విషయంలో తుది తీర్పు వచ్చేవరకు ఎమ్మెల్సీ ఎన్నిక జరపొద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిందని, తెలంగాణ ప్రభుత్వానికి, మండలి చైర్మన్‌కు కోర్టు నోటీసులు ఇచ్చిందని …

Read More »

ఆ ప్రాజెక్టు నిర్వాసితులకు నిరాశ…

న్యూఢిల్లీ: కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్వాసితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రాజెక్టు నిర్వాసితులు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. పరిహారం చెల్లింపుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్వాసితులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే దీనిని పరిశీలించిన ధర్మాసనం అదనపు పరిహారం సహా ఇతర వినతులపై హైకోర్టుకే వెళ్లాలని పిటిషనర్లకు సూచించింది.

Read More »

మధ్యవర్తిత్వ కమిటీకి మరింత సమయం

న్యూఢిల్లీ: అయోధ్య కేసులో మధ్యవర్తిత్వ కమిటీకి జూలై 31 వరకు గడువు ఇచ్చి, ఆగస్ట్ 1న నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి కార్యాచరణను ఆగస్ట్ 2న చేపడతామని కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. గత విచారణ సమయంలో జూలై 18న నివేదిక అందించాలంటూ మధ్యవర్తిత్వ కమిటీని ధర్మాసనం ఆదేశించినప్పటికీ ఇవాళ ఆ గడువును మరికొంతకాలం పెంచింది. మధ్యవర్తిత్వ కమిటీలో సుప్రీం మాజీ జడ్జి ఎఫ్ఎంఐ కలీఫుల్లా, …

Read More »

ఆశారాంకు బెయిలు నిరాకరించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ బెయిల్ అభ్యర్థనను సుప్రీంకోర్టు సోమవారంనాడు తోసిపుచ్చింది. గుజరాత్‌లోని ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారన్న అభియోగాలను ఆశారాం ఎదుర్కొంటున్నారు. ఈ కేసులోనే ఆయన బెయిలు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎన్‌వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు రాగా, గుజరాత్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదన వినిపించారు. ఈ కేసులో విచారణ జరుగుతోందని, ఇంకా …

Read More »

విద్యుత్ ఉద్యోగుల పంపకాలపై సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ ఉద్యోగుల పంపకాలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ధర్మాధికారి కమిటీ మార్గదర్శకాలపై తెలంగాణ విద్యుత్ కార్పొరేషన్ ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉద్యోగులందరికీ ఆప్షన్లు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. మార్గదర్శకాలను కాకుండా తుది కేటాయింపులపై సవాల్ చేసుకోవచ్చని పిటిషనర్లకు సూచించింది.

Read More »

‘అయోధ్యపై సుప్రీం విచారణ తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ’

గుంటూరు: అయోధ్యపై సుప్రీం విచారణ తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ జాయింట్‌ సెక్రటరీ మన్మోహన్‌ వైద్య చెప్పారు. పర్యావరణంపై దేశ ప్రజలను చైతన్యపరుస్తామన్నారు. ప్లాస్టిక్‌ వాడకం తగ్గింపు, నీటి సంరక్షణ కోసం ఉద్యమాలు చేస్తామని ఆయన తెలిపారు. దేశంలోని 3వేల గ్రామాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మతం మారిన వాళ్లు వాస్తవాలు తెలుసుకుని తిరిగి రావాలని కోరుతున్నామని మన్మోహన్‌ వైద్య పేర్కొన్నారు.

Read More »

సుప్రీమ్ తీర్పుకు భిన్నంగా వ్యవహరిస్తున్న అమెజాన్, షియోమీ

సుప్రీంకోర్టు 2018లో ఆధార్ కార్డ్ విషయంలో ఒక స్పష్టమైన ప్రకటన చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త సిమ్ కార్డులు, బ్యాంకు అకౌంట్ల వెరిఫికేషన్, ఇతర అంశాలకు ఆధార్ కార్డు డిమాండ్ చేయొద్దని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే చైనాకి చెందిన షియోమి సంస్థ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. చైనా వస్తువులను నేరుగా ఇండియాలో అమ్మే ‘షేర్ సేవ్’ అనే అప్లికేషన్ ద్వారా కస్టమ్స్ క్లియరెన్స్ కోసమంటూ వినియోగదారులను ఆధార్ …

Read More »

కర్నాటక రాజకీయ హైడ్రామాలో కొత్త ట్విస్ట్

బెంగళూరు: కర్నాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం ఇవాళ మరింత రసవత్తరంగా మారింది. అటు అసమ్మతి ఎమ్మెల్యేలు, ఇటు స్పీకర్ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుండగా… ఇవాళ ముగ్గురు ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యేందుకు స్పీకర్ రమేశ్ కుమార్ అంగీకరించారు. ఐదుగురు రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో… ‘‘సరైన ఫార్మాట్‌’’లో రాజీనామాలు చేసిన ముగ్గురికి స్పీకర్ నుంచి పిలుపు అందింది. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశం జరగనుంది. తాజా భేటీ …

Read More »