Breaking News
Home / Tag Archives: tadepalligudem

Tag Archives: tadepalligudem

తాడేపల్లిగూడెంలో మరో వ్యక్తికి కరోనా

పశ్చిమగోదావరి: జిల్లాలోని తాడేపల్లిగూడెంలో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యలు నిర్ధారించారు. తాడేపల్లిగూడెంలో తొలి అనుమానిత వ్యక్తి బంధువుకు కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా పాజిటివ్ బాధితుడి ఇంటి ప్రాంతాన్ని అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు.

Read More »

పాత పద్ధతినే కొనసాగించండి.. ప్రభుత్వం తాజా ఉత్తర్వులు

– వంట కష్టాలకు తెర – సొంతంగా కాంట్రాక్టు కుదుర్చుకునేలా ప్రభుత్వ ఆదేశాలు – ఊపిరి పీల్చుకున్న గురుకులాలు – కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఏజన్సీల నియామకం తాడేపల్లిగూడెం-: గురుకుల పాఠశాలల్లో వంట కష్టాలకు తెరపడనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఏజన్సీకి వంట బాధ్యతలు అప్పగించే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. క్షేత్ర స్థాయిలో ప్రతి గురుకుల పాఠశాలలో సొంతంగానే కాంట్రాక్టర్‌ కుదుర్చుకునేలా ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఏజన్సీలను …

Read More »

తల్లిదండ్రులను హతమార్చిన కొడుకు….

తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గ్రామీణ మండలం కడియంలో దారుణం చోటు చేసుకుంది. మతి స్థిమితం లేని వ్యక్తి తల్లిదండ్రులను రాడ్డుతో కొట్టిచంపి పరారయ్యాడు. మానసిక స్థితి సరిగా లేదని కొంతకాలం క్రితం జాలపర్తి రమేశ్‌(28)ను అతడి భార్య వదిలేసి వెళ్లిపోయింది. తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్న రమేశ్‌.. తల్లిదండ్రులు నాగేశ్వరరావు, మార్తమ్మపై ఇనుపరాడ్డుతో కొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. కేకలు విని ఇరుగుపొరుగువారు అక్కడికి రావడంతో రమేశ్‌ పరారయ్యాడు.

Read More »

అతడు కొడుకు కాదు కాలయముడు…!

పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో జాలపర్తి రమేష్‌ అనే వ్యక్తి తల్లిదండ్రులను దారుణంగా కొట్టిన సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో తండ్రి నాగేశ్వరరావు, తల్లి మార్తమ్మలు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే రమేష్‌కు మతిస్థిమితం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read More »

పశ్చిమ గోదావరిలో ఎస్వీఆర్‌ విగ్రహావిష్కరణ…

పశ్చిమ గోదావరి : ఈ నెల 6న పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని టాలీవుడ్‌ అగ్ర హీరో చిరంజీవి ఆవిష్కరించనున్నారు. స్థానిక ఎస్వీఆర్‌ సర్కిల్‌, కేఎస్‌ రోడ్‌లో విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అభిమానులందరూ హాజరు కావాల్సిందిగా అఖిల భారత చిరంజీవి యువత రవణం స్వామినాయుడు ఓ ప్రకటనలో తెలిపారు.

Read More »