Breaking News
Home / Tag Archives: TS RTC Strike

Tag Archives: TS RTC Strike

సేవ్‌ ఆర్టీసీ..

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీని రక్షించాలని కోరుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి షరతుల్లేకుండా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ.. వరంగల్‌లో ఆర్టీసీ కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. హన్మకొండలోని వరంగల్‌ 1 డిపో నుంచి ఏక్‌శిలా పార్కు వరకు ‘సేవ్‌ ఆర్టీసీ’ అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి …

Read More »

ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం

హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె కొనసాగించాలా? వద్దా? అనే దానిపై కాసేపట్లో ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. సమ్మె కొనసాగింపుపై మంగళవారం ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర తర్జనభర్జనలకు లోనైన సంగతి తెలిసిందే. సమ్మె అంశాన్ని హైకోర్టు లేబర్‌ కోర్టుకు నివేదించడంతో.. సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాలు పునరాలోచనలో పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ బుధవారం కూడా సమావేశమైంది. సమ్మె విషయమై లేబర్‌ కమిషన్‌కు …

Read More »

ప్రభుత్వం.. ఆర్టీసీ మధ్య నలిగిపోతున్న కార్మికులు..!!

ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలు నెరవేరాలని చెప్పి గత 47 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలన్నది ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్ ప్రస్తుతం పక్కన పడింది. విలీనం చేయాలి అనే విషయాన్నీ పక్కన పెట్టి, తమ ప్రాధమిక డిమాండ్లు నెరవేర్చాలని, ప్రాధమిక డిమాండ్లు నెరవేరిస్తే సమ్మె విరమిస్తామని, కార్మికులతో చర్చలు జరపాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కానీ, ప్రభుత్వం కానీ, ఆర్టీసీ యాజమాన్యం కానీ …

Read More »

తనదే చివరి బలిదానం కావాలంటూ లేఖ

ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్‌ నరేశ్‌ మహబూబాబాద్‌: తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గత 40 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో మరో ప్రాణం బలైపోయింది. మహబూబాబాద్‌ డిపో డ్రైవర్‌ నరేష్‌ బుధవారం ఉదయం పురుగుల మందు తాగాడు. వెంటనే అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే నరేష్‌ ప్రాణాలు విడిచాడు. నరేష్‌కు భార్య పోలమ్మ, ఇద్దరు పిల్లలు శ్రీకాంత్‌, సాయికిరణ్‌ ఉన్నారు. …

Read More »

ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడికి యత్నం

హన్మకొండ : ఇటు సమస్యలు పరిష్కరించకుండా.. అటు చర్చలకు పిలవకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వ తీరుపై ఆర్టీసీ కార్మికులు కన్నెర్ర చేశారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులుగా స్పందించి సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌చేస్తూ ప్రజాపతినిధుల ఇళ్లను సోమవారం ముట్టడించారు. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు వరంగల్‌ రీజియన్‌ వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల పరిధిలో ఆర్టీసీ కార్మికులు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించారు. ఈ …

Read More »

కామారెడ్డిలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతం….

కామారెడ్డి జిల్లా: బాన్సువాడలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన ఉధృతంగా మారింది. ముందస్తుగా కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన కార్మికులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, మహిళా కండక్లర్ల ఆధ్వర్యంలో బాన్సువాడ బస్టాండ్ ముందు రాస్తారోకో చేపట్టారు. కేసీఆర్‌కు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సందర్భంగా జరిగిన తోపులాటలో ఓ కార్మికుడు సొమ్మసిల్లి పడిపోయాడు.

Read More »

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ మరోమారు సమీక్ష….

హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై సీఎం కేసీఆర్‌ మరోమారు సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమీక్షలో ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో జరిగిన విచారణ, ప్రత్యామ్నాయ విధానంపై మంత్రి పువ్వాడ అజయ్‌, ఆర్టీసీ అధికారులతో చర్చించారు. ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌శర్మ సమర్పించిన నివేదికపై ఈ రోజు ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో విచారణలో హైకోర్టు లేవనెత్తిన అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. శనివారం కేబినెట్‌ భేటీ జరగనున్న …

Read More »

అనుమతి నిరాకరణకు కారణం అడిగిన హైకోర్టు….

హైదరాబాద్‌: సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు నిర్వహించతలపెట్టిన ‘సకల జనుల సమరభేరి’ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై వారు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టి అనుమతి ఎందుకు నిరాకరిస్తున్నారో ఈ సాయంత్రం 4 గంటల్లోపు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సరూర్‌నగర్‌ మైదానంలో కాకుండా సభకు ఎక్కడ అనుమతిస్తారో తెలపాలని హైకోర్టు స్పష్టం చేసింది. సరూర్‌నగర్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు …

Read More »

ఆర్టీసీ సమ్మెపై కొనసాగుతున్న విచారణ….

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలపై ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కౌంటర్‌ దాఖలు చేసి ఆర్టీసీకి ఎలాంటి బకాయిలు లేవని నివేదికలో పేర్కొన్నారు. విభజన తర్వాత ఆర్టీసీ ఆస్తుల పంపకం జరగలేదని, ఆర్టీసీకి బకాయిల్లో 48శాతం తెలంగాణ, 52 శాతం ఏపీ చెల్లించాల్సి ఉందని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. ఇంకా ఆర్టీసీ ఆస్తులు ఎందుకు పంపిణీ కాలేదని న్యాయస్థానం ప్రశ్నించగా ఆర్టీసీ …

Read More »

కార్మికుల సమ్మెకుతోడు మొరాయిస్తున్న బస్సులు….

కేసముద్రం: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరగడమో బస్సులు మొరాయించడమో జరుగుతోంది. తాజాగా వరంగల్‌ నుంచి మహబూబాబాద్‌ వస్తున్న ఆర్టీసీ బస్సు కేసముద్రం మండలం పెనుగొండ శివారులో నిలిచిపోయింది. తాత్కాలిక డ్రైవర్‌, కండక్టర్లకు లోపాన్ని సరిచేసే పరిజ్ఞానం లేకపోవడంతో బస్సు కదల్లేదు. గంటసేపటి వరకు మరోబస్సు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు ప్రైవేటు వాహనాల్లో …

Read More »