Breaking News
Home / Tag Archives: trs

Tag Archives: trs

టీడీపీలో చేరిన టీఆర్‌ఎస్‌ కీలక నేత

దమ్మపేట, ఖమ్మం: టీఆర్‌ఎస్‌ దమ్మపేట మండలాధ్యక్షుడు పానుగంటి సత్యం ఆదివారం అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సమక్షంలో టీడీపీలో చేరారు. దమ్మపేటలో టీడీపీ మండల అధ్యక్షుడు నాయుడు చెన్నారావు గృహంలో జరిగిన కార్యక్రమంలో మెచ్చా మాట్లాడుతూ టీడీపీలోకి తిరిగి సత్యం రావడం శుభ పరిణామన్నారు. సత్యాన్ని దమ్మపేట జడ్‌పీటీసీ కూటమి అభ్యర్థిగా ప్రకటించారు. సత్యం దమ్మపేట సర్పంచ్‌గా, ఎంపీపీగా ఒక్కో పర్యాయం పనిచేశారని గుర్తు చేశారు. 1988లో కాంగ్రెస్‌ నుంచి …

Read More »

టీడీపీ గురించి పీకే టీమ్ ఏం చెప్పిందంటే..: దేవినేని ఉమ

విజయవాడ: రాష్ట్రంలో ప్రశాంత్‌కిషోర్‌ కుట్రలకు వైసీపీ రూ. 300 కోట్లు ఖర్చు చేసిందని.. అయినా టీడీపీ గెలవబోతోందని ప్రశాంత్‌కిషోర్‌ టీమ్‌లో సిబ్బందే చెప్తున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ, కేసీఆర్‌, జగన్‌లు కుట్రలు చేసి గెలవాలని చూశారని విమర్శించారు. పోలవరం ఆపేందుకు కేసులేసిన కేసీఆర్‌, కవిత జగన్‌కు ముద్దయ్యారని మండిపడ్డారు. గ్రామాల్లో గొడవలు చేసేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని దేవినేని ఉమ విమర్శించారు. చంద్రబాబు …

Read More »

మొదలైన నగదు, మద్యం పంపిణీ

హైదరాబాద్‌ : పార్లమెంటు ఎన్నికల్లో ప్రచార గడువు ముగుస్తున్న కొద్దీ.. ‘కట్టల’పాములు బయటికి వస్తున్నాయి. నేటితో ప్రచారం ముగుస్తున్నందున.. సాయంత్రం నుంచే నగదు, మద్యం పంపిణీకి తెరలేవనుంది. ఇప్పటికే రూ.కోట్ల మొత్తంలో నగదు చోటా నేతలకు చేరిపోయిందని సమాచారం. ఆధిప త్యం కోసం అధికార పార్టీ, ఉనికి కోసం ప్రతిపక్షాలు పోటీ పడుతున్న ఈ ఎన్నికలు రెండింటికీ ప్రతిష్టాత్మకంగానే మారాయి. దీంతో నేతలంతా ఖర్చుకు వెనకాడటం లేదు. ప్రతి నియోజకవర్గంలో.. …

Read More »

కేసీఆర్, జగన్‌పై శివాజీ సంచలన వ్యాఖ్యలు

విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైసీపీ అధినేత జగన్‌పై నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేసీఆర్, మోదీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి కేసీఆర్‌తో జగన్ ఎందుకు స్నేహం చేస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. కేసీఆర్‌తో జగన్ స్నేహం పులిమీద స్వారీ లాంటిదేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా ఉండే ప్రభుత్వం వస్తే పోలవరం ప్రాజెక్టును ఖచ్చితంగా అడ్డుకుంటారని అన్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం …

Read More »

మాకు 300సీట్లొస్తే రాజకీయ సన్యాసం చేస్తారా?

