Breaking News
Home / Tag Archives: tdp chief chandrababu naidu

Tag Archives: tdp chief chandrababu naidu

బాబు తిరుపతి పర్యటనలో అపశ్రుతి….

తిరుపతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తిరుపతి పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. రేణిగుంట నుంచి చంద్రగిరి వెళ్తున్న టీడీపీ కార్యకర్తల వాహనం ఢీకొని ఒకరు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రున్ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మామండూరు సమీపంలోని శ్రీదేవిరెడ్డి గార్డెన్స్‌లో నేటి నుంచి మూడు రోజులపాటు టీడీపీ విస్తృతస్థాయి సమావేశాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చంద్రగిరికి వెళ్తున్నారు.

Read More »

గీతాంజలి మృతి పట్ల మాజీ సీఎం సంతాపం….

ఫిల్మ్ న్యూస్: సీనియర్ నటి గీతాంజలి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపాన్ని తెలియజేశారు. “ఎన్టీఆర్ దర్శకత్వంలో ‘సీతారామ కళ్యాణం’ చిత్రంలో సీతగా నటించి ప్రేక్షక హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరుచుకుని, ఆ తర్వాత హాస్యనటిగా రాణించిన నటీమణి గీతాంజలిగారి మరణం విచారకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ” చంద్రబాబు ట్వీట్ …

Read More »

రాజధానిపై ఆ నేతలు తలోరకంగా మాట్లాడుతున్నారు……

విజయవాడ: విజయవాడ ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన పార్టీ విస్త్రృతస్థాయి సమావేశంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని, రాజధానిపై వైసీపీ నేతలు తలోరకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజధానిని మారుస్తానని సీఎం చెప్పడం ఏంటని ప్రశ్నించారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని, టీడీపీను ఎవరూ ఏమీ చేయలేరని ఆయన అన్నారు. కార్యకర్తలకు పూర్తిగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. …

Read More »

వారిద్దరూ సీమలో పుట్టడం దౌర్భాగ్యం: బీజేపీ

కర్నూలు: నేడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో పాలన సరిగ్గా లేదని, చంద్రబాబు, జగన్ రాయలసీమకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్, చంద్రబాబు సీమలో పుట్టడం దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. రాయలసీమ అభివృద్ధి కోసం సీమలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని, ఇక్కడ బీజేపీకి ఒక్క సీటు రాకపోయిన ఇక్కడి హక్కుల సాధనపై బీజేపీ చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. రాయలసీమ హక్కుల …

Read More »

శ్రీకాకుళం చేరుకున్న టీడీపీ అధినేత….

శ్రీకాకుళం: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం శ్రీకాకుళానికి చేరుకుని, ఎర్రన్నాయుడు విగ్రహానికి నివాళులర్పించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలేశారు. అనంతరం ఆయన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు.

Read More »

టీడీపీ అధినేతపై పోలీసులకు ఫిర్యాదు….

గుంటూరు: పోలీసు వ్యవస్థను కించపరిచేలా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేత వర్ల రామయ్య లు మాట్లాడుతున్నారంటూ గుంటూరు జిల్లా అరండల్ పేట పోలీసు స్టేషన్లో వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, విడదల రజని, మహ్మద్ ముస్తఫా తదితరులు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, వర్ల రామయ్య పోలీసుల ఆత్మా స్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని, డీజీపీపైనా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన తప్పులను సమర్ధించుకోకుండా సరిదిద్దుకోవాలని హితవు …

Read More »

ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారు:బాబు

గుంటూరు: గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరతతో 30 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, మద్యానికి జె-ట్యాక్స్‌ విధిస్తున్నారని మండిపడ్డారు. సచివాలయ ఉద్యోగాల్లో ప్రశ్నపత్రం టైప్‌ చేసిన వాళ్లకే ప్రథమ ర్యాంకు వచ్చిందని ఎద్దేవా చేశారు. ఐదు నెలల్లో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారని, వర్షాకాలంలోనే విద్యుత్‌ కోతలు విధిస్తున్నారని దుయ్యబట్టారు.

Read More »

నేడు పార్టీ నేతలతో టీడీపీ అధినేత భేటీ…

గుంటూరు: నేడు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, పలు కార్యక్రమాలపై చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించనున్నారు.

Read More »

బాబుకు కృతజ్ఞతలు తెలిపిన వర్ల…

గుంటూరు: గురువారం నాడు టీడీపీ నేత వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పొలిట్ బ్యూరోలో అవకాశం కల్పించినందుకు అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. దళితులకు పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని చంద్రబాబు మరోసారి రుజువు చేశారని, గత ఎన్నికల్లో తప్పు చేశామనే భావన ఈ 4నెలల్లోనే మాదిగ సామాజిక వర్గానికి అర్ధమైందని పేర్కొన్నారు. మాదిగ సామాజిక వర్గం పూర్తిస్థాయిలో తిరిగి తెలుగుదేశానికి మద్దతుగా ఉంటోందని వర్ల చెప్పుకొచ్చారు.

Read More »

21, 22 తేదీల్లో టీడీపీ అధినేత పర్యటన…

శ్రీకాకుళం: ఈ నెల 21, 22 తేదీల్లో టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారని ఆ పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావు తెలిపారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. అధికార పార్టీ నేతలు విపక్ష నేతలను వేధిస్తున్నారని ఆరోపించారు. బోటు ప్రమాదంపై జ్యుడిషియల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు.

Read More »