Breaking News
Home / Tag Archives: Telangana Government

Tag Archives: Telangana Government

తెలంగాణలో ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలు వాయిదా

తెలంగాణలో ప్రవేశ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు హైకోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో బుధవారం నుంచి జరగాల్సిన ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. ఎంసెట్, పాలిసెట్, ఐసెట్, ఈసెట్, పీజీ ఈసెట్, లాసెట్, పీజీ ఎల్ సెట్, ఎడ్ సెట్, పీఈ సెట్ వాయిదా పడ్డాయి. ఇప్పటికే కరోనా పరీక్షల …

Read More »

ఏపీ సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..

ఏపీ సచివాలయ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ ఊరట కలిగించింది. హైదరాబాద్‌ లో ఉన్న ఏపీ సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉద్యోగుల సమస్యలను లేఖ ద్వారా తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ సీఎస్ నీలం సాహ్ని హైదరాబాద్‌లో చిక్కుకుని విధులకు తమ ఉద్యోగులకు విధులకు రాలేకపోతున్నారని, ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం వేసే బస్సులకు అనుమతి ఇవ్వాలని …

Read More »

షూటింగ్స్ కు అనుమతి…

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్స్‌కు, నిర్మాణానంతర కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టాలీవుడ్‌ సినీ ప్రముఖులు కలిశారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధర్వంలో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్‌, ఎస్.ఎస్‌. రాజమౌళి, దిల్‌రాజు, త్రివిక్రమ్‌, ఎన్‌. శంకర్‌, రాధాకృష్ణ, సి. కల్యాణ్‌, సురేశ్‌బాబు, కొరటాల శివ, జెమిని కిరణ్‌, మెహర్‌ రమేశ్‌, ప్రవీణ్‌బాబు తదితరులు …

Read More »

ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడొద్దు…

ఖమ్మం: కరోనా విషయంలో ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క కోరారు. ఇతర రాష్ట్రాల వారిని 14 రోజుల క్వారంటైన్‌ తర్వాతే గ్రామాల్లోకి అనుమతించాలని సూచించారు. మహదేవపురంలో కరోనా పాజిటివ్‌ రావడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. క్వారంటైన్‌లో ఉన్న వారికి ప్రభుత్వమే నిత్యావసర సరుకులు అందించాలని డిమాండ్ చేశారు.

Read More »

తెలంగాణలో రేపటి నుంచే ఆర్టీసీ బస్సులు…

హైదరాబాద్: తెలంగాణలో రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే బస్సుల్లో 50శాతం ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉంటుంది. కంటైన్‌మెంట్ జోన్లు మినహా అన్ని జిల్లాలో ఆర్టీసీ సర్వీసులు నడిపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే బస్సులను జేబీఎస్‌ వరకే అనుమతించనున్నారు. వరంగల్‌ వెళ్లే …

Read More »

తెలంగాణలో మాస్కుల వాడకం తప్పనిసరి…

తెలంగాణ వ్యాప్తంగా మాస్కుల వాడకాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇళ్ల నుంచి ఎవరు బయటకు వచ్చినా.. తప్పకుండా మాస్కులు ధరించాలంది. లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్ వచ్చిన ఘటనల నేపథ్యంలో.. మాస్కుల వినియోగాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కాగా మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Read More »

తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే 10 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59కి చేరిందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇవాళ ఒక్కరోజే 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. మరో 25 వేల మంది క్వారంటైన్‌లో ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ సంఖ్య దారుణంగా పెరిగేదని చెప్పారు. కరోనాను అడ్డుకోవాలంటే ప్రజలు ఇలాగే సామాజిక దూరం, స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. దయచేసి ప్రజలు ఇవి పాటించాలని కేసీఆర్ కోరారు.

Read More »

కిరాణా షాపులకు కీలక ఆదేశాలు…

మార్చి 31 వరకూ లాక్‌డౌన్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. రోజూ సా.7 గంటల నుంచి ఉ.6 గంటల వరకు నిత్యావసర సరుకులు అందించే షాపులు, కూరగాయల షాపులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. షాపుకు వచ్చే ప్రజల మధ్య సామాజిక దూరం ఉండాలని.. షాపుల వద్ద 4 అడుగుల దూరం ఉండేలా చూడాలని, ప్రజలంతా ఒకే దగ్గర ఉంటే షాపు యజమానిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. షాపుల దగ్గర …

Read More »

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం…

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లలో రిటైర్డైన డాక్టర్లు, నర్సులకు పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. మూడు నెలల కోసం కాంట్రాక్టు పద్ధతిలో వారిని విధుల్లోకి తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కాగా ఇప్పటివరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది.

Read More »

అవసరమైతే షట్ డౌన్: కేసీఆర్

కరోనా నిర్మూలనకు అవసరమైతే రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రం షట్ డౌన్ కూడా చేస్తామని పేర్కొన్నారు. కరోనా ప్రభావంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి ఏర్పడితే, ప్రతి ఇంటికి రేషన్ పంపేలా ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు. రేపు సా.గం.5కు ఇంట్లో చప్పట్లు కొట్టి ఐక్యతను చాటాలన్నారు. అటు ప్రధాని మోదీని అవమానించేలా పోస్ట్‌లు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Read More »