Breaking News
Home / Tag Archives: tirumala

Tag Archives: tirumala

తిరుమలలో పెరుగుతున్న భక్తుల సంఖ్య

తిరుమల: లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఈ నెల 11 నుంచి 29 వరకు దాదాపు 1.56 లక్షల మంది శ్రీవారి దర్శనం చేసుకున్నారు. కాగా, తిరుమల శ్రీవారిని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ సోమవారం దర్శించుకున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నుంచి విముక్తి కల్పించాలని స్వామిని ప్రార్థించినట్టు తెలిపారు.

Read More »

10 జిల్లాల్లో 10 స్టార్ హోటళ్లు నిర్మిస్తాo: అవంతి

తిరుమల: రాష్ట్రంలో 10 జిల్లాల్లో 10 స్టార్ హోటళ్లు నిర్మించనున్నట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. తిరుమల శ్రీవారిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా మహమ్మారి నుంచి యావత్తు ప్రపంచానికి విముక్తి కలగాలని కోరినట్లు చెప్పారు. అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని కష్టాలు నుంచి గట్టెకించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు స్పష్టం చేశారు. త్వరలోనే నూతన టూరిజం పాలసీని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.

Read More »

టీటీడీకి రూ.88లక్షల హుండీ ఆదాయం

తిరుపతి: తిరుమల,తిరుపతి దేవస్థానానికి రూ.88లక్షల హుండీ రూపేణా ఆదాయం వచ్చిందని టీటీడీ ఆలయ అధికారులు తెలిపారు. గురువారం ఒక్కరోజే 11,493 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుaన్నారని పేర్కొన్నారు. 2903మంది తలనీలాలు సమర్పించుకున్నారని వివరించారు. శ్రీవారిని దర్శించుకునేందుకు 10వేల మంది భక్తులకు మాత్రమే అవకాశము ఉండగా ఈ సంఖ్యను 13వేలకు పెంచుతూ గురువారం నుంచి అమలు చేస్తున్నామని వెల్లడించారు. శుక్రవారం సర్వదర్శనానికి టోకెన్లు జారీ చేస్తున్నామని వారు తెలిపారు. రూ.10వేల విరాళాలు …

Read More »

రేపు శ్రీవారి దర్శనాలు రద్దు

తిరుమల: సూర్యగ్రహణం కారణంగా ఈనెల 19న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. ఉదయం 10.18 నుంచి మధ్యాహ్నం 1.38 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. శనివారం రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవ అనంతరం మూసే శ్రీవారి ఆలయ తలుపులు ఆదివారం మధ్యాహ్నం గ్రహణం వీడిన తర్వాత 2.30 గంటలకు తెరుస్తారు.

Read More »

శ్రీవారి దర్శన ఆన్‌లైన్‌ కోటా పెంచిన టీటీడీ

తిరుమల: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను టీటీడీ పెంచింది. ఈనెల 19 నుంచి 30వ తేదీ వరకు స్లాట్‌కు 250 మందికి అదనంగా దర్శనం చేయించేలా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాను గురువారం ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం రోజువారీ శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 6,750 నుంచి 9,750కి పెరగనుంది.

Read More »

తిరుమలకు భారీగా భక్తులు…

కరోనా కాలంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ… తిరుమల స్వామి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. అందువల్ల టీటీడీ పాలక మండలి తన రూల్ మార్చుకోవాల్సి వచ్చింది. ఇంతకు ముందు… తిరుమలకు వచ్చే భక్తులకు… సర్వ దర్శనం టోకెన్లను… ముందు రోజు మాత్రమే ఇస్తామని చెప్పిన టీటీడీ… టోకెన్ల క్యూలైన్లు భారీగా ఉండటంతో… రూల్ పక్కన పెట్టి… ఒక్కసారిగా టోకెన్ల పంపిణీ పెంచింది. దాంతో… జూన్ 26 వరకూ… …

Read More »

శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

తిరుమల: మూడు రోజుల ట్రయల్ రన్‌ తర్వాత భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్ టోకెన్లు కలిగిన భక్తులకు దర్శనం కల్పించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా 3 వేల మందికి శ్రీవారి దర్శనభాగ్యం కలుగనుంది. టైం స్లాట్ టోకెన్ల ద్వారా మరో 3 వేల మందికి శ్రీవారి దర్శనాన్ని చేసుకున్నారు. 53 మందికి వీఐపీ టిక్కెట్ల ద్వారా టీటీడీ దర్శనం కల్పించింది.

Read More »

నేటి విశేషాలు..

ఆంధ్రప్రదేశ్‌: అమరావతి: ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ ►ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల వైఎస్‌ఆర్ చేయూత పథకంపై చర్చ ►చిరువ్యాపారుల ప్రభుత్వ సహాయం పథకంపైనా చర్చించనున్న కేబినెట్‌ ►మూడు సవరణ బిల్లుల ముసాయిదాలపై చర్చించే అవకాశం ►పర్యావరణ, జీఎస్టీ, ఉన్నత విద్యా కమిషన్ సవరణ బిల్లులపై చర్చించే అవకాశం ►అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించే అవకాశం ►కురుపాం ఇంజినీరింగ్ కాలేజీ, 3 నర్సింగ్ కాలేజీలకు ఆమోదం …

Read More »

నేటి నుంచి శ్రీవారి దర్శనం.. ఉచిత టోకెన్ల కోసం పోటెత్తిన భక్తులు

తిరుమలలో శ్రీవారి ఉచిత దర్శనం టికెట్లను టీటీడీ బుధవారం అందజేసింది. తొలుత మొత్తం 24 కౌంటర్ల ద్వారా ప్రతి రోజు 3వేల టికెట్లను మంజూరు చేయాలని భావించారు. కానీ భక్తులు పోటెత్తడంతో అదనంగా మరో 750 టికెట్లను, అంటే మొత్తం ఒక్కరోజుకు 3750 టోకెన్లను భక్తులకు అందజేశారు. దర్శనానికి ఒక రోజుముందుగా ఈ టికెట్లను ఇస్తున్న సంగతి తెలిసిందే. తిరుమలలో మూడు రోజుల పాటు నిర్వహించిన ట్రయల్ రన్ దర్శనాలు …

Read More »