Breaking News
Home / Tag Archives: telangana state

Tag Archives: telangana state

ప్రముఖ దళిత ఉద్యమకారుడు మృతి….

హైదరాబాద్: ప్రముఖ దళిత ఉద్యమకారుడు కస్కుర్తి రామలింగం (49) మృతి చెందారు. ఈ నెల 9న రైలు ఎక్కుతూ రామలింగం జారిపడ్డారు. గాయపడిన ఆయన నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. వామపక్ష, కుల విముక్తి ఉద్యమాల్లో రామలింగం క్రియాశీలంగా పనిచేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు దగ్గర అనంతవరంలో శుక్రవారం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. రామలింగం మృతిపై దళిత సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన మృతి …

Read More »

ప్రభుత్వంపై ధ్వజమెత్తిన కోదండరాం….

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రొఫెసర్ కోదండరాం సంఘీభావం ప్రకటించిన సందర్భంగా మాట్లాడుతూ ‘ఆర్టీసీ నష్టాల్లో ఉందంటూ పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ సంవత్సరం ప్రభుత్వాదాయం ఎందుకు పడిపోయిందో సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తలకు రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారని సీఎంపై మండిపడ్డారు. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై ఉద్యోగులు యుద్ధానికి సిద్ధమవుతున్నారని కోదండరాం ఈ సందర్భంగా వెల్లడించారు. …

Read More »

నేడు సైదిరెడ్డికి మద్దతుగా సీఎం ప్రచారం…

హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌లో ఈ నెల 21న ఉపఎన్నిక జరగనుండగా సీఎం కేసీఆర్‌ ప్రచారం నిర్వహించనున్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు హుజూర్‌నగర్ గుట్ట సమీపంలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగిస్తారు. ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేసీఆర్‌ తమ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి తరపున స్వయంగా ప్రచారానికి దిగడం గమనార్హం.

Read More »

మంత్రి ఇల్లు ముట్టడికి యత్నం….

కరీంనగర్: ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభమై రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెను మరింత ఉధృతం చేస్తున్నారు. కరీంనగర్‌లో ఆర్టీసీ కార్మికులు ఆందోళన నిర్వహిస్తూ మంత్రి గంగుల కమలాకర్‌ ఇల్లు ముట్టడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు.

Read More »

మద్యం షాపుల టెండర్లకు భారీ స్పందన…

హైదరాబాద్: తెలంగాణలో మద్యం షాపుల టెండర్లకు భారీ స్పందన లభిస్తోంది. 2,216 మద్యం షాపులకు ఇప్పటివరకు 37 వేల దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులతో ప్రభుత్వానికి రూ.700 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెల 18న లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయిస్తారు. తెలంగాణలో మద్యం షాపులకు బంధువులు, స్నేహితుల ద్వారా ఏపీ వ్యాపారులు కూడా టెండర్లు వేశారు.

Read More »

సోషల్ మీడియాలో కొండంగి వీడియో వైరల్….

సూర్యాపేట: సూర్యాపేటలో ఓ కొండంగి మనుషులతో తిరుగుతూ ఆకలి, దాహార్తిని తీర్చుకుంటోంది. ఈ క్రమంలోనే కొత్త బస్టాండ్ సమీపంలోని శ్రీహర్ష వైన్స్‌లోకి కొండంగి వచ్చింది. మందు గ్లాసు ఉన్న టేబుల్‌పై కూర్చుంది. ఇంతలో కొండంగి ముందు ఓ మందు గ్లాసు పెట్టారు. అసలే దాహంతో ఉన్న కొండంగి గ్లాసులో ఉన్న మందును గడగడా తాగేసింది. మందుబాబు అందించిన స్టఫ్‌ను కూడా తీసుకుని తినేసింది. తర్వాత మెల్లగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. …

Read More »

భయపడేది లేదు తాడోపేడో తేల్చుకుంటాం….

ఖమ్మం: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానవ హక్కుల్ని కాలరాస్తున్నారని, ప్రజాస్వామ్యం మంటగలిపేలా ఆయన చర్యలున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌నేత, మాజీ ఎంపీ రేణుకాచౌదరి ఆరోపించారు. ప్రశ్నించే వారిని అణిచి వేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మంత్రులు సైతం గొర్రెల్లా ఉన్నారని, ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేసీఆర్‌ పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్నారంటూ రేణుకా విమర్శించారు. రవాణా వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేశారని, కుక్క చనిపోతే కేసు పెట్టిన కేసీఆర్ జనం చచ్చిపోతే మాట్లాడరా? అని …

Read More »

నేడు హైకోర్టులో మద్దిలేటి కేసు విచారణ….

హైదరాబాద్: మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ టీపీఎఫ్ కార్యాలయం నుంచి ప్రజా ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణ, టీవీవీ అధ్యక్షుడు మద్దిలేటిని అరెస్టు చేసిన పోలీసులు నేడు హైకోర్టులో పరచనున్నారు. ఈ కేసుపై నేడు కోర్టులో విచారణ జరగనుంది. మద్దిలేటి బంధువులు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసి టీపీఎఫ్ కార్యాలయంలో ఉన్నవారిని అక్రమంగా అరెస్టు చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు.

Read More »

నేటితో ముగియనున్న వాటి దరఖాస్తు గడువు…

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ దాఖలుకు దరఖాస్తు గడువు నేటితో ముగియనున్నది. మంగళవారం ఒక్కరోజే 10 వేల దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది. ఈ నెల 9 నుంచి మంగళవారం వరకు అందిన మొత్తం దరఖాస్తుల సంఖ్య 20,630కి చేరినట్టు సమాచారం. దరఖాస్తులు స్వీకరించేందుకు 33 జిల్లాల్లో 34 కేంద్రాలను నెలకొల్పారు. టెండర్లు దాఖలు చేసేవారు నిర్దేశించిన విధంగా ఫారం-ఏ3 (ఏ)లో దరఖాస్తు చేసుకోవాలి. నాన్ రీఫండబుల్ ఫీజు కింద …

Read More »

ఎవరు పిలిచినా చర్చలకు సిద్ధం: ఐకాస నేత

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు ముగిసిన అనంతరం ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేత అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పిలిచినా, యాజమాన్యం పిలిచినా తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని, ప్రస్తుతానికి సమ్మె యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం మైండ్‌గేమ్‌ ఆడుతోందని, ఎంపీ కేకే సహా ఎవరూ తమతో మాట్లాడలేదన్నారు. అన్ని విషయాలు ఈనెల 18న తమ న్యాయవాది ద్వారా హైకోర్టుకు వివరిస్తామని తెలిపారు. కార్మికులతో చర్చించి …

Read More »