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రధాని అభ్యర్థిగా ఎవరూ గుర్తించరని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.30 వేల కోట్లు గ్రాంటుగా ఇచ్చిందని తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన నిధుల అంశంపై లెక్కలతో సహా ఏ చౌరస్తాలోనైనా చర్చించేందుకు భాజపా సిద్ధంగా ఉందని దత్తాత్రేయ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై కేసీఆర్‌ తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని, అందుకు ఆయన …

Read More »

సోనియా దయతోనే కేసీఆర్‌ ఇలా ఉన్నారు

సంగారెడ్డి: సోనియా గాంధీ దయతోనే కేసీఆర్ ఫ్యామిలీ నేడు రాష్ట్రాన్ని ఏలుతోందని, అది మరిచిన కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకుడు జెట్టి కుసుమకుమార్ నిప్పులు చెరిగారు. దేశ దశ, దిశను నిర్ణయించే ఎన్నికలు ఇవి అని, కాంగ్రెస్‌ను గెలిపించి దేశాన్ని కాపాడాలని ప్రజలను కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ కాంగ్రెస్ పార్టీకే ఓటేశామని చెప్పారని, అయినా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్లేనని వ్యాఖ్యానించారు. …

Read More »

మెదక్ ఎంపీ సీటులోనే టీఆర్ఎస్‌కు అత్యధిక మెజార్టీ

హైదరాబాద్: పరిస్థితులు చూడబోతుంటే మెదక్ ఎంపీ సీటులోనే టీఆర్ఎస్‌కు అత్యధిక మెజార్టీ వెచ్చేట్లు కనిపిస్తోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆ మెజార్టీలో తనకు కూడా కొంత క్రెడిట్ ఇవ్వాలని హరీష్ రావును కోరారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ రావు, కేటీఆర్.. మెదక్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాల్లో మెజార్టీ సాధించే విషయమై సవాల్, ప్రతిసవాల్ విసురుకున్న విషయం తెలిసిందే. నేడు తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ …

Read More »

కేంద్రంలో మోదీ.. రాష్ట్రంలో కేసీఆర్‌ దోచుకుంటున్నారు: రాహుల్

వనపర్తి: ప్రధాని నరేంద్రమోదీకి అబద్దాలు చెప్పడం.. విద్వేషాలు రెచ్చగొట్టడం తెలుసని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వనపర్తిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మోదీ పాలన..కేసీఆర్‌ పాలన ఒకే తీరుగా ఉందన్నారు. కేంద్రంలో మోదీ.. రాష్ట్రంలో కేసీఆర్‌ దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఒకే ఒక్క కుటుంబం సర్వం దోపిడీ చేస్తోందని రాహుల్ పరోక్షంగా కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. మోదీ …

Read More »

పగలు కేటీఆర్‌తో టీడీపీ నేత భేటీ.. రాజకీయాలకు రాత్రి గుడ్‌ బై

టీడీపీ ఏకైక కార్పొరేటర్‌ సంచలన నిర్ణయం హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టడీపీ నుంచి గెలిచిన ఒకే ఒక్క కార్పొరేటర్‌ అతను. అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ సుహాసిని రంగ ప్రవేశం చేయడంతో పోటీ నుంచి తప్పుకున్నారు మందడి శ్రీనివాస్‌. అప్పటి నుంచీ ఆయన టీఆర్‌ఎస్‌లో చేరతారని ప్రచారం జరిగింది. బుధవారం మధ్యాహ్నం కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ …

Read More »

గ్రాడ్యుయేట్స్‌, టీచర్లు టీఆర్‌ఎస్‌‌కు వ్యతిరేకం: ఉత్తమ్

హైదరాబాద్: గ్రాడ్యుయేట్స్‌, టీచర్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకమని తేలిపోయిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌‌కుమార్‌రెడ్డి అన్నారు. బ్యాలెట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఓడిపోయారన్నారు. కేసీఆర్‌ 16 మంది ఎంపీలతో ప్రధాని అభ్యర్థిని ఎలా నిర్ణయిస్తారు? అని అడిగారు. కనీస ఆదాయ పథకం ప్రపంచంలోనే అద్భుతమైన పథకమని చెప్పారు. రాహుల్‌ ప్రధాని అయ్యాక ఏకకాలంలో రైతుల రుణాలు మాఫీ చేస్తామని స్పష్టంచేశారు.

Read More »