Breaking News
Home / Tag Archives: telangana

Tag Archives: telangana

శాసన మండలిలో పతాకావిష్కరణ చేసిన విద్యాసాగర్

హైదరాబాద్‌: తెలంగాణ శాసన మండలిలో 73వ స్వాతంత్య్ర వేడుకలు జరిగాయి. మండలి డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

రాగల 48 గంటల్లో మోస్తరు వర్ష సూచనలు

న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడంతో సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తున ఉపరితల ఆవర్తనం విస్తరించింది. రాగల 48 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ, కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Read More »

సచివాలయాన్ని ముట్టడిస్తామంటున్న కాంగ్రెస్ నేత

హైదరాబాద్: కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిని కలిసి తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగోలేదని కేంద్రవర్గాలు చెబుతున్నాయని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొడుకును సీఎం చేసేందుకే కేసీఆర్ కొత్త సచివాలయ నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తూ పాత సచివాలయం కూల్చివేతను విరమించుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర అప్పులు పెరిగిపోయాయని, ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త సచివాలయం అవసరమా? అని ఆయన కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు …

Read More »

దిగొచ్చిన చికెన్‌ ధరలు.. ….

నగరంలో తగ్గిన వినియోగం శ్రావణమాసం ప్రభావం కిలో ధర రూ.170 మాత్రమే హైదరాబాద్‌ : కొండెక్కిన కోడి ధర దిగొచ్చినా తినేందుకు నగరవాసులు పోటీపడడం లేదు. నెలరోజుల క్రితం సుమారు రూ.280 వరకు కిలో చికెన్‌ ధర పలికింది. ఆ సమయంలోనే తినేందుకు పోటీపడ్డారు. ప్రస్తుతం స్కిన్‌లెస్‌ చికెన్‌ కిలో ధర రూ.170కు దిగొచ్చినాచికెన్‌ షాపుల వద్ద జనాలే లేరు. శ్రావణ మాసం కావడంతో మాంసాహారానికి అత్యధిక మంది నగరవాసులు …

Read More »

బక్రీద్‌ ప్రార్థనలు.. రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ : బక్రీద్‌ సందర్భంగా మీర్‌ఆలం ట్యాంక్‌ ఈద్గా, మాసబ్‌ట్యాంక్‌ హాకీ గ్రౌండ్‌, లంగర్‌హౌస్‌ ప్రాంతాల్లో సోమవారం ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకూ ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని తెలిపారు. మీర్‌ఆలం ఈద్గా ప్రాంతంలో… పురానాపూల్‌, కామటిపురా, కిషన్‌బాగ్‌ నుంచి ఈద్గా వైపునకు వచ్చేవారు బర్కత్‌పురా ఎక్స్‌రోడ్స్‌ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. వారు తమ వాహనాలను జూపార్క్‌ వద్ద పార్కింగ్‌ …

Read More »

సెక్రటేరియట్ తరలింపు ప్రక్రియ ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం నుంచి వివిధ శాఖలను తరలించనున్నారు. మొదటగా ఆర్‌అండ్‌బీ శాఖ తరలివెళ్లనుంది. లాంఛనంగా బుధవారం ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ కార్యాలయానికి రోడ్లు భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ వెళ్లారు. గురువారం నుండి అక్కడికే రావాలని సిబ్బందికి ఆదేశాలు చేశారు. ఈఎన్సీ కార్యాలయంలోనే మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేషీ ఉంది. ముందుగా మంత్రుల ఛాంబర్లను తరలించాలని సీఎం ఆదేశించారు. రెండు, మూడు రోజుల్లో మంత్రుల ఛాంబర్లు …

Read More »

ఇరు రాష్ట్రాలతో రద్దైన కేంద్ర హోంశాఖ సమావేశం

ఢిల్లీ: విభజన అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారులతో ఈ నెల 8న జరగాల్సిన కేంద్ర హోంశాఖ సమావేశం రద్దయింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి కొత్తగా రావడంతో సమావేశం రద్దు చేసినట్లు తెలిసింది. విభజన అంశాలను అధ్యయనం చేసిన తరువాత ఇరు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి భేటీ కానుంది.

Read More »

సరికొత్త ఆఫర్లతో వచ్చేసిన ‘సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌’

హైదరాబాద్‌ సిటీ: ఆషాఢమాసంలో తూకం పద్ధతిలో ప్రవేశపెట్టిన నంబర్‌ వన్‌ కిలోసేల్‌కు అన్ని వర్గాల ప్రజల నుంచి ఆదరణ పొందిన సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ మళ్లీ సరికొత్త ఆఫర్లతో ముందుకువచ్చింది. గురువారం నుంచి ప్రారంభమైన శ్రావణమాసాన్ని పురస్కరించుకుని దక్షిణాదివాసులకు వేలాది రకాల అద్భుతమైన వస్త్రాలు, కొత్త స్టాకును అందుబాటులో ఉంచింది. సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ అందిస్తున్న డిస్కౌంట్‌ ఆఫర్లను అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం …

Read More »

కాంగ్రెస్ పార్టీలో మరో సీనియర్ నాయకుడు కన్నుమూత

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్(60) కన్నుమూశారు. కొన్నాళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయనను ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం రాత్రి 9 గంటలకు హుటాహుటిన జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ముఖేశ్‌ గౌడ్‌కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇటీవల ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉన్నారు. …

Read More »

ఏసీబీ వలలో చిక్కిన నీటిపారుదలశాఖ డీఈఈ

పెద్దపల్లి: ఏసీబీ వలలో నీటిపారుదలశాఖ డీఈఈ రవికాంత్‌ చిక్కాడు. మిషన్ కాకతీయ చెరువు పనుల విషయంలో ఇందుర్తికి చెందిన రాజు వద్ద నుంచి రవికాంత్ లంచం డిమాండ్ చేశాడు. విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు, సదరు వ్యక్తి నుంచి రూ.80వేలు లంచం డబ్బును తీసుకుంటుండగా రవికాంత్ ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతనిని అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేశారు.

Read More »