Breaking News
Home / Tag Archives: suryapet

Tag Archives: suryapet

సూర్యాపేటలో తొలి కరోనా మరణం…

సూర్యాపేట: జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. కాసరబాద గ్రామానికి చెందిన 4 నెలల బాలుడు కరోనాతో గాంధీ ఆస్పత్రిలో నేడు మృతి చెందాడు. మృతదేహాన్ని జీహెచ్ఎంసీ పరిధిలోనే ఖననం చేసే అవకాశం ఉంది. కరోనా పాజిటివ్‌తో పాటు బాలుడి గుండెకి హోల్‌ ఉందని వైద్యులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు బాలుడి కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్‌ చేశారు.

Read More »

సూర్యాపేటలో పెరిగిన కరోనా కేసులు….

సూర్యాపేట: జిల్లాలో కరోనా బారిన పడిన వారిలో ముగ్గురు బాధితులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాలో మొత్తం 83 పాజిటివ్ కేసులు నమోదు అవగా, ఇప్పటి వరకు 62 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 21 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగింది. నిన్న ఒక్క రోజే GHMC లో మొత్తం 79 కేసులుపాజిటివ్ కేసులు నమోదు …

Read More »

అష్టా చమ్మా ఎంత పని చేసిందంటే..

సూర్యాపేట : కరోనా వైరస్‌ ఎంత ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతుందో మరోసారి నిరూపితమైంది. ఓ మహిళ అష్టా చమ్మా ఆడటం ద్వారా 31 మందికి కరోనా సోకింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ కరోనా చాప కింద నీరులా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి …

Read More »

సూర్యాపేటలో లాక్‌డౌన్ కఠినంగా అమలు..

సూర్యాపేట : జిల్లాలో 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదుతో అవడంతో పోలీసులు లాక్‌డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు బయటకు రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లతో మూసివేశారు. దీంతో సూర్యాపేట వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. రెడ్ జోన్ ప్రాంతాలు, గ్రామాల్లో ఆంక్షలు కఠినతరం చేశారు.

Read More »

సూర్యాపేట జిల్లాలో భారీగా కరోనా కేసులు…

సూర్యాపేట: జిల్లాలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు సమాచారం. మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటన వెలువడనుంది. కరోనా వైరస్ గ్రామాలకు పాకింది. ఇప్పటికే జిల్లాలో 54 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మూడు రోజుల తర్వాత ఒక్కసారిగా 24 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో 78 కేసులతో రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా రెండో స్థానంలో ఉంది. తాజాగా ఆత్మకూరు మండలం …

Read More »

కరోనా ఎఫెక్ట్: కోళ్లు ఉచితం

కరోనా ఎఫెక్ట్‌తో దేశంలో కోళ్ల పరిశ్రమకు భారీగా నష్టాలు వచ్చాయి. భయంతో జనం చికెన్ తినాలంటే భయపడుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ రేటు అమాంతం పడిపోగా, పలుచోట్ల కేజీ చికెన్ రూ.40కి, రూ.30కి, రూ.20కి కూడా అమ్ముతున్నారు. అటు కోళ్ల దాణా ఖర్చు భరించలేక సూర్యాపేట జిల్లా రామాపురంలో ఏకంగా కోళ్లను ఉచితంగా ఇచ్చారు. నిన్న, ఇవాళ వేల కోళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. – చికెన్ వల్ల …

Read More »

సూర్యాపేటలో దారుణం….

సూర్యాపేట: తిరుమలగిరి మండలం రాఘవాపురంలో దారుణం జరిగింది. ఉన్మాది వెంకటేశ్‌.. యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. దీంతో యువతికి తీవ్రగాయాలయ్యాయి. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. రెండేళ్లుగా ప్రేమ పేరుతో యువతిని వెంకటేశ్‌ వేధిస్తున్నాడు. యువతి పెళ్లికి నిరాకరించడంతో ఉన్మాది ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read More »

సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం…

చిలుకూరు: సూర్యాపేట జిల్లా చిలుకూరు మిట్స్ కాలేజ్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిండి. ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళా కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే హుజూర్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిరపకాయల కూలీకి చిలుకూరు నుంచి మల్లారెడ్డి గూడెంకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read More »

నేరేడుచర్ల మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ విజయం…

సూర్యాపేట: నేరేడుచర్ల మున్సిపాలిటీని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఎక్స్‌అఫిషియో ఓట్లతో చైర్మన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. చైర్మన్‌గా చందమల్ల జయబాబు, వైస్‌ చైర్మన్‌గా చల్లా శ్రీలత ఎన్నికయ్యారు. చైర్మన్‌ ఎన్నికను కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌, ఆ పార్టీ సభ్యులు బాయ్‌కాట్‌ చేశారు. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందంటూ ఆరోపించారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఓటుతో టీఆర్‌ఎస్‌ బలం 11కు చేరుకుంది. ఉత్తమ్‌, కేవీపీతో కాంగ్రెస్‌ ఓట్లు 10కు చేరుకున్నాయి.

Read More »

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం…

కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం పరిధిలోని దొరకుంట ఎఫ్‌సీఐ గోదాం వద్ద తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు ఓవర్‌టేక్ చేయబోయి లారీని వెనకాల నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More